వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీంకోర్టులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఊరట

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. కేజ్రీవాల్ పై నమోదు అయిన క్రిమినల్ కేసులో ఆయన వ్యక్తిగతంగా హాజరుకాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ఉత్తరప్రదేశ్ లోని అమేథి లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మీద క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. కేసు విచారణకు తప్పకుండా హాజరు కావాలని ఇటివల అమేథి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అమేథి కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని మనవి చేస్తూ కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

In a relief to Delhi Chief Minister Arvind Kejriwal

జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ అభయ్ మనోహర్ సప్రేలతో కూడిన ధర్మాసనం మంగళవారం పిటిషన్ విచారించింది. కేజ్రీవాల్ తరఫు న్యాయవాది రాజీవ్ ధవన్ వాదనలు వినిపించారు. సుప్రీం కోర్టు కేసు పూర్తి వివరాలు తెలుసుకునింది.

అమేథి కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మినాహాయింపు ఇచ్చిందని ఆయన తరుపు న్యాయవాది రాజీవ్ ధవన్ చెప్పారు. కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో అమేథి కోర్టు కేజ్రీవాల్ ను తప్పకుండా హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేసింది.

English summary
In a relief to Delhi Chief Minister Arvind Kejriwal, the Supreme Court on Tuesday dispensed with, for now, his personal appearance before an Amethi court in connection with a criminal case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X