వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Crime News: పట్టపగలు రూ.1.20 కోట్ల దోపిడీ.. గంటల వ్యవధిలో నిందితులను పట్టుకున్న పోలీసులు..

|
Google Oneindia TeluguNews

గ్వాలియర్‌లో సోమవారం పట్టపగలు రూ.1.20 కోట్ల దోపిడీకి పాల్పడిన ఘటనను ఆరు గంటల్లోనే పోలీసులు ఛేదించారు. కంపెనీకి చెందిన ఓ ఉద్యోగి తన సహచరులతో కలిసి దోపిడీకి ప్లాన్‌ చేశాడని గుర్తించారు. దొంగలు సహా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం డబ్బును రికవరీ చేశారు. మరో నిందితుడు పరారీలో పోలీసులు తెలిపారు. అతని కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.

హరేంద్ర ట్రేడింగ్

హరేంద్ర ట్రేడింగ్

మెహతాబ్ సింగ్ గుర్జార్ కు గ్వాలియర్ లోని డీడీ నగర్‌లో హరేంద్ర ట్రేడింగ్ పేరుతో కంపెనీ కార్యాలయం ఉంది. ఈ కంపెనీలో బాల్ కిషన్ సాహు కూడా భాగస్వామిదా ఉన్నారు. ప్రమోద్ గుర్జార్, సునీల్ శర్మ ఈ కంపెనీలో ఉద్యోగులుగా పని చేస్తున్నారు. వీరు వారం వారం బ్యాంక్ డబ్బు డిపాజిట్ చేయడానికి వెళ్తారు. డబ్బు తీసుకెటప్పుడు వారు తము ఈ డబ్బును సొంతం చేసుకోవాలి చూశారు. తమ ఇద్దరు సహచరులతో కలిసి దోపిడీకి ప్లాన్ చేశారు.

ఇద్దరు దొంగలు

ఇద్దరు దొంగలు

అలానే సోమవారం ఉదయం ప్రమోద్ గుర్జార్, సునీల్ శర్మ హ్యుందాయ్ వెర్నా MP07 CF-6430 కారులో ఇందర్‌గంజ్ బ్యాంక్ ఆఫ్ బరోడాకు బయలుదేరారు. 1.20 కోట్లు ఉన్న ట్రంకు పెట్టెలో సీటుపై ఉంచారు. వారు ఛపర్వాలా వంతెన నుంచి రాజీవ్ ప్లాజా వీధికి చేరుకున్న వెంటనే, ఇద్దరు దొంగలు కారు ఆపి ట్రంక్‌ పెట్టను తెరిచి డబ్బుతో ఎత్తుకెళ్లారు.

సీసీ కెమెరా దృశ్యాలు

సీసీ కెమెరా దృశ్యాలు

అనంతరం వారు డబ్బు పోయిందంటు యజమానికి చెప్పారు. యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్త్ చేశారు. ప్రమోద్ గుర్జార్, సునీల్ శర్మను అ అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తామే దోపిడీకి ప్లాన్ చేశామని వారు ఒప్పుకున్నారు.

English summary
The police cracked the robbery of Rs 1.20 crore in broad daylight within six hours. An employee of the company was found to have planned the robbery along with his colleagues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X