మెజార్టీ మార్కుకు 14 సీట్ల దూరంలో ఫడ్నవీస్ సర్కార్, 13+11 సభ్యులే అనుకూలం, ఎంఐఎం, ఎస్పీ నో..
ఎముకలు కొరికే చలిలో మహారాష్ట్రలో ప్రభుత్వ బలనిరూపణ అంశం హీట్ పుట్టిస్తోంది. శనివారం ఉదయాన్నే దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. తర్వాత అజిత్ పవార్‌పై ఎన్సీపీ వేటువేయడం.. ఆయనతో వచ్చిన ఎమ్మెల్యేలు శరద్ పవార్ గూటికి వెళ్లడంతో పరిస్థితి మొదటికొచ్చింది. దీంతో ఫడ్నవీస్ సర్కార్ బలనిరూపణ ముందు మోకరిల్లాల్సిన పరిస్థితి. ఇంతకీ ఫడ్నవీస్ సర్కార్ గట్టెక్కుతుందా ? లేదంటే గతంలో యడియూరప్ప సర్కార్ లాగా ముందే రాజీనామా చేయాల్సి వస్తోందా ? వన్ ఇండియా ప్రత్యేక కథనం.

మెజార్టీ ముంగిట
మహారాష్ట్రలో బీజేపీకి 105 సభ్యుల ప్రతినిధులు మాత్రమే ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం మరో 40 మంది ఎమ్మెల్యేలు తప్పనిసరి. అయితే అజిత్ పవార్ డిప్యూటీగా ప్రమాణం చేసే సమయంలో 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరికొందరు స్వతంత్రులతో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేద్దామనుకొన్నారు. కానీ శరద్ పవార్ అల్టిమేటం జారీచేయడంతో ఏడుగురు ఎమ్మెల్యేలు తిరిగొచ్చారు. దీంతో బీజేపీకి మెజార్టీ గుబులు పట్టుకుంది.

36 మంది సభ్యులు
బీజేపీ 105, అజిత్‌తో కలిసి 4 ఎమ్మెల్యేలు కలిపినా 109కి చేరుతుంది. అంటే ఇంకా 36 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ ఎమ్మెల్యేలను క్యాంపులకు తీసుకెళ్లారు. దీంతో చిన్నచితక పార్టీ ఎమ్మెల్యేలు, స్వతంత్రులు ముఖ్యభూమిక పోషించనున్నారు. చిన్న పార్టీల ఎమ్మెల్యేలు 16 మంది ఉండగా.. స్వతంత్రులు 11 మంది ఉన్నారు. వీరందరినీ కలిపినా 27 మంది అవుతారు. అంటే బలనిరూపణకు ఫడ్నవీస్ సర్కార్ 9 సీట్ల దూరంలో ఉంటుంది. కానీ ఎంఐఎం, ఎస్పీ, సీపీఎంకు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో మద్దతు తెలుపరు. మిగతావారిని దారిలోకి తెచ్చుకోవడం అసాధ్యమైనందున..ఏం చేయాలని బీజేపీ నేతలు యోచిస్తున్నారు.

13+11
13 మంది ఇండిపెండెంట్లు ఫడ్నవీస్ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు.11 మంది చిన్న పార్టీ ఎమ్మెల్యేలు కూడా సపోర్ట్ చేస్తామని చెప్పారు. మిగతా ఐదుగురు ఎమ్మెల్యేలు మద్దతు తెలుపరు.. ఒకవేళ సపోర్ట్ చేసినా ఫడ్నవీస్ ప్రభుత్వం గట్టెక్కని సిచుయేషన్..దీంతో అమిత్ షా ఏం వ్యుహారచన చేస్తారన్న దానిపైనే ఉత్కంఠ నెలకొంది.

ఇవీ అనుకూలం
బహుజన్ వికాస్ అఘాడి పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు, పీడబ్ల్యూఏ, యువ స్వాభిమాన్ పార్టీ, జన్ సురాజ్య శక్తి పార్టీల నుంచి ఒక్కొ ఎమ్మెల్యే బీజేపీ ప్రభుత్వానికి అండగా నిలుస్తామని ప్రకటించాయి. ఎన్నికలకు ముందే బీజేపీకి స్నేహహస్తం అందించిన రాష్ట్రీయ్ సమాజ్ పక్ష్ ఒక్క ఎమ్మెల్యే కూడా సపోర్ట్ చేస్తున్నారు.

ఇవీ వ్యతిరేకం
బీజేపీ అంటే గిట్టని ఎంఐఎకి ఇద్దరు సభ్యులు ఉన్నారు. సమాజ్‌వాదీ పార్టీకి కూడా ఇద్దరు, సీపీఎంకు ఒక సభ్యుడు ఉన్నారు. వీరు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి మాత్రం సపోర్ట్ చేయరు. అంటే ఫడ్నవీస్ ప్రభుత్వానికి మరో 14 మంది ఎమ్మెల్యేలు విధిగా కావాలి.












Click it and Unblock the Notifications