Tripura Elections 2023: త్రిపురలో తిరిగి అధికారంలోకి బీజేపీ..! సీఎం మాణిక్ సాహా గెలుపు..
త్రిపురలో బీజేపీ 60 స్థానాలకు గాను 32 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
త్రిపురలో తిరిగి అధికారం దక్కించుకునే దిశగా దూసుకెళ్తోంది. త్రిపురలో ప్రస్తుతం 32 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్, లెఫ్ట్ కూటమి 16 స్థానాల్లో ముందంజలో ఉంది. టీఎంపీ 11 చోట్ల, ఇతరులు ఒక్క చోట ఆధిక్యంలో ఉన్నారు. టౌన్ బర్దోవాలి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి మాణిక్ సాహా గెలుపొందారు. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన ఆశిష్ కుమార్ సాహాపై 832 ఓట్ల తేడాతో గెలుపొందారు.
ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో త్రిపురలో భద్రతను కట్టుదిట్టం చేశారు, భద్రతా బలగాలు మొబైల్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. 21 చోట్ల కౌంటింగ్ జరుగుతోందని, 5-8 రౌండ్ల కౌంటింగ్ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట వరకు ట్రెండ్స్‌పై స్పష్టత వస్తుందని ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) గిత్తె కిరణ్‌కుమార్ దినకరరావు తెలిపారు. కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్ సెపాహిజాలా జిల్లాలోని ధన్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి సబ్రూమ్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.













Click it and Unblock the Notifications