Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమేథిలో వీపీసింగ్ మేనకోడలు: కంటోన్మెంట్‌లో అపర్ణా

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం ఆరాటపడుతున్న కాంగ్రెస్ - ఎస్పీ కూటమికి చెక్ పెట్టేందుకు బిజెపి గట్టి షాకే ఇచ్చింది.

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం ఆరాటపడుతున్న కాంగ్రెస్ - ఎస్పీ కూటమికి చెక్ పెట్టేందుకు బిజెపి గట్టి షాకే ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథి స్థానం నుంచి రాణి గరిమా సింగ్‌ను బిజెపి తన అభ్యర్థిగా నిలిపింది.

కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ మాజీ సతీమణే గరిమా సింగ్. వారిద్దరూ ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారు. సంజయ్ సింగ్ రెండో భార్య అమీతా సింగ్ కూడా బరిలో నిలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

బిజెపి ద్వారా రాజకీయ అరంగ్రేటం చేస్తున్న గరిమా సింగ్ తన రక్తంలోనే రాజకీయం ఉందని కూడా వ్యాఖ్యానించారు. గరిమా సింగ్ ఎవరో కాదు బీజేపీ 'కమండల్' రాజకీయాలను వ్యతిరేకించి లౌకిక విధానాలకు ప్రాణ ప్రతిష్ఠచేసిన మాజీ ప్రధానమంత్రి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్‌కుసాక్షాత్తు మేనకోడలు కావడం గమనార్హం.

మంత్రులకూ నో చాన్స్

38 మంది అభ్యర్థుల జాబితాను ఎస్పీ యూపీశాఖ అధ్యక్షుడు నరేశ్ ఉత్తమ్ ప్రకటించారు. ఘాజీపూర్ స్థానం నుంచి రాజేశ్ కుశ్వాహకు చోటు లభించింది. మంత్రి విజయ్ మిశ్రా స్థానే రాజేశ్ కుశ్వాహకు ఎస్పీ టిక్కెట్ ఇచ్చింది. శివ్‌పాల్ సింగ్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడిగాఉన్నందునే మాజీ మంత్రి షాదాబ్ ఫాతిమాకు అఖిలేశ్ యాదవ్ టిక్కెట్ నిరాకరించారు. అదేవిధంగా ఘాజీపూర్, ఆజంగఢ్ స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేశారు. జహురాబాద్ స్థానం నుంచి మహేంద్ర చౌహాన్, ఆజంగఢ్ స్థానంలో వాసిం అహ్మద్ స్థానే నఫీస్ అహ్మద్‌కు టిక్కెట్ఇచ్చారు.

రాచకుటుంబంలో విబేదాల వల్లనే...

రాచకుటుంబంలో విబేదాల వల్లనే...

దాయియా రాజ వంశానికి చెందిన గరిమా సింగ్‌కు అమేథి ప్రజల మద్దతు పుష్కలంగా ఉంది. సంజయ్ సింగ్ అమీతాను రెండో వివాహం చేసుకోవడంతో గరిమా సింగ్ విడిపోయారు. అదే ప్యాలెస్‌లో తన కొడుకు, ముగ్గురు కూతుళ్లలో గరిమా సింగ్ విడిగా ఉంటున్నారు. అమేథి తన
జన్మస్థలం అని, తనకు తప్పనిసరిగా ప్రజలు మద్దతు పలుకుతారని ఆమె పేర్కొన్నారు. ఆస్తిలో హక్కు కోసం పోరాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయంగా కంచుకోటగా ఉన్న అమేథీలో సంజయ్ సింగ్ రాజ కుటుంబంలో విభేదాలకు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు తోడయ్యాయి. ఈ
విభేదాలను తమకు అనువుగా మార్చుకోవాలని బిజెపి నిర్ణయించింది.

గరిమా సింగ్‌తో ప్రజాపతి సై

గరిమా సింగ్‌తో ప్రజాపతి సై

తొలుత ఆమె కుమారుడు అనంత్ విక్రం, సోదరి మహిమ బిజెపిలో చేరారు. తొలి నుంచి రాజకీయాల పట్ల నిరాసక్తిగా ఉన్న గరిమా సింగ్.. కుటుంబ ప్రయోజనాల పరిరక్షణ కోసం రంగ ప్రవేశం చేశారు. 2017 అసెంబ్లీ ఎన్నికలే కాదు 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ అమేథీ నుంచి రాహుల్

గాంధీపై రాణి గరిమా సింగ్ పోటీకి బీజేపీ రంగం సిద్ధం చేస్తోంది. రాణి గరిమాసింగ్ ప్రత్యర్థిగా అఖిలేశ్ క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే తిరిగి ఎస్పీ అభ్యర్థిగా గాయత్రి ప్రజాపతి తలపడనున్నారు.

స్వతంత్ర పోరుకైనా...

స్వతంత్ర పోరుకైనా...

గాయత్రి ప్రజాపతి పోటీచేసినా తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని సంజయ్ సింగ్ ప్రస్తుత భార్య అమితాసింగ్ పేర్కొన్నారు. అయితే తనకు పార్టీ టిక్కెట్ ఇస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తంచేశారు. అమేథి అసెంబ్లీ నియోజకవర్గం రాయబరేలీ, అమేథి లోక్ సభ స్థానాల్లో

చెరిసగం చీలిపోయి ఉంది. తాను నియోజకవర్గ ప్రజల కోసం చాలా కష్టపడి పని చేస్తున్నానని అమీతా సింగ్ పేర్కొన్నారు. కనుక తానే అమేథిలో బలమైన అభ్యర్థినని పేర్కొన్నారు.

ఇద్దరు రాణుల సంగ్రామంగా మారనున్న అమేథి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత రాష్ట్రమంత్రి గాయత్రి ప్రజాపతి..కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అమీతా సింగ్ పై 10 వేల పై చిలుకు ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. బిజెపి అభ్యర్థికి పదివేల లోపు ఓట్లు

మాత్రమే లభించాయి. ఒకవేళ ఇద్దరు రాణులు తలపడినా ఒక బిసి నాయకుడిగా గాయత్రి ప్రజాపతికే ఇప్పటికీ ఆధిక్యం ఉన్నది. అమేథి అసెంబ్లీ స్థానంలో వచ్చేనెల 27న పోలింగ్ జరుగనున్నది.

బిజెపి చిల్లర రాజకీయం చేస్తోంది..

బిజెపి చిల్లర రాజకీయం చేస్తోంది..

అమేథి నుంచి గరిమా సింగ్‌ను అభ్యర్థిగా బిజెపి ప్రకటించి చిల్లర రాజకీయాలు చేస్తోందని అమీతా సింగ్ ఆరోపించారు. స్థానికులకు ఎప్పుడో దూరమైన వ్యక్తిని అభ్యర్థిని ఆ పార్టీ ఎంచుకున్నదన్నారు. రాజకీయంగా గరిమా సింగ్ ప్రజలకు దూరమయ్యారని తెలిపారు. అయితే గరిమా సింగ్,

అమీతా సింగ్ లను అమేథీ వాసులు తమ రాణులుగానే పిలుచుకోవడం విశేషం.

లక్నో కంటోన్మెంట్ నుంచి అపర్ణా...

లక్నో కంటోన్మెంట్ నుంచి అపర్ణా...

లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ రెండో కోడలు అపర్ణాయాదవ్ ఎస్పీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా రీటా బహుగుణపై తలపడనున్నారు. రీటా బహుగుణ ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరారు.

అపర్ణాకు అయినా సీటు...

అపర్ణాకు అయినా సీటు...

అధికార సమాజ్ వాదీ పార్టీలో కుటుంబ ఆధిపత్యం కోసం జరిగిన ఘర్షణలో అపర్ణా యాదవ్ ప్రధాన పాత్ర వహించారు. ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధనా‌గుప్తా కుమారుడు ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణాయాదవ్. ములాయం సింగ్ యాదవ్ తమ్ముడు శివ్‌పాల్ యాదవ్

శిబిరంలో చేరిన అపర్ణాయాదవ్‌కు యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ టిక్కెట్ ఇస్తారా? లేదా? అన్న అనుమానాలకు తెర దించుతూ ములాయం ఆశీస్సులతో ఆమెకు లక్నో కంటోన్మెంట్ స్థానం టిక్కెట్ ఇచ్చారు. ఎస్పీ ప్రకటించిన నాలుగో జాబితాలో వారణాసి, చందౌలీ, ఘాజీపూర్,

జాంపూర్, బాలియాలతోపాటు లక్నో కంటోన్మెంట్ స్థానానికి అపర్ణా యాదవ్ అభ్యర్థిత్వానికి అనుమతినిచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+