తగ్గేదేలే..! శీతాకాలమైనా బోర్డర్ లోనే -తేల్చేసిన ఆర్మీఛీఫ్..!
భారత్-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు గతంతో పోలిస్తే బాగా తగ్గాయి. కరోనా సమయంలో ఇరు దేశాల బలగాల మధ్య బాహాబాహీకి దారి తీసి సైనికులు చనిపోయిన పరిస్ధితుల నుంచి ఇప్పుడు సరిహద్దుల్లో శాంతియుత పరిస్ధితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరు దేశాలూ చర్చల ద్వారా సరిహద్దుల్లో బలగాల్ని ఉపసంహరించాయి. అయితే ఓ హద్దు వరకూ మాత్రం బలగాల మోహరింపులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శీతాకాలంలో బలగాలను వెనక్కి రప్పిస్తారన్న చర్చ జరుగుతోంది.
దీనిపై స్పందించిన ఆర్మీఛీప్ ఉపేంద్ర ద్వివేదీ వివరణ ఇచ్చారు. చలికాలంలో ఉత్తర సరిహద్దు వెంబడి సైనికుల సంఖ్యను తగ్గించాలని భారత్ చూడటం లేదన్నారు. చైనాతో చర్చల ఫలితాల ఆధారంగా వేసవి విస్తరణను సమీక్షిస్తామని భారత ఆర్మీ చీఫ్ వెల్లడించారు. నాలుగేళ్ల క్రితం సరిహద్దు ఘర్షణల వల్ల 20మంది భారతీయ, నలుగురు చైనా సైనికులు చనిపోయారు. దీని తరువాత కొత్త ఘర్షణలను నివారించడానికి లడఖ్‌లోని సరిహద్దులో రెండు వైపులా పెట్రోలింగ్ నిలిపివేశారు. అదే సమయంలో పదివేల మంది కొత్త బలగాలు, సైనిక సామగ్రిని గడ్డకట్టే పర్వత ప్రాంతానికి దగ్గరగా తరలిస్తున్నారు.

భారత్-చైనా మధ్య సైనిక ప్రతిష్టంభన తొలగించేందుకు గతేడాది అక్టోబర్‌లో ఇరుదేశాలూ ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయ.
ఆ తర్వాత బలగాల ఉపసంహరణ చేపట్టారు. వాస్తవానికి శీతాకాలపు మోహరింపుల్లో దళాల సంఖ్య తగ్గిస్తారు. అయితే తాము ప్రస్తుతానికి బలగాలను వెనక్కి రప్పించడం లేదని ఆర్మీఛీఫ్ వెల్లడించారు. చైనాతో తదుపరి చర్చల ఆధారంగా భవిష్యత్ నిర్ణయాలు ఆధారపడి ఉంటాయన్నారు. అలాగే తూర్పు లడఖ్‌లోని దేప్సాంగ, డెమ్‌చోక్‌లలో సాంప్రదాయ ప్రాంతాలలో పెట్రోలింగ్ ప్రారంభించినట్లు ఆర్మీ చీఫ్ తెలిపారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications