
సుందర్ పిచాయ్‌తోనే గేమ్సా?: పాకిస్థాన్ ఫ్యాన్‌కు దిమ్మతిరిగే రిప్లై, ట్రోల్ వీర లెవల్!
వాషింగ్టన్: దిగ్గజ సంస్థ గూగుల్ సీఈవో, భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ దీపావళి సందర్భంగా సోమవారం ఉదయం ట్విట్టర్ వేదికగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంలోనే ఆదివారం జరిగిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ గురించి కూడా ప్రస్తావించారు. ఈ ఉత్కంఠ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ వీరోచిత పోరాటంతో భారత్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.
భారత్-పాక్ మ్యాచ్‌పై సుందర్ పిచాయ్
ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ వేదికగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు సుందర్ పిచాయ్. 2022 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ అద్భుత విజయాన్ని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 'నేను ఈ రోజు చివరి మూడు ఓవర్లను చూసి సంబరాలు చేసుకున్నాను. ఏమి ఆట, ఏమి ప్రదర్శన' అని పిచాయ్ వ్యాఖ్యానించారు. భారత్ తమ చిరకాల ప్రత్యర్థి పాక్‌పై నాలుగు వికెట్ల తేడాతో ఆదివారం విజయం సాధించి ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2022లో శుభారంభం చేసింది.
ట్రోల్ చేస్తూ..‘అది కూడా చేశాను :) భువీ, అర్ష్‌దీప్ నుంచి ఏమి స్పెల్ ప్రదర్శన’ అని తనదైన శైలిలో జవాబిచ్చారు. |
సుందర్ పిచాయన్‌ను ట్రోల్ చేయబోయి భంగపడ్డ పాక్ అభిమాని
అయితే, పాకిస్తాన్ మద్దతుదారుగా కనిపించిన ఒక నెటిజన్.. పిచాయ్.. ఆట మొదటి మూడు ఓవర్‌లను కూడా చూశారా? అని ట్రోల్ చేసేలా ప్రశ్నిస్తాడు(అయితే, అప్పుడు భారత్ వేగంగా వికెట్లు కోల్పోయింది). దీనికి గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో అతనికి దిమ్మదిరిగే సమాధానం ఇచ్చారు. పాకిస్థాన్ అభిమానిని సుందర్ పిచాయ్ ట్రోల్ చేస్తూ..'అది కూడా చేశాను :) భువీ, అర్ష్‌దీప్ నుంచి ఏమి స్పెల్ ప్రదర్శన' అని తనదైన శైలిలో జవాబిచ్చారు.
సుందర్ పిచాయ్‌పై భారత నెటిజన్ల ప్రశంసలు
కాగా, భారత బౌలర్లు భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్‌ల స్పెల్‌ను ప్రస్తావించారు. పాక్ బ్యాటింగ్ మొదటి ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోయింది. దీన్నే ప్రస్తావిస్తూ సుందర్ పిచాయ్ పాక్ అభిమానిని ట్రోల్ చేయడం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో భారత అభిమానులు ఊరుకుంటారా?... సుందర్ పిచాయ్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
సుందర్ అన్న మంచి ఫాంలో ఉన్నారు!
సుందర్ అన్న మంచి ఫాంలో ఉన్నారంటూ ఒకరు.. మరొకరు పిచాయ్‌తో పెట్టుకుంటే ఇలానే ఉంటుందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. సుందర్ పిచాయ్ నుంచి కాఫీ సుందర్ రిప్లై అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. మా భారతీయ సోదరులతో పెట్టుకోవద్దంటూ ఇంకొకరు చెప్పుకొచ్చారు. సుందర్ పిచాయ్‌ను ప్రశంసిస్తూనే.. ఆ పాక్ అభిమానిని ట్రోల్ చేస్తున్నారు భారత నెటిజన్లు.