• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారత్-పాకిస్తాన్ టీ20 మ్యాచ్‌కు మూడినట్టే: ఒవైసీ దారిలో ఆమ్ ఆద్మీ: రద్దు చేయాలంటూ డిమాండ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ ఒకవంక ఆరంభమైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్ వేదికగా.. క్వాలిఫయర్ మ్యాచ్‌లు నడుస్తున్నాయి. అదే సమయంలో భారత్ సహా ఎనిమిది పెద్ద దేశాలకు చెందిన క్రికెట్ జట్లు వామప్ మ్యాచుల్లో తలపడుతున్నాయి. ఒక రౌండ్ వామప్ మ్యాచులు సోమవారం ముగిశాయి. రెండో రౌండ్ బుధవారం ప్రారంభం కావాల్సి ఉంది. తొలి వామప్ మ్యాచ్‌లో భారత జట్టు.. ఇంగ్లాండ్‌ను మట్టి కరిపించింది. రెండో వామప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీ కొనాల్సి ఉంది.

  T20 World Cup : India vs Pakistan Match ని సంక నాకించేలా ఉన్నారు!! || Oneindia Telugu
  మ్యాచ్‌పై రాజకీయ మేఘాలు..

  మ్యాచ్‌పై రాజకీయ మేఘాలు..


  అసలు షెడ్యూల్‌లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు.. ఈ ప్రపంచకప్ టోర్నమెంట్‌లో తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఈ నెల 24వ తేదీన ఆరంభమౌతుంది. ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌కు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదిక కానుంది. ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది. భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య షెడ్యూల్ చేసిన ఈ మ్యాచ్‌పై రాజకీయ మేఘాలు ముసురుకుంటున్నాయి. అనుమానాలు కమ్ముకుంటున్నాయి.

  కాశ్మీర్‌లో పేట్రేగుతున్న ఉగ్రమూక

  కాశ్మీర్‌లో పేట్రేగుతున్న ఉగ్రమూక

  జమ్మూ కాశ్మీర్‌లో కొద్దిరోజులుగా పాకిస్తాన్ ప్రోత్సాహిత ఉగ్రవాదులు మారణ హోమానికి తెగబడుతుండటమే దీనికి కారణం. ఉగ్రవాదుల దాడుల్లో ఈ మధ్యకాలంలోనే తొమ్మిదిమంది జవాన్లు వీర మరణం పొందారు. జవాన్లపై దాడులతో సరిపుచ్చుకోవట్లేదు ఉగ్రవాదులు. సామాన్యులపైనా బుల్లెట్ల వర్షాన్ని కురిపిస్తోన్నారు. జీవనోపాధి కోసం పొట్ట చేతబట్టుకుని జమ్మూ కాశ్మీర్‌‌కు వలస వచ్చిన చిరువ్యాపారులను లక్ష్యంగా చేసుకున్నారు. స్థానికేతరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతున్నారు.

  ఆర్టికల్ 370 రద్దు కారణం

  ఆర్టికల్ 370 రద్దు కారణం

  స్థానికేతరులపై దాడులు చేస్తూ.. ఉగ్రవాదులు వారిని భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రధాన కారణం- వెనుక ఆర్టికల్ 370ని రద్దు చేయడమేనని అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత జమ్మూ కాశ్మీర్‌కు స్థానికేతరుల సంఖ్య పెరగడాన్ని అడ్డుకోవడమే వారి ప్రధాన లక్ష్యమని అంటున్నారు. ఈ వరుస దాడులతో దీనితో జమ్మూ కాశ్మీర్‌లో ఓ రకమైన భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి.

  పాక్ ప్రోత్సాహిత ఉగ్రవాదం

  పాక్ ప్రోత్సాహిత ఉగ్రవాదం

  దీనికంతటికీ కారణం పాకిస్తాన్ ప్రోత్సాహిత ఉగ్రవాదులేనని, ఇలాంటి పరిస్థితుల్లో ఆ దేశానికి చెందిన జట్టుతో టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో మ్యాచ్ ఆడాల్సిన అవసరం ఉందా? అనే డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. దీన్ని రద్దు చేయాలంటూ బీజేపీయేతర పార్టీలు డిమాండ్ చేస్తోన్నాయి. ఉగ్రవాదులు.. కాశ్మీర్ ప్రజల ప్రాణాలతో టీ20 మ్యాచులు ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు పాకిస్తాన్‌తో టీ20 మ్యాచ్ ఆడాల్సిన అవసరం ఉందా? అంటూ నిలదీశారు. దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

  ఒవైసీతో గొంతు కలిపిన ఆప్

  ఒవైసీతో గొంతు కలిపిన ఆప్

  తాజాగా ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అసదుద్దీన్ ఒవైసీతో గళం కలిపింది. ఈ నెల 24వ తేదీన భారత్-పాకిస్తాన్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్‌ను రద్దు చేయాలంటూ ఆ పార్టీ శాసన సభ్యురాలు ఆతిషి డిమాండ్ చేశారు. ఈ మ్యాచ్‌ను రద్దు చేయించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఒత్తిడిని తీసుకుని రావడం తమ పార్టీ వల్ల మాత్రమే సాధ్యం కాదని, బీజేపీ కూడా తమతో కలిసి రావాలని కోరారు. ఈ మ్యాచ్‌ను రద్దు చేయించగలిగే సత్తా బీజేపీకి కూడా లేదని, ఒక్క ప్రధానమంత్రి మోడీ ద్వారా మాత్రమే అది సాధ్యపడుతుందని చెప్పారు.

  అప్పుడలా చేశారుగా..?

  అప్పుడలా చేశారుగా..?

  ఇదివరకు కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ సంకీర్ణ కూటమి.. కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో- బీజేపీ డిమాండ్లను లేవనెత్తిన సందర్భాలు చాలా ఉన్నాయని ఆతిషి అన్నారు. భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగాల్సిన సమయంలో బీజేపీ నేతలు పిచ్‌ను తవ్విన రోజులు ఉన్నాయని గుర్తు చేశారు. అదే బీజేపీ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉందని, ఉగ్రవాదులు మళ్లీ పేట్రేగిపోయి.. జవాన్లు, జనాల ప్రాణాలను తీస్తున్నారని చెప్పారు. దీనికి నిరసనగా- పాకిస్తాన్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను రద్దు చేయాలని ఆతిషి డిమాండ్ చేశారు.

  కాశ్మీర్‌లో ఉగ్రవాదులు..లఢక్‌ వైపు చైనా సైనికులు..

  కాశ్మీర్‌లో ఉగ్రవాదులు..లఢక్‌ వైపు చైనా సైనికులు..

  పైగా పాకిస్తాన్‌తో ప్రపంచకప్‌లో టీ20 మ్యాచ్ ఆడటానికి భారత్ సిద్ధమౌతోందని, ఇప్పుడు ఈ మ్యాచ్‌ను ఆడించాల్సిన అవసరం ఉందా? అని ఒవైసీ నిలదీశారు. కాశ్మీర్ పరిస్థితి ఇలా ఉంటే.. లఢక్ సమీపంలో భారత భూభాగంపైకి ఏకంగా చైనా సైనికులు చొచ్చుకుని వచ్చారని, వారిని నిలవరించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఆయన ప్రధానిని ప్రశ్నించారు. పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు, చైనా నుంచి ఆ దేశ సైనికులు మన ఇంట్లోకి వచ్చి కూర్చుంటే మోడీ ఏం చేస్తున్నారని అన్నారు.

  English summary
  Aam Aadmi Party MLA Atishi said that we see people being attacked in Kashmir. I'm sure that even PM agrees with the stand of not conducting the match between India and Pakistan.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X