వావ్.. దేశంలో ఒకేరోజు 90 లక్షల మందికి టీకా.. కంగ్రాట్స్
కరోనాను టీకాతోనే సమర్థవంతంగా ఎదుర్కొగలం. అందుకే అందరికీ వ్యాక్సిన్ అంటే అవగాహన కలిగింది. దేశంలో 50 శాతం మంది ప్రజలు మొదటి డోసు వ్యాక్సిన్ కూడా తీసుకున్నారని తెలుస్తోంది. అయితే శుక్రవారం ఒక్కరోజు దేశవ్యాప్తంగా 90 లక్షల మంది టీకా తీసుకున్నారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ మంత్రి మాన్సుక్ మాండవియ తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి వ్యాక్సినేషన్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఇదే అత్యధిక వ్యాక్సిన్ తీసుకున్న రికార్డ్ అని ఆయన తెలిపారు.
ఈ మేరకు దేశ ప్రజలకు మాండవీయ అభినందనలు తెలిపారు. అలాగే దేశంలో 62 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. వీరిలో 23 కోట్లకు పైగా మంది 18-44 ఏళ్ల లోపు వారు ఉన్నారు. 2 కోట్లకు పైగా మంది సెకండ్ డోసు కూడా తీసుకున్నారు. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటికీ 4.05 కోట్ల డోసుల వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయని వివరించారు.

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం అయితే ప్రకటించలేదు.
Recommended Video
ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications