హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన: నిర్మలా సీతారామన్ సక్సెస్ స్టోరీ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2014, అక్టోబర్ 11న సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన(ఎస్ఏజివై) ప్రారంభించారు. ఈ పథకంలో ప్రతీ పార్లమెంటు సభ్యుడు ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని 2016 వరకు ఆ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దాలి.

ఈ పథకాన్ని ఓ సవాల్‌గా స్వీకరించిన వాణిజ్య, పరిశ్రమల శాఖ కేంద్రమంత్రి నిర్మలా సీతారమన్ రెండు గ్రామాలను దత్తత తీసుకుని వాటి అభివృద్ధి కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లాలోని పెదమైనవాని లంక(పిఎం లంక), తూర్పుతాళ్లు గ్రామాలను నవంబర్ 7, 2014లో దత్తత తీసుకున్నారు.

నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో నిర్మలా సీతారమన్ దత్తత తీసుకున్న గ్రామాల్లో అభివృద్ధి ఒక్కసారి పరిశీలిద్దాం.

ఎస్ఏజివై మొదటి దశ అకోబర్ 11, 2014 నుంచి ఏప్రిల్ 11, 2014 వరకు. ఈ ఆరు నెలల్లో సీతారామన్, ఆమె బృందం.. దత్తత తీసుకున్న గ్రామాల్లో తాగునీరు, రవాణా, శుభ్రత, నైపుణ్య అభివృద్ధి, కమ్యూనిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, విద్యా, ఆర్థిక భరోసా లాంటి కార్యక్రమాలను చేపట్టారు. ప్రతీ సెక్టార్‌లో చాలా ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి.

తాగునీరు: నాణ్యమైన తాగునీటిని అందించేందుకు తూర్పుతాళ్లు, పిఎం లంకల్లో రెండు ఆర్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగింది.

స్వచ్ఛ భారత్‌ అభియాన్‌లో భాగంగా నిర్మలా సీతారామన్ బయో డిజిస్టర్ టాయ్‌లెట్లు, ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వెస్ట్ మేనేజ్‌మెంట్ ప్రొగ్రాం ప్రారంభించారు. ఆ రెండు గ్రామాలకు 44 బియో టాయ్‌లెట్లను పైలెట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేశారు. పారిశుధ్యం, శుభ్రత కోసం ప్రతీ ఇంటికి (బయో డిగ్రడబుల్, నాన్ డిగ్రడబుల్ చెత్తను వేసేందుకు) రెండు చెత్త బుట్టలను అందజేయడం జరిగింది.

స్కిల్ డెవలప్‌మెంట్: ఉప్పును తయారు చేయడంతోపాటు పుట్టగొడుగుల సాగు, వెర్మి కంపోస్ట్ వ్యవసాయంలో శిక్షణ కేంద్రాలను ప్రారంభించారు.

నిర్మలా సీతారామన్

నిర్మలా సీతారామన్

పిఎం లంక, తూర్పుతాళ్లు రెండు గ్రామాలు ‘ఐడియల్ విలేజ్' పేరిట ఏడాది కాలంలో అభివృద్ధి చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఎంపిలాడ్ నిధులతో పాటో కేంద్ర పథకాలతో అభివృద్ధి చేస్తామని సీతారామన్ చెప్పారు.

సీతారామన్

సీతారామన్

రెండు గ్రామాలకు నీరు అందించేందుకు పరకాలశేషావతారం కాలు విస్తవరణ పనులను ఏప్రిల్ 8, 2015లో ప్రారంభించారు.

బయో డిజిస్టర్ టాయ్‌లెట్స్

బయో డిజిస్టర్ టాయ్‌లెట్స్

పారిశుద్ధ్యంలో కొత్త సంకేతికతను జత చేసి బయో డిజిస్టర్ టాయ్ లెట్లను రెండు గ్రామాల్లో నిర్మించడం జరిగింది. వీటి వల్ల నీటి కాలుష్యం ఉండదు, భూగర్భ జలం పెరుగుతుంది.

వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రొగ్రాం

వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రొగ్రాం

ప్రతీ ఇంటి నుంచి చెత్తను తీసుకెళ్లేందుకు 12మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తారు. వీరందరూ మూడు చక్రాల సైకిళ్లపై చెత్తను తరలిస్తారు.

పుట్టగొడుగుల సాగు

పుట్టగొడుగుల సాగు

పిఎం లంకలో ఏప్రిల్ 7, 2015న, తూర్పుతాళ్లలో ఏప్రిల్ 8, 2015న పుట్టగొడుగుల సాగు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

పారిశుద్ధ్య కార్యక్రమం

పారిశుద్ధ్య కార్యక్రమం

రెండు గ్రామాల్లో ప్రతీ ఇంటి నుంచి సేకరించిన చెత్తను వేసేందుకు డంపింగ్ యార్డును ఏర్పాటు చేయడం జరిగింది.

డిజిటల్ కమ్యూనిటీ సెంటర్

డిజిటల్ కమ్యూనిటీ సెంటర్

రెండు గ్రామాల్లోని ప్రజల కోసం ఏర్పాటు చేసిన సైంటిఫిక్ సాలిడ్ వేస్టే మేనేజ్‌మెంట్ కార్యక్రమంలో మంత్రి నిర్మలా సీతారామన్.

ఆర్ఓ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్

ఆర్ఓ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్

పిఎం లంకలో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ పరిశీలిస్తున్న కేంద్రమంత్రి నిర్మల. ఈ ప్లాంట్లను ఏప్రిల్ 7న పిఎం లంకలో, తూర్పుపాళ్లలో ఏప్రిల్ 8, 2015న ప్రారంభించడం జరిగింది.

పరకాల శేషావతారం ఛానల్

పరకాల శేషావతారం ఛానల్

నీటి అవసరాల కోసం ఏప్రిల్ 8, 2015న పరకాల శేషావతారం ఛానల్ విస్తరణ పనులు ప్రారంభించిన కేంద్రమంత్రి.

పరీక్షా కేంద్రం

పరీక్షా కేంద్రం

రెండు గ్రామాల్లోని 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఇతర సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా పరీక్షా కేంద్రాలను రెండు గ్రామాల్లోనే ఏర్పాటు చేశారు.

ఉప్పు సాగు

ఉప్పు సాగు

ఉప్పును తయారు చేయడంతోపాటు పుట్టగొడుగుల సాగు, వెర్మి కంపోస్ట్ వ్యవసాయంలో శిక్షణ కేంద్రాలను ప్రారంభించారు.

సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన

సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన

గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2014, అక్టోబర్ 11న సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన(ఎస్ఏజివై) ప్రారంభించారు.

కమ్యూనిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్

ఏప్రిల్ 7, 2015లో ఆర్ట్ డిజిటల్ కమ్యూనిటీ సెంటర్‌కు పిఎం లంకలో శంకుస్థాపన చేశారు. ఈ కేంద్రంలో కంప్యూటర్ శిక్షణ కేంద్రం, మహిళా భవన్, లైబ్రరీ, ఈ పంచాయత్, బహుల అవసరాల కోసం హాల్స్, సోలార్ ప్యానెల్స్‌తో 24 కరెంటు ఉంటుంది.

ఫిబ్రవరి 13, 2015లో రెండు గ్రామాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు పరీక్షల కోసం ఎక్కువ దూరం ప్రయాణించకుండా తూర్పుతాళ్లు గ్రామంలోనే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఆర్థిక భద్రత కోసం రెండు గ్రామాల్లో నవంబర్ 16, 2014 నుంచి నవంబర్ 18, 2014 వరకు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. రెండు గ్రామాల్లోని కుటుంబాలను జన్ ధన్ యోజన, ఆధార్ స్కీంలో చేర్చడం జరిగింది.

3 ఆర్థిక భరోస పథకాల(అటల్ పెన్షన్ యోజన, ప్రధాన మంత్రి జీవన్ భీమా సురక్ష యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి యోజన)పై రెండు గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.

ముందున్న సవాళ్లు

పిఎం లంక సముద్ర తీరంలో కోతను నివారించడం మంత్రి ఎదుర్కొనున్న సవాళ్లలో పెద్దదిగా చెప్పుకోవచ్చు. కోత ఇప్పటికి ప్రమాదం లేకపోయినప్పటికీ నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

ఇక రెండో దశలో ఎస్ఏజివైలో ఏం కవర్ చేస్తారు?

ఎస్ఏజివో రెండో దశకు నిర్మలా సీతారామన్ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. పిఎం లంకలో అండర్ డ్రైనేజి సిస్టమ్, రెండు గ్రామాల్లోనూ సోలార్ పవర్ వీధి దీపాలు, రెండు గ్రామాల్లో రోడ్లకు మెరుగులు, సిసి రోడ్ల నిర్మాణం, మరో 1700 బయో డిజిస్టర్ టాయ్‌లెట్ల ఏర్పాటు, నెల్లీ కాలువపై వంతెనను ఏర్పాటు చేయడం లాంటి కార్యక్రమాలను మంత్రి ఇప్పటికే తమ ప్రణాళికలో చేర్చుకున్నారు.

Utilised all my MPLADS funds for 2014-15. Projects in Andhra Pradesh- roads,water,toilets,drainage,railways,community infra initiated.

Posted by Nirmala Sitharaman on Friday, April 10, 2015

English summary
Prime Minister Narendra Modi had launched the Sansad Adarsh Gram Yojana (SAGY) on October 11, 2014, under which every MP is supposed to adopt one village and develop it into Model Village by 2016.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X