వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ సారి పాక్ గగనతలం నుంచే వైమానిక దాడులు...చివరిసారిగా ఆయుద్ధంలోనే..?

|
Google Oneindia TeluguNews

ఫిబ్రవరి 14న జైషే ఉగ్రవాద సంస్థ సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రతీకార చర్యకు భారత్ దిగింది. మిరాజ్ 2000 యుద్ధ విమానాలతో పాక్ గగనతలంలోకి దూసుకెళ్లిన భారత వాయుసేన మెరుపుదాడులు నిర్వహించి భారత్‌కు తిరిగి క్షేమంగా చేరుకుంది. ఈ దాడుల్లో కనీసం 300 మందిని మట్టుబెట్టి ఉంటారని వాయుసేన చెబుతోంది.

 21 నిమిషాల్లో ఆపరేషన్ బాలాకోట్ పూర్తి

21 నిమిషాల్లో ఆపరేషన్ బాలాకోట్ పూర్తి

పుల్వామాలో ఉగ్రదాడులు జరిగిన రెండు వారాలకు భారత్ పాకిస్తాన్‌కు ధీటైన జవాబు ఇచ్చింది. సరిహద్దు రేఖ దాటి పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించి మెరుపుదాడులు నిర్వహించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో జైషేమహ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కరేతోయిబాలా శిక్షణా శిబిరాలను ధ్వంసం చేసింది. మంగళవారం ఉదయం 3:30 గంటలకు ఆపరేషన్ స్టార్ట్ చేసి మొత్తం 21 నిమిషాల్లో పూర్తి చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఈ దాడులకు మిరాజ్ 2000 యుద్ధ విమానాలను భారత వాయుసేన వినియోగించింది. మొత్తం 12 యుద్ధ విమానాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. దాదాపు వెయ్యి కిలోల బాంబులతో ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది భారత వాయుసేన. ముందుగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి ఆపై పాక్ గగనతలంలోకి వెళ్లి దాడులు నిర్వహించింది.

 చివరిసారిగా 1971లో జరిగిన యుద్ధంలో సరిహద్దు దాటిన భారత్

చివరిసారిగా 1971లో జరిగిన యుద్ధంలో సరిహద్దు దాటిన భారత్

ఇక చివరిసారిగా భారత్ సరిహద్దు దాటి పాకిస్తాన్‌లోకి ప్రవేశించి మిరాజ్ యుద్ధ విమానంతో దాడులు చేసింది మాత్రం 1971 యుద్ధంలోనే. మళ్లీ ఇంతకాలానికి భారత్ పాక్ గగనతలంలోకి ప్రవేశించి మెరుపుదాడులు చేయడం విశేషం. ఇక 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం సమయంలో కూడా భారత ఆర్మీ సరిహద్దు దాటి పాక్‌లోకి ప్రవేశించలేదు. సాధారణంగా ఓ దేశం గగనతలం దాటి మరో దేశ గగనతలంలోకి అనుమతులు లేకుండా ప్రవేశిస్తే యుద్ధానికి సంకేతమని ప్రపంచదేశాలు చెబుతున్నాయి. ప్రస్తుతం భారత్ కూడా పాక్ గగనతలంలోకి ప్రవేశించి అక్కడి స్థావరాలను ధ్వంసం చేసి తిరిగి భారత్‌కు చేరుకోవడంతో ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.

 పాక్ పై దాడి జరిగిన మాట వాస్తవమే: పాక్ మిలటరీ

పాక్ పై దాడి జరిగిన మాట వాస్తవమే: పాక్ మిలటరీ

కేవలం సరిహద్దులో ఉన్న చికోటీ ముజఫరాబాద్‌లలో మాత్రమే భారత వాయుసేన దాడులు చేయలేదు. పాక్ గగనతంలోకి ప్రవేశించి బాలాకోట్‌లోని ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్‌లు, వారి శిబిరాలను ధ్వంసం చేసింది. ఇక వేరే మాటల్లో చెప్పాలంటే భారత్ సరిహద్దు రేఖను దాటడమే కాదు పాకిస్తాన్‌పై దాడి చేసిందనే చెప్పాలి. ఇదిలా ఉంటే భారత యుద్ద విమానాలు పాక్ గగనతలంలోకి ప్రవేశించి దాడులు నిర్వహించాయని పాకిస్తాన్ ఆర్మీకి చెందిన డైరెక్టర్ జనరల్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి ఆసిఫ్ గఫూర్ స్వయంగా నిర్ధారిస్తూ ట్వీట్ చేశారు. పాకిస్తాన్‌పై దాడికి వచ్చిన భారత వాయుసేన బాంబులను జార విడిచిందని అయితే అవి బాలాకోట్ ఖైబర్ పాస్‌లలో పడ్డాయని వెల్లడించింది.


మొత్తానికి జైషే ఉగ్రవాదులు పుల్వామాలో చేసిన దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. 2016 పఠాన్ కోట్‌పై ఉగ్రవాదులు దాడి చేయడంతో నాడు 19 మంది జవాన్లు అమరులయ్యారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా భారత్ సర్జికల్ స్ట్రైక్స్ పేరుతో మెరుపుదాడులు చేసింది. ఆ సమయంలో సరిహద్దు రేఖ వెంబడే దాడులు చేసిన భారత ఆర్మీ... ఈ సారి మాత్రం పాక్ గగనతలంలోకి చొచ్చుకుపోయి దాడులు చేయడం విశేషం. అయితే పాక్‌ పాల్పడుతున్న దాడులకు మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని దేశం యావత్తు ప్రశంసిస్తోంది.

English summary
Two weeks after the Pulwama terror attack, India on Tuesday crossed over Line of Control (LoC) and destroyed the JeM, LeT and Hizbul Mujahideen training camps at around 3:30 am. The Indian Air Force (IAF) used 12 Mirage aircraft and dropped 1000 kilograms of bombs on the terror launch pads across the Pakistan occupied Kashmir (PoK).The last time IAF crossed the LoC and used the Mirage aircraft was during the 1971 war.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X