Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

PM Modi: గొప్ప మనస్సు చాటుకున్న నరేంద్ర మోడీ.. అంబులెన్స్ కోసం కాన్వాయ్‍ని పక్కకు ఆపిన ప్రధాని..

ప్రధాన మంత్రి మోడీ మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు. మంగళవారం హిమాచల్ ప్రదేశ్‌లోని చంబి పట్టణంలో అంబులెన్స్‌కు దారి ఇవ్వడానికి ప్రధాని నరేంద్ర మోడీ తన కాన్వాయ్‌ను ఆపారు. మోడీ ఒక రోజు ఎన్నికల ప్రచారం నిమిత్తం హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు.
అక్కడ చంబి & సుజన్‌పూర్‌లలో 2 బహిరంగ సభలలో మోడీ పాల్గొన్నారు. అంబులెన్స్ కు దారి ఇవ్వడానికి మోడీ కాన్వాయ్ పక్కకు ఆగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గుజరాత్
ప్రధాని కాన్వాయ్‌ అంబులెన్స్‌కు దారి ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల గుజరాత్ పర్యటన సందర్భంగా, ప్రధాని మోదీ అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్‌కు ప్రయాణిస్తుండగా అంబులెన్స్‌కు మార్గం కల్పించేందుకు తన కాన్వాయ్‌ను పక్కకు ఆపారు. ప్రధానమంత్రి మోదీ కాన్వాయ్ రోడ్డు పక్కన ఆగి ఉన్న వీడియోను కూడా రాష్ట్ర బీజేపీ శాఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

In Himachal Pradesh, the Prime Minister stopped his convoy for an ambulance

68 అసెంబ్లీ స్థానాలు
హిమాచల్ ప్రదేశ్ లో నవంబర్ 12న అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది.డిసెంబర్ 8న హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. హిమాచల్ ప్రదేశ్‌లో (Himachal Pradesh) 68 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి మోడీ మంగళవారం హిమాచల్ ప్రదేశ్ పర్యటించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+