వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్; ఐదు ప్రతిజ్ఞలను చెయ్యాలన్న ప్రధాని మోడీ

|
Google Oneindia TeluguNews

భారతదేశం 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను జరుపుకుంటున్న నేడు చారిత్రాత్మక ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ, 2047 నాటికి భారతదేశం కోసం స్వాతంత్ర్య సమరయోధుల కలలను నెరవేర్చేందుకు పౌరులు తీసుకోవాల్సిన ఐదు ప్రతిజ్ఞలను (పంచప్రాణ్) జాబితా చేశారు. ప్రధాని మోదీ పేర్కొన్న ముఖ్యమైన 5 ప్రతిజ్ఞలు పాటిస్తే వచ్చే 25 ఏళ్లలో భారతదేశ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.

2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తామని యువత ప్రతిజ్ఞ చెయ్యాలన్న మోడీ

ప్రస్తుతం 76 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళా ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే25 ఏళ్లలో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలని ఆకాంక్షించారు. తాను యువతను రాబోయే 25 సంవత్సరాల జీవితాన్ని దేశాభివృద్ధికి అంకితం చేయాలని కోరుతున్నానని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. 2047 సంవత్సరం నాటికి భారతదేశ అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని యువత ప్రతిజ్ఞ చేయాలన్నారు. భారతదేశ పౌరులు మానవాళి అభివృద్ధికి కృషి చేస్తారని ప్రధాని మోదీ అన్నారు.

బానిసత్వ జాడ లేకుండా ముందుకు సాగాలి

అలాగే మనం ఇతరులలాగా మారడానికి ప్రయత్నించకూడదు, మన ఆలోచనలో బానిసత్వం యొక్క జాడ ఉండకూడదని ప్రధాని మోడీ పేర్కొన్నారు. కొన్నిసార్లు మన ప్రతిభకు భాషా అవరోధాలు అడ్డుగా ఉంటాయని, మన దేశంలోని ప్రతి భాష గురించి గర్వపడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మనము ప్రపంచం నుండి ధృవీకరణను కోరుకోకూడదని పేర్కొన్న మోడీ, గర్వించదగిన దేశంగా మన గుర్తింపును కాపాడుకోవాలి అని తెలిపారు.

మన వారసత్వాన్ని గురించి గర్వపడాలి .. దానిని పరిరక్షించుకుంటూ ఎదగాలి

ఇక మన వారసత్వం గురించి మనం గర్వపడాలి. మన మూలాలకు మనం కనెక్ట్ అయినప్పుడు మాత్రమే మనం ఎత్తుకు ఎగరగలమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. మన వారసత్వ సంపదను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మనం ఎత్తుకు ఎదిగినప్పుడు మొత్తం ప్రపంచానికి పరిష్కారాలను అందిస్తాము అని ప్రధాన మంత్రి అన్నారు.

ప్రజలంతా ఐకమత్యంగా ఉండాలి .. మహిళలను సమానంగా చూడాలి

జాతి అభ్యున్నతికి పాటుపడేందుకు మనం ప్రజలుగా ఐక్యంగా ఉండాలని నాల్గవ ప్రతిజ్ఞ చెయ్యాలన్నారు. భారతదేశ ప్రగతికి సమానత్వం మూలస్తంభం అని మోడీ పేర్కొన్నారు . భారతదేశమే మొదటి ప్రాధాన్యతగా మనం ఐక్యంగా ఉన్నామని నిర్ధారించుకోవాలని ప్రధాని మోదీ తెలిపారు. మహిళలకు సమానత్వాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ప్రజల మధ్య సమానత్వం అవసరమని కూడా ఆయన చెప్పారు. భారతదేశ వృద్ధికి మహిళల పట్ల గౌరవం ఒక ముఖ్యమైన మూలస్తంభమని, మన 'నారీ శక్తి'కి మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆడ, మగ ఇద్దరినీ సమానంగా చూడాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు చేశారు వేధింపుల నుంచి మహిళలు బయటపడేలా సంకల్పం తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ కోరారు.

ప్రదాని, రాష్ట్ర ముఖ్యమంత్రులతో సహా .. పౌరుల కర్తవ్యం నిర్వర్తించాలి


ఐదవ ప్రతిజ్ఞ పౌరుల కర్తవ్యంగా పేర్కొన్నారు ప్రధాని మోడీ. విద్యుత్తు, నీటిని పొదుపు చేయడం ప్రజల కర్తవ్యం అని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. దీనిని అనుసరిస్తే, మనం అనుకున్న ఫలితాలను ముందుగానే చేరుకోగలమని మోడీ పేర్కొన్నారు. ఈ విధులు భారతదేశంలోని పౌరులందరికీ వర్తిస్తాయని ఆయన అన్నారు. ప్రధానమంత్రి మరియు ముఖ్యమంత్రులతో సహా ప్రతి ఒక్కరికి వర్తిస్తుందన్నారు. ఏ దేశమైనా పురోగమిస్తే, దాని పౌరులలో క్రమశిక్షణ వెళ్ళూనుకుందని గుర్తు చేసిన మోడీ అందరూ తమ తమ బాధ్యతలను పాటిస్తే, భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది అని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు.

English summary
Prime Minister Modi said on the occassion of 76th independence day the country should take five pledges to make India a developed country by 2047 and move forward with these pledges.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X