అసహనమంటూ: రైటర్స్‌పై తస్లీమా నస్రీన్ ఘాటుగా
న్యూఢిల్లీ: భారతదేశం... ఒక అసహన దేశమని, ఇక్కడ కొంతమంది అసహనవాదులు తిష్టవేసుకుని ఉన్నారని ప్రముఖ బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఆదివారం కఠిన వ్యాఖ్యలు చేశారు. హిందూ ఛాందసవాదాన్ని, ముస్లిం విధానాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు.
పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఒక ఉదంతాన్ని గుర్తు చేస్తూ... ప్రతీ సమాజంలోనూ కొంతమంది అసహనవాదులు ఉంటారని, అయితే వ్యక్తిగత అభిప్రాయాలను వెలిబుచ్చేందుకు ప్రతీ ఒక్కరికీ హక్కు ఉందని చెప్పారు. భారత్‌లో రచయితలకు పూర్తి స్వేచ్ఛ ఉందని చెప్పారు.

విమర్శిస్తే అసహనమా: అన్సారీ
విమర్శించడం, ప్రశ్నించడాలపై సమాజంలో అసహనం కనిపిస్తోందనీ, ఆ కారణంవల్లనే కొందరిని దూరంగా పెట్టడం, హతమార్చడం వంటివి చోటు చేసుకుంటున్నాయని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ వేరుగా ఢిల్లీలో అన్నారు. మన కుటుంబాల్లో కూడా ప్రశ్నించడాన్ని అంగీకరించలేమన్నారు. పిల్లలు ప్రశ్నిస్తే ఇంట్లో పెద్దలకు, బడిలో ఉపాధ్యాయులకూ కోపం వచ్చేస్తుందన్నారు.
హిందూ సంస్కృతే మన గుర్తింపు: భగవత్
హిందూ సంస్కృతే భారతదేశ గుర్తింపని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సర్ సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ బెంగళూరులో అన్నారు. అందుకే మన దేశానికి హిందూ దేశం అనే పేరొచ్చిందన్నారు. భారత్ అంటే ఏదో కొంత భూభాగం పేరు మాత్రమే కాదని అన్నారు.












Click it and Unblock the Notifications