గుజరాత్‌‌లో నీటి కోసం నదిని తవ్విస్తున్న వజ్రాల వ్యాపారి

కరువుతో అల్లాడిపోతున్న సౌరాష్ట్ర ప్రాంతంలోని రైతులకు త్రాగునీరు అందించాలనే కోరికతో సూరత్‌కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి మూడు నెలల నుంచి ఓ నదిని తవ్వుతున్నాడు. వివరాల్లోకి వెళితే, సూరత్‌లో వజ్రాల వ్యాపారం నిర్వహిస్తున్న జీరంభాయ్ థేసియా (65) అనే వ్యాపారి తన స్వగ్రామమైన అమ్రేలీ గ్రామంలో భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు చేపట్టాడు.

"నేనో రైతు కుమారుడిని. చిన్నప్పటి నుంచి ఒక్క చుక్క నీరు కూడా దొరక్క మా గ్రామస్థులు పడ్డ అవస్థలను చూశాను. ఆనాడే నేను డబ్బు సంపాదించాలని, నా గ్రామానికి ఏదైనా చేయాలని అనుకున్నా. ఇప్పుడు నాదగ్గర అన్నీ ఉన్నాయి. వాటన్నింటినీ సమాజానికి ఇస్తాను' అని పేర్కొన్నారు.

' నా చివరి ఊపిరి వరకూ రైతుల కోసం పని చేస్తా. నది తవ్వకంలో పనిచేస్తున్న కార్మికులకు కావాల్సిన ఆహారాన్ని నా భార్యే స్వయంగా సమకూరుస్తోంది" అని 'నవ్ గుజరాత్ సమయ్' పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో జీరంభాయ్ థేసియా చెప్పారు.పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన గుజరాత్ రాష్ట్రంలో సౌరాష్ట్ర ప్రాంతం అన్ని రంగాల్లో కూడా వెనుకబడి ఉందన్నారు.

In Gujarat's parched Saurashtra, a man quietly digs a river to help farmers

మొత్తం 8 కిలోమీటర్ల దూరం పాటు 'తేబీ' నదిని తవ్వాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకూ జరిగిన పావు భాగం పని పూర్తయిందని వివరించారు. అంతేకాదు తాను తవ్విస్తున్న నదిపై ఓ ఆనకట్ట నిర్మించే ఆలోచన కూడా ఉందన్నారు. గుజరాత్ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేకుండానే పనులను పూర్తి చేస్తున్నామన్నారు.

తన ప్రాజెక్టు పూర్తైతే వచ్చే 500 ఏళ్ల వరకూ ఈ ప్రాంతంలో నీటికి కొరత ఉండదని, అన్ని సీజన్లలో రైతులు పంటలు పండించు కోవచ్చన్నారు. తద్వారా ఈ ప్రాంతమంతా 'నందనవనం'గా మారుతుందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+