Ind Vs Pak: ఇండియాకు కలిసిరాని ఎంపైర్ నిర్ణయాలు..
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా అహ్మదాబాద్ లో భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. ఈ మ్యాచ్ లో ఎంపైర్ నిర్ణయాలు భారత్ కలిసి రాలేదు. 14వ ఓవర్ ను రవీంద్ర జడేజా వేశాడు. రెండో బంతి రిజ్వాన్ ప్యాడ్స్ తాకింది. వెంటనే జడేజా, వికెట్ కీపర్ రాహుల్ అప్పిల్ చేశాడు. దీంతో ఎంపైర్ ఔట్ ఇచ్చాడు. కానీ రిజ్వాన్ రివ్యూ కోరాడు. దీంతో రిప్లేలో బంతి ప్యాడ్స్ కు తాకినా.. బాల్ ట్రాకర్ బంతి వికెట్లకు తాకలేదు. దీంతో రజ్వాన్ ను నాటౌట్ గా ప్రకటించారు.
25 ఓవర్ ను కుల్దీప్ యాదవ్ వేశాడు. మూడో బంతి బాబర్ ప్యాడ్స్ కు తాకింది. దీంతో కుల్దీప్, వికెట్ కీపర్ కెఎల్ రాహుల్ అప్పిల్ చేశారు. కానీ ఎంపైర్ ఔట్ ఇవ్వలేదు. దీంతో రోహిత్ కుల్దీప్, రాహుల్ డిస్కర్షన్ చేసి రివ్యూ కోరాడు. రివ్యూలో బంతి ప్యాడ్స్ తాగింది. అలాగే వికెట్లు తాకుతున్నట్లు బాల్ ట్రాకర్ లో తేలింది. అయిందే ఎంపైర్ కాల్ కింద బాబర్ నాటౌట్ గా ప్రటించారు. దీంతో ఎంపైర్ నిర్ణయం భారత్ కు కలిసి రాలేదు.

రెండు ఎంపైర్ నిర్ణయాలు భారత్ కు కలిసి రాలేదు. మరోవైపు పాక్ కెప్టెన్ బాబర్, వికెట్ కీపర్ రిజ్వాన్ ధాటిగా ఆడుతోన్నారు. అబ్దుల్లా షఫీక్ 24 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. 38 బంతుల్లో 6 ఫోర్లతో 36 పరుగులు చేసిన ఇమామ్ హుల్ హక్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో కీపర్ కెఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్ లో మహ్మద్ సిరాజ్ భారీగా పరుగులు ఇస్తున్నాడు.
ప్రస్తుత మ్యాచ్ పరిస్థితిని చూస్తే పాకిస్థాన్ 300 పైచిలుకు పరుగులు చేసే అవకాశం ఉంది. ఇండియా బౌలర్లు వికెట్ తీయడానకి ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications