Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

MLA: ఎమ్మెల్యే కొడుకు ప్రభుత్వ ఉద్యోగి, లంచం, ఇంట్లో రూ. 6 కోట్లు సీజ్, కొంచెం తక్కువ అయ్యింది పుష్పా !

అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకు ప్రభుత్వ ఉద్యోగి. టెండర్ ఇచ్చే వియషంలో కాంట్రాక్టర్ నుంచి రూ. 40 లక్షలు లంచం తీసుకుంటూ చిక్కిపోయాడు. ఇంట్లో రూ. 6 కోట్ల క్యాష్ సీజ్ చేశారు.

బెంగళూరు/దావణగెరె: అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కొడుకు గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. కేఎస్ డీల్ అధ్యక్షుడి స్థానంలో ఉన్న ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకుని ఆడుతున్న ఆయన కొడుకు, ప్రభుత్వ ఉద్యోగి మీద లోకాయుక్త పంజా విసిరింది. ఒక కాంట్రాక్టు ఇచ్చే విషయంలో రూ. 40 లక్షలు లంచం తీసుంటూ ఎమ్మెల్యే కొడుకు పోలీసులకు అడ్డంగా చిక్కిపోయాడు. పనిలో పనిగా ఎమ్మెల్యే కొడుకు ఇంటిలో అధికారులు సోదాలు చేశారు. ఎమ్మెల్యే కొడుకు, ప్రభుత్వ అధికారి అయిన వ్యక్తి ఇంటిలో ఏకంగా రూ. 6 కోట్ల నగదు చిక్కడం కలకలం రేపింది. ప్రభుత్వ అధికారి, ఆయన తండ్రి, అధికార పార్టీ ఎమ్మెల్యేతో సహ చాలా మంది మీద కేసులు నమోదు అయ్యాయి. నగదు మాత్రమే ఆరు కోట్ల రూపాయలు చిక్కడంతో మిగిలిన బంగారం, ఆస్తులు విలువ ఎంత ఉంటుందో ? అని ప్రజలు ఎవరికి వాళ్లు ఊహించుకుంటున్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే కొడుకు పవర్ ఫుల్ అధికారి

సిట్టింగ్ ఎమ్మెల్యే కొడుకు పవర్ ఫుల్ అధికారి

కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. కర్ణాటకలోని దావణగెరె జిల్లాలోని చెన్నగిరి నియోజక వర్గం ఎమ్మెల్యే మాడాళ్ విరుపాక్షప్ప బీజేపీలో సీనియర్ నాయకుడు. ఎమ్మెల్యే విరుపాక్షప్ప కేఎస్ డీఎల్ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. ఇంచుమించు మంత్రి క్యాడర్ ర్యాంకులో బీజేపీ ఎమ్మెల్యే విరుపాక్షప్ప ఉన్నారు. విరుపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ కర్ణాటక ప్రభుత్వంలో గెజిటెడ్ అధికారి ర్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు.

తండ్రిని అడ్డం పెట్టుకుని టెండర్ బ్లాక్

తండ్రిని అడ్డం పెట్టుకుని టెండర్ బ్లాక్

కేఎస్ డీఎల్ కు కెమికల్స్ సరఫరా చేసే టెండర్ పిలిచారు. ఈ టెండర్ కే.వి. అశోక్ అనే అతనికి దక్కింది. అయితే తండ్రి అధ్యక్షుడిగా ఉన్న కేఎస్ డీఎల్ ప్రభుత్వ సంస్థకు రసయనాలు సరఫరా చెయ్యడానికి అశోక్ కు అవకాశం ఇవ్వకుండా ఎమ్మెల్యే కొడుకు, ప్రభుత్వ అధికారి ప్రశాంత్ అడ్డుకున్నాడు. టెండర్ ఆర్డర్ కాఫీలు బయటకు రాకుండా చేసిన ప్రశాంత్ కాంట్రాక్టర్ అశోక్ ను పర్సనల్ గా తనతో కలవాలని చెప్పాడు.

పర్సనల్ ఆఫీసు

పర్సనల్ ఆఫీసు

ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ప్రశాంత్ బెంగళూరులోని కుమారపార్క్ సమీపంలోని క్రెసెంట్ రోడ్డులో ప్రైవేట్ కార్యాలయం పెట్టుకున్నాడు. అశోక్ కు ఫోన్ చేసిన ప్రశాంత్ ఆ కాంట్రాక్టు నీకు రావాలంటే తనకు రూ. 81 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తరువాత చాలా చర్చలు జరిగాయి. అయితే చివరికి టెండర్ దక్కించుకోవాలని అనుకున్న అశోక్ ఎమ్మెల్యే విరుపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ కు ఆయన అడిగినంత లంచం ఇవ్వడానికి డిసైడ్ అయ్యాడు.

అడ్వాన్స్ గా రూ. 40 లక్షలు

అడ్వాన్స్ గా రూ. 40 లక్షలు

గురువారం బెంగళూరులో లోకాయుక్త పోలీసులను కలిసి కాంట్రాక్టర్ అశోక్ ఎమ్మెల్యే విరుపాక్షప్ప కుమారుడు, కర్ణాటక ప్రభుత్వ అధికారి ప్రశాంత్ తనకు కాంట్రాక్టు ఆర్డర్ కాపీ ఇవ్వకుండా వేధిస్తూ రూ. 81 లక్షలు లంచం డిమాండ్ చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు. లోకాయుక్త పోలీసులు రంగంలోకి దిగారు. గురువారం రాత్రి 7 గంటల సమయంలో కుమారపార్క్ సమీపంలోని ప్రైవేట్ కార్యాలయంలో ప్రశాంత్ కాంట్రాక్టర్ అశోక్ నుంచి రూ. 40 లక్షలు లంచం అడ్వాన్స్ గా తీసుకున్నాడు.

కొంచెం తక్కువ అయ్యింది పుష్పా

కొంచెం తక్కువ అయ్యింది పుష్పా

టేబుల్ మీద 40 లక్షలు పెట్టుకుని పుష్పా సినిమాలో ఓ కట్ట తక్కువ అయ్యింది పుష్పా అంటూ లెక్క పెట్టినట్లు ప్రశాంత్ నోట్లు లెక్కిస్తున్న సమయంలో లోకాయుక్త అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ డబ్బు ఎక్కడిది అని లోకాయుక్త అధికారులు ప్రశ్నిస్తే ప్రభుత్వ అధికారి, ఎమ్మెల్యే కొడుకు అయిన ప్రశాంత్ సమాధానం చెప్పలేక నీళ్లు నమిలాడు. ప్రశాంత్ ప్రైవేట్ ఆఫీసులో ఉన్న ఐదు మందిని లోకాయుక్త అధికారులు అరెస్టు చేశారు.

ఇంట్లో ఆరు కోట్లు క్యాష్ సీజ్

ఇంట్లో ఆరు కోట్లు క్యాష్ సీజ్

ప్రశాంత్ ను అతని ప్రైవైట్ ఆఫీసు నుంచి నేరుగా బెంగళూరులోని డాలర్స్ కాలనీలోని అతని ఇంటికి పిలుచుకుని వెళ్లారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు సుమారు 10 గంటల పాటు ప్రశాంత్ ఇంటిలో సోదాలు చేసిన లోకాయుక్త అధికారులు రూ. 6 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. కొడుకు లోకాయుక్త వలలో పడ్డాడని తెలుసుకున్న దావణగెరెలో నివాసం ఉండే బీజేపీ ఎమ్మెల్యే విరుపాక్షప్ప మడాల్ బెంగళూరుకు పరుగు తీశారు.

ఎలక్షన్ టైమ్ లో ఏంట్రా ఇది ?

ఎలక్షన్ టైమ్ లో ఏంట్రా ఇది ?

భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయిన ప్రభుత్వ అధికారి ప్రశాంత్, ఆయన తండ్రి, బీజేపీ ఎమ్మెల్యే విరుపాక్షప్ప మడాళ్ తో పాటు మిగిలిన వారి మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని లోకాయుక్తకు చెందిన సీనియర్ పోలీసు అధికారి ఆయన్ను కలిసిన మీడియాకు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకు, ప్రభుత్వ అధికారి లోకాయుక్త వలలో పడటం కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ దెబ్బతో బీజేపీ నాయకులు తలలు పట్టుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+