మాజీ సీఎం కొడుకులు, కూతురు, డాక్టర్ రాజ్ కుమార్ ఫ్యామిలీ కోడలు, ఎంపీ టిక్కెట్ విషయంలో ఇంకా !

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కర్ణాటకలోని సీఎం సిద్దరామయ్య టీమ్ ముమ్మరంగా సన్నాహాలు చేస్తోంది. ఎంపీ టికెట్ కోసం ఆశావహులు పెద్దఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్నప్పటికీ కర్ణాటకలోని శివమొగ్గ లోక్‌సభ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయంలో సిద్దరామయ్య ప్రభుత్వం కష్టాల్లో పడింది.

మాజీ ముఖ్యమంత్రి కుటుంబంలోని ముగ్గురి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో శివమొగ్గ లోక్ సభ నియోజక వర్గం సీటు పంపిణి విషయంలో ఏ విషయం కొలిక్కిరాలేదు. మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కుమార్తె, కన్నడ కంఠీరవుడు డాక్టర్ రాజ్ కుమార్ ఇంటి పెద్ద కోడలు, హ్యాట్రిక్ హీరో డాక్టర్ శివరాజ్ కుమార్ భార్య గీతా శివరాజ్ కుమార్ ఈసారి ఎలాగైనా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలనే పట్టుదలతో ఉన్నారని వెలుగు చూసింది.

In the matter of the MP ticket, the discussions in the former CMs family are not clear in Karnataka.
ప్రియురాలిని చంపేసి శవాన్ని ఏం చేశాడంటే ?, భర్తను వదిలేసిన ఆంటీ మీద మోజుతో ఇలా !

కర్ణాటకలోని 28 లోక్ సభ నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేసింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పుతో అధికారానికి దూరం అయిన బీజేపీ ఎలాగైనా లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ పుంజుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. శివమొగ్గతో పాటు చాలా నియోజకవర్గాల్లో ఇన్ చార్జి మంత్రులు పోటీకి దిగే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు చెబుతున్నారు.

శివమొగ్గ నుంచి కర్ణాటక మాజీ సీఎం బంగారప్ప కుమారుడు, ప్రస్తుత మంత్రి మధు బంగారప్ప బరిలోకి దిగుతారని వెలుగు చూడటం ఉత్కంఠగా మారింది. మరోవైపు మంత్రి మధు బంగారప్ప సోదరి, హ్యాట్రిక్ హీరో శివకుమార్ కుమార్ భార్య గీతా శివరాజ్ కుమార్ కూడా శివమొగ్గలో పోటీ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. శివమొగ్గ సీటు గీతా శివరాజ్ కుమార్ కు ఇచ్చి ఉత్తర కన్నడ లోక్ సభ నియోజక వర్గం నుంచి ఆమె సోదరుడు కుమార్ బంగారప్ప లేదా ఆర్ దేశ్ పాండేకి ఇవ్వాలని సిద్దరామయ్య, డీకే శివకుమార్ ఆలోచిస్తున్నారని తెలిసింది.

In the matter of the MP ticket, the discussions in the former CMs family are not clear in Karnataka.
సుమలత మీద పోటీ, పక్కా క్లారిటీ ఇచ్చిన జాగ్వార్ హీరో, తెలుగింటి ఆడపడుచు రిలాక్స్, మోదీ చేతిలో !

కుమార్ బంగారప్ప శివమొగ్గ లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కుమార్ బంగారప్పను రంగంలోకి దించి ఈడిగ కులం ఓట్లు రాబట్టి బీజేపీకి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైందని తెలిసింది. మరోవైపు ఉత్తర కన్నడలో గీతా శివరాజ్ కుమార్, శివమొగ్గలో కుమార్ బంగారప్ప పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కుటుంబ కలహాలు సద్దుమణిగేలా సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ బంగారరప్ప ఫ్యామిలీ విషయంలో చర్చలు జరుపుతున్నారని తెలిసింది.

ఇదే విషయం ఆలోచించి దక్షిణ కన్నడ లోక్ సభ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా మధు బంగప్పను నియమించినట్లు సమాచారం. ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ ఎన్నికల ప్రచారంలో మధుబంగప్ప చరుకుగా పాల్గొంటున్నారు. శివమొగ్గలో కుమార్‌ బంగారప్పను తీసుకురావాలని కాంగ్రెస్‌ హైకమాండ్‌ మాస్టర్‌ ప్లాన్‌ వేసింది. గతంలో కుమార్ బంగారప్ప కాంగ్రెస్‌లో చేరేందుకు మొగ్గు చూపారు. అదే సమయంలో కుమార్ బంగారప్ప సీఎం సిద్ధరామయ్యను కలిసిన ఫోటో కూడా వైరల్‌గా మారింది. అయితే కుమార్ బంగారప్ప కాంగ్రెస్‌లో చేరడానికి ఆయన సొంత సోదరుడు, ప్రస్తుత మంత్రి మధుబంగప్ప అడ్డుపడుతున్నారని, అందుకే సిద్దరామయ్య సందిగ్ధంలో పడ్డారని ప్రచారం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+