వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సియాచిన్‌లో జవాన్లను కలిసిన రాజ్‌నాథ్ సింగ్

|
Google Oneindia TeluguNews

సియాచిన్ : రక్షణ శాఖ బాధ్యతలు చేపట్టిన రాజ్‌నాథ్ సింగ్ కశ్మీర్‌లో పర్యటించారు. అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఉండే సియాచిన్ గ్లేసియర్‌లో విధులు నిర్వహిస్తున్న సైనికులతో కాసేపు ముచ్చటించారు. సియాచిన్‌లో ధైర్యసాహసాలతో దేశ రక్షణ చేస్తున్న సైనికులకు రాజ్‌నాథ్ సెల్యూట్ చేశారు. మాతృభూమి రక్షణ కోసం ప్రాణాలకు సైతం తెగించి విధులు నిర్వహిస్తున్న జవాన్లను చూసి గర్వంగా ఉందని అన్నారు. త్రివిధ దళాల్లో పనిచేసేందుకు తమ పిల్లలను పంపుతున్న తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలుపుతూ స్వయంగా లేఖలు పంపుతానని రాజ్‌నాథ్ ప్రకటించారు.

అత్యంత ఎత్తైన ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్న సైన్యం ధైర్యసాహసాలను రాజ్‌నాథ్ ప్రశంసించారు. సియాచిన్‌లో విధి నిర్వాహణలో భాగంగా ఇప్పటి వరకు 1100 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరమరణం పొందిన ఆ జవాన్లకు మంత్రి నివాళులర్పించారు. ఆ అమరవీరుల త్యాగాలను, సేవలను దేశం ఎన్నటికీ మరవదన్న రాజ్‌నాథ్.. భారత జాతియావత్తూ వారికి రుణపడి ఉంటుందని చెప్పారు.

In his first visit Rajnath Singh Meets Troops in Siachen

రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్, ఇతర సైనిక ఉన్నతాధికారులు సియాచిన్‌కు వెళ్లారు. అక్కడ జరుగుతున్న కార్యకలాపాలు, ఆర్మీ సహకారం తదితర అంశాల గురించి మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీనగర్‌ చేరుకున్న ఆయన అక్కడ విధులు నిర్వహిస్తున్న జవాన్లతో రాజ్‌నాథ్ కాసేపు ముచ్చటించారు.

దేశంలో రెండో అత్యంత ఎత్తైన కారంకోరం పర్వత శ్రేణుల్లో సియాచిన్ గ్లేసియర్ ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ భూమిగా దీనికి గుర్తింపు ఉంది. చుట్టూ మంచు, శీతల గాలులతో కూడిన ఆ ప్రాంతంలో దాదాపు మైనస్ 60డిగ్రీల ఉష్ణోగ్రతలో జవాన్లు విధులు నిర్వహిస్తారు.

English summary
Union Defence Minister Rajnath Singh visited Siachen, the highest militarised zone in the world, on Monday to meet the armed forces troops posted there. In his first visit since assuming office in the new government, Singh will also interacted with army personnel in Srinagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X