Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫేక్ న్యూస్ నమ్మొద్దంటూ ఐటీ శాఖ: ఐటీ రిటర్న్స్ దాఖలుకు రేపే ఆఖరు తేదీ

న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలుకు గడువు పెంచుతున్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై ఐటీ శాఖ స్పందించింది. అవన్నీ తప్పుడు వార్తలేనని స్పష్టం చేసింది. 2018-19 సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు గడువులో ఎలాంటి పొడిగింపు లేదని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్(సీబీడీటీ) తేల్చి చెప్పింది.

2018-19 సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పణకు గడువు రేపటికి(ఆగస్టు 31) వరకే ఉందని సీబీడీటీ స్పష్టం చేసింది. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువును పొడిగిస్తూ సీబీడీటీ ఆర్డర్ పేరుతో చలామణి అవుతున్న వార్తల్లో నిజం లేదని ఐటీ విభాగం తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.

 Income tax return filing deadline not extended again, clarifies tax department

కేంద్ర ప్రభుత్వం ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు మరింత గడువు ఇచ్చిందని, సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఉత్తర్వులు జారీ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు విస్తృతంగా ప్రచారమయ్యాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన ఐటీ శాఖ అవన్నీ తప్పుడు వార్తలని స్పష్టం చేసింది.

సాధారణంగా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ సమర్పించడానికి చివరి తేదీ జులై ముప్పై ఒకటే కానీ.. అయితే గడువు తేదీని పెంచాలని అభ్యర్థనలు వెల్లువెత్తడంతో రిటర్నుల దాఖలుకు ఆగస్టు 31 వరకు సమయం ఇచ్చింది ఐటీశాఖ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+