హవాలా సోమ్ము: బంగారు షాప్ ల్లో ఐటీ దాడులు
చెన్నై: ఢిల్లీ నగరంతో సహా దేశంలోని వివిధ నగరాల్లోని బంగారు నగల దుకాణాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. నల్లకుభేరులు ఎంత మంది పెద్ద మొత్తంలో బంగారు నగలు కొనుగోలు చేశారు ? వారెవరు ? వారి వివరాలు ఏమిటి ? అని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
చెన్నై నగరంలోనే దాదాపు 20 ప్రాంతాల్లో ఐటీ అధికారులు బంగారు నగల షాపుల్లో సోదాలు చేశారు. పెద్ద నోట్లు రద్దుతో ఇంత కాలం నల్లధనం దాచుకున్న పెద్దలు ఇంత డబ్బు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే లేనిపోని సమస్యలు ఎదురౌతాయని ఆందోళన చెంది ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా బంగారు నగలు కొనుగోలు చేశారు.
అయితే ముందుగానే ఇలా జరుగుతుందని ఐటీ అధికారులు పసిగట్టారు. ఏం చేస్తారో చూద్దాం ? అంటు వారు సైలెంట్ గా వారిపని వారు చేసుకుంటు ఉండిపోయారు. ఐటీ అధికారులకే మస్కా కొట్టాలని కొందరు నల్లకుభేరులు గుట్టు చప్పుడు కాకుండా రూ. కోట్ల విలువైన బంగారు నగలు కొనుగోలు చేసేశారు.

చెన్నైలోని నేతాజీ సుభాష్ చంద్రభోస్ రోడ్డులోని బంగారు నగల షాప్, వడ్డీ వ్యాపారం చేసే కార్యాలయాలు, చిట్ ఫడ్ కార్యాలయాలు, హవాల సోమ్ము ఉన్న వారి కార్యాలయాల్లో దాడులు చేసి పరిశీలించారు. రూ.1,000, రూ.500 నోట్లు కమీషన్ పద్దతితో మార్చి ఇస్తామని ప్రజలను మోసం చేసి వారి నుంచి పెద్ద మొత్తంలో నగదు సేకరించారని వెలుగు చూసింది.
అదే విధంగా చెన్నై నగరంలోని ఇలాంటి కార్యాలయాల మీద అధికారులు దాడులు చేసి పలు కీలకమై డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. బంగారు నగల దుకాణాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల క్లిప్లింగ్స్ పరిశీలించారు. పెద్ద మొత్తంలో బంగారు నగలు కొనుగోలు చేసిన వారి పూర్తి వివరాలు సేకరించారు.
పెద్ద మొత్తంలో బంగారు నగలు కొనుగోలు చేసిన వారిని అదుపులోకి తీసుకోవాడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. దేశంలో శని, ఆదివారాల్లో 150 మందికి పైగా అధికారులు వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. విషయం తెలుసుకున్న నల్లకుభేరులు ఇప్పుడు ఆందోళన చెంది మాయం అయ్యారు.












Click it and Unblock the Notifications