ముంబాయి బిల్డింగ్ ఘటనలో పెరుగుతున్న మృతులు... 12కు చేరిన సంఖ్య...
ముంబాయి భవనం కూలిపోయిన ఘటనలో 12మంది మృతి చెందారు. నాలుగు అంతస్తుల భవనంలో మొత్తం 50 నుండి 60 మంది వరకు చిక్కుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. కాగా భవనంలో చిక్కుకున్న ఓ చిన్నారీతోపాటు 5గురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. కాగా కూలిపోయిన భవనం 100 సంవత్సరాల క్రితం నిర్మించారని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తెలిపారు. కాగా అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కోనసాగిస్తున్నారు.
మరోవైపు భవనం కూలిపోయిన ప్రాంతం ఇరుకుగా ఉండడంతో సహయక చర్యలకు ఇబ్బంది కల్గుతోందని సిబ్బంది తెలిపారు. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా స్థానికులను తరలిస్తున్నారు. ఇక బిల్డింగ్‌ను 1995లో నిర్మించారని అధికారులు తెలిపారు. అయితే ఈ భవనాన్ని కూల్చివేయాల్సిందిగా 2017లోనే నోటీసులు జారీ చేశామని గ్రేటర్ ముంబాయి మున్సిపల్ అధికారులు ప్రకటించారు.

ఇక ఘటనపై మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఎరియా డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ ఉదయ్ సామంత్ స్పందించారు. 2012 నుంచి భవనం ప్రైవేటు బిల్డర్ చేతిలో ఉందన్నారు. దీన్ని చాలా కాలం క్రితమే కూల్చివేయాల్సి ఉన్నప్పటికీ.. బిల్డర్ నిర్లక్ష్యంతో వదిలేశారన్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. ఆమే తెలిపారు.మరోవైపు భవనంలో నివసిస్తున్న వారు భవనాన్ని ఖాళీ చేసేందుకు నిరాకరించడంతో సంఘటనకు కారణంగా తెలుపుతున్నారు.












Click it and Unblock the Notifications