వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలాంటి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు కట్: అన్ని సమస్యలకూ మూలం అదే: సీఎం యోగి

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని కీలక వ్యాఖ్యలు చేశారు. నానాటికీ పెరిగిపోతోన్న జనాభే అన్ని సమస్యలకూ ప్రధాన కారణమని ఆయన చెప్పారు. అన్ని విపత్తులకు జనాభా పెరుగుదలే మూలమనే విషయాన్న అందరికీ తెలిజేస్తామంటూ ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జనాభా నియంత్రణ విషయంలో సమాజాన్ని చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యతను అందరూ స్వీకరించాలని అన్నారు.

YSRTP..ఇక జనంలోకి: ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష: వనపర్తిలో వైఎస్ షర్మిలYSRTP..ఇక జనంలోకి: ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష: వనపర్తిలో వైఎస్ షర్మిల

వచ్చే తొమ్మిదేళ్లలో జనాభాను నియంత్రించడానికి చేపట్టాల్సిన చర్యలపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కొత్తగా పాపులేషన్ పాలసీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువమంది ఉన్న వారు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు చేయాలంటూ ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం అందించే ఎలాంటి సబ్సిడీలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించాలని యోగి ఆదిత్యనాథ్ ఈ పాలసీలో పొందుపరిచారు.

 Increasing population is the root cause of major problems says Uttar Pradesh CM Yogi Adityanath

ఇద్దరు పిల్లలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులను కూడా రద్దు చేసేలా ఈ ముసాయిదాను రూపొందించారు. ఉత్తర ప్రదేశ్.. ప్రపంచంలో అత్యధికమంది జనాభా ఉన్న అయిదో రాష్ట్రంగా గుర్తింపు పొందింది. జనాభా పెరుగుదలలో ఇప్పుడున్న వేగం కొనసాగితే 2027 నాటికి భారత్.. అత్యధిక జనాభా ఉన్న దేశాల జాబితాలో చైనాను వెనక్కి నెట్టేస్తుందని, అగ్రస్థానానికి చేరుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో యోగి ఆదిత్యనాథ్.. జనాభాను నియంత్రించడానికి ప్రయత్నాలు చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.

ప్రస్తుతం ఈ పాపులేషన్ పాలసీ మీద విమర్శలు వ్యక్తమౌతోన్నాయి. రాజకీయ కారణాలకు సామాజికాంశాన్ని జోడిస్తోన్నారంటూ ప్రత్యర్థులు విమర్శిస్తోన్నారు. ఒక సామాజిక వర్గం కోసమే దాన్ని అమలు చేస్తోన్నారంటూ ఆరోపిస్తోన్నారు. దీన్ని యోగి ఆదిత్యనాథ్ పెద్దగా పట్టించుకోలేదు. ఈ విమర్శలను ఆయన తేలిగ్గా తీసుకున్నారు. ప్రతి సామాజిక వర్గం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తాము పాపులేషన్ పాలసీని రూపొందించినట్లు చెప్పారు.

English summary
On the occasion of World Population Day, Uttar Pradesh Chief Minister Yogi Adityanath said that the increasing population is the 'root cause' of major problems including inequality.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X