వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

8 లక్షణాలు ఉంటే అలర్ట్, కేంద్రం కొత్త మార్గదర్శకాలు, రాష్ట్రాలకు లేఖ

|
Google Oneindia TeluguNews

కరోనా.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి సృష్టిస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీచేసింది. ర్యాపిడ్ టెస్ట్ ఎక్కువ చేయాలని కోరింది. ఆర్టీ పీసీఆర్ లేట్ అవుతున్నందున ర్యాపిడ్ టెస్ట్ మేలని అభిప్రాయపడింది. దీంతోపాటు ఇంటిలో తమకు తాము పరీక్ష చేసుకోవాలని సూచించింది. అలాగే ఒమిక్రాన్ లక్షణాలతోపాటు మరో 4 సింప్టమ్స్ ఉంటే వెంటనే పరీక్ష చేయించుకోవాలని కోరింది.

దగ్గు ఉండి జ్వరం, లేకపోయినా జ్వరం, వంటి నొప్పులు, తలనొప్పి, గొంతు నొప్పి, రుచి, వాసన కోల్పోవడం, అలసట, అతిసారం, ఊపిరి ఆడటంలో ఇబ్బందులు ఉంటే కరోనా అనుమానిత కేసుగా భావించాలని కోరింది. టెస్టులో నెగిటివ్ వచ్చినా.. అనుమానిత కేసుగా పరిగణించాలని.. తప్పకుండా టెస్ట్ చేసుకోవాలని కోరింది. ఈ మేరకు రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ కూడా రాసింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని స్పస్టంచేసింది.

Increase use of rapid antigen tests, encourage testing at home: Centre to states

ఇటు ఒమిక్రాన్ హై టెన్షన్ పుట్టిస్తోంది. వ్యాక్సినేషన్ కంపల్సరీ.. దీంతోపాటు మాస్క్ ధరించి, సోషల్ డిస్టన్స్ తప్పకుండా పాటించాల్సిందే. తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. అయితే న్యూ ఇయర్ వేడుకల నియంత్రణపై జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటాయని న్యాయస్థానం పేర్కొంది. న్యూ ఇయర్ వేడుకలపై ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసిందని హైకోర్టు తెలిపింది.

రాష్ట్రంలో టీకా ఫస్ట్ డోస్ 100 శాతం, రెండో డోస్ 66 శాతం పూర్తయిందని తెలిపింది. మార్గదర్శకాలు ఉల్లంఘించిన వారిపై తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంచేసింది. డిసెంబర్ 31 రోజున మాత్రం మద్యం ఎరులై పారింది. గతేడాది కన్నా ఎక్కువగానే విక్రయాలు జరిగాయి.

English summary
union health secretary has written to states and UTs to increase rapid antigen tests as Covid cases across the country go north.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X