వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్తాపూర్‌కు లైన్ క్లియర్: భక్తులు తమతో ఇవి మాత్రమే తీసుకెళ్లొచ్చు..!

|
Google Oneindia TeluguNews

కర్తాపూర్ కారిడార్‌పై భారత్ పాకిస్తాన్‌లు సంతకాలు పూర్తి చేశాయి.భారత్‌లోని సిక్కు భక్తులు కర్తాపూర్‌లోని పవిత్రమైన దర్బార్ ఆలయంను సందర్శించేందుకు ఈ సంతకాలతో మార్గం సుగుమమైంది. భారత్ నుంచి వచ్చే భక్తులకు లంగర్ (కిచెన్)తో సహా అన్ని ఏర్పాట్లు చేస్తామని పాకిస్తాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి భక్తుడికి 20 డాలర్ల సర్వీస్ ఛార్జ్‌ను పాకిస్తాన్ విధించింది. అయితే ఇలాంటి సర్వీసు ఛార్జీలు భక్తులపై విధించరాదని భారత్ పాక్‌ను కోరింది. గత మూడు హైలెవెల్ మీటింగ్‌లలో భారత్ ఇదే విషయాన్ని పాక్ అధికారుల దృష్టికి తీసుకొచ్చింది. భక్తుల సెంటిమెంట్‌పై సర్వీస్ ఛార్జ్ విధించడం తగదని కోరింది.

ఉదయం వెళ్లి అదే రోజు తిరిగి రావాలి

ఉదయం వెళ్లి అదే రోజు తిరిగి రావాలి

భక్తుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కర్తాపూర్ కారిడార్‌కు సంబంధించిన డాక్యుమెంట్లపై భారత్ సంతకాలు చేసింది. అయితే సర్వీస్ ఛార్జీల వసూలపై పునఃసమీక్షించాలని భారత్ పాకిస్తాన్‌ను కోరింది. ఇక అదేసమయంలో భారత హోంశాఖ కర్తాపూర్ వెళ్లే భక్తులకు కొన్ని నిబంధనలు పాటించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. 13 ఏళ్లు లోపు ఉన్న చిన్నపిల్లలు, 75 ఏళ్లు ఆ పైబడి వయసున్న వారు ఒక సమూహంగా వెళ్లాలని కోరింది. ఇక కర్తాపూర్‌కు వెళ్లే భక్తులు ఉదయం బయలుదేరి అదే రోజు తిరిగి భారత్‌కు చేరుకోవాలని సూచించింది.

 రూ.11వేలు ఏడు కిలోల బ్యాగు మాత్రమే అనుమతి

రూ.11వేలు ఏడు కిలోల బ్యాగు మాత్రమే అనుమతి


కర్తాపూర్‌లోని గురుద్వార్ దర్బార్ సాహిబ్ సందర్శనకు వెళ్లే భక్తులు తమవెంట రూ.11వేలుతో పాటు ఏడు కిలోల బరవున్న బ్యాగును తీసుకెళ్లొచ్చని పేర్కొంది. ఇక దర్బార్ పరిసరాలు దాటి లోపలికి వెళ్లరాదని కఠినంగా చెప్పింది. పర్యావరణానికి హానికరమైన వస్తువులు కాకుండా బట్టతో చేసిన బ్యాగులను తీసుకెళ్లాలని సూచించింది. భక్తులు కేవలం కర్తాపూర్ సాహిబ్ గురుద్వారానే సందర్శించాలని ఇక అక్కడి వెళ్లిన తర్వాత ఇతర ప్రాంతాల్లో సంచరించరాదని హెచ్చరించింది. పాకిస్తాన్‌లోని నారోవాల్ జిల్లాలో ఉన్న శ్రీకర్తాపూర్ సాహిబ్ గురుద్వారాను సందర్శించాలనుకునే భక్తులందరూ ముందుగా ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది.(prakashpurb550.mha.gov.in).

రిజిస్ట్రేషన్ చేసుకున్నాక...

రిజిస్ట్రేషన్ చేసుకున్నాక...

కేవలం రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల వెళ్లేందుకు అనుమతి ఇచ్చినట్లు కాదన్న హోంశాఖ... ప్లాన్ చేసుకున్న మూడు నాలుగు రోజుల ముందు ఈమెయిల్ ఎస్ఎంఎస్ ద్వారా హోంశాఖ తెలుపుతుందని వెల్లడించింది. ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ జనరేట్ అవుతుందని దాన్ని భక్తులు తమవెంట ప్యాసింజర్ టర్మినల్ బిల్డింగ్‌కు తీసుకెళ్లాల్సి ఉంటుందని కేంద్ర హోంశాఖ తెలిపింది. పొగతాగడం కానీ, ఇతరుల అనుమతి లేకుండా ఫోటోలు తీయడంకానీ చేయరాదని స్పష్టం చేసింది.

కర్తాపూర్ కారిడార్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ

కర్తాపూర్ కారిడార్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ


నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ కర్తాపూర్ సాహిబ్ కారిడార్‌ను ప్రారంభిస్తారు. అయితే వీసా లేకుండానే భారతీయులు కర్తాపూర్ గురుద్వారాను సందర్శించుకునేలా ఇరుదేశాల మధ్య గత నెలలో ఒప్పందం జరిగింది. అయితే పాస్‌పోర్టు మాత్రం భక్తులు తమవెంట తీసుకెళ్లాల్సి ఉంటుందని వెల్లడించారు. సిక్కు మత వ్యవస్థాపకులు శ్రీ గురునానక్ దేవ్ కర్తాపూర్‌లో 18 ఏళ్లు గడిపారు. ఇది రావి నది తీరంలో ఉంది.

English summary
India and Pakistan on Thursday signed a landmark agreement to operationalise the historic Kartarpur Corridor to allow Indian Sikh pilgrims to visit the holy Darbar Sahib in Pakistan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X