పార్లమెంటులోమన రాజకీయ నేతల కునుకు (పిక్చర్స్)
న్యూఢిల్లీ: ధరల పెరుగుదలపై చర్చ సందర్భంగా బుధవారంనాడు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ కునుకు తీయడం చర్చనీయాంశంగా మారింది. ప్రత్యర్థుల నుంచి తీవ్రమైన విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో అదే ప్రధాన చర్చగా కూడా మారింది.
ఆ సంఘటనతో కాంగ్రెసు నాయకులు తీవ్రమైన చిక్కుల్లో పడ్డారు. రాహుల్ గాంధీ చర్యను సమర్థించడానికి వారు పడరాని పాట్లు పడ్డారు, పడుతున్నారు. నిజానికి, పార్లమెంటులో నిద్రపోయినవాళ్లలో రాహుల్ గాంధీ మాత్రమే మొదటివారు కారు.
తీవ్రమైన పనుల ఒత్తిడి కారణంగా పార్లమెంటులో కునుకు తీసినవారు ఉన్నారు. ఆలా నిద్రపోతూ కనిపించిన కొంత మంది రాజకీయ నేతలను చూడండి....

మన్మోహన్ సింగ్
నిరుడు ఫిబ్రవరి 28వ తేదీన ఆర్థిక బడ్జెట్ ఆమోదం పొందే సమయంలో అప్పటి ప్రధాని, ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ కునుకు తీశారు.

ప్రణబ్ ముఖర్జీ
కెమెరాలు తన వైపు తిప్పినప్పటికీ ముంచుకొస్తున్న నిద్రను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిలువరించుకోలేకపోయారు.

వీరప్ప మొయిలీ
మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం ప్రసంగిస్తుండగా మాజీ పెట్రోలియం, సహజవాయువు మంత్రి వీరప్ప మొయిలీ కనుకు తీస్తూ కెమెరాకు చిక్కారు.

పవన్ కుమార్ బన్సల్
పార్లమెంటు సమావేశంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతుండగా మాజీ రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సల్ కునుకు తీశారు.

రాజీవ్ శుక్లా
ఐపియల్ చీఫ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రాజీవ్ శుక్లా సభా కార్యక్రమాలకు దూరమై కాసేపు కునుకు తీశారు. ఇది ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతుండగా జరిగింది.

కమల్‌నాథ్
లోకసభ సమావేశంలో ప్రసంగాలు సాగుతుండగా మాజీ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ కునుకు తీయడం కనిపించింది.

లాలూ ప్రసాద్ యాదవ్
ప్రజలకు హాస్యాన్ని పంచిపెట్టే లాలూ ప్రసాద్ యాదవ్ చాలా సార్లు పార్లమెంటులో కునుకు తీసిన సంఘటనలున్నాయి. 2011 సెప్టెంబర్‌లో ముందు సీట్లో కూర్చుని నిద్రపోతున్న ఆయనను మేల్కోల్పడానికి అప్పటి లోకసభ స్పీకర్ మీరా కుమార్ ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చింది.

ములాయం సింగ్ యాదవ్
సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ నిద్రపోతూ కెమెరా కంటికి చిక్కిన సందర్భం ఉంది.

హెచ్‌డి దేవెగౌడ
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి దేవెగౌడకు విధాన సభలో నిద్రపోయే అలవాటు ఉండడంపై పలుమార్లు చర్చ జరిగిన విషయం తెలిసిందే.

వీరభద్ర సింగ్
అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా నిద్రపోతూ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ పలుమార్లు కనిపించారు.

దిగ్విజయ్ సింగ్
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పక్కన కూర్చుని కొద్దిరోజుల క్రితం కాంగ్రెసు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ నిద్రపోయిన సంఘటన వార్తాపత్రికలకు ఎక్కింది.

రాఖీ బిర్లా
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 49 రోజులు మాత్రమే అధికారంలో ఉంది. ఈ సమయంలో జరిగిన శాసనసభా సమావేశంలో మాజీ మహిళా శిశు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాఖీ బిర్లా నిద్రను నిలువరించుకోలేకపోయారు.

సంతోష్ గంగ్వార్
బిజెపి బరేలీ ఎంపి, టెక్స్‌టైల్స్ సహాయ మంత్రి సంతోష్ గంగ్వార్ పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తుండగా నిద్రపోయారు.

రాహుల్ గాంధీ
ధరల పెరుగుదలపై చర్చ జరుగుతుండగా లోకసభలో రాహుల్ గాంధీ నిద్రపోవడం తాజా సంఘటన. ఇది చర్చకు దారి తీసింది.












Click it and Unblock the Notifications