కరోనా విజృంభణకు బ్రేక్: మందు దొరికినట్టే:ఆ డ్రగ్ ఎగుమతులపై కేంద్రం నిషేధం:రాత్రికి రాత్రి ఉత్తర్వులు

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా వేలాదిమందిని పొట్టనబెట్టుకుంటోన్న భయానక కరోనా వైరస్‌ నివారణకు మందు దొరికినట్టే కనిపిస్తోంది. మలేరియా చికిత్సలో వినియోగించే హైడ్రొక్సిక్లోరొక్విన్ మందుల ద్వారా ఈ మహమ్మారిని తరిమి కొట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రొక్సిక్లోరొక్విన్‌ ఎగుమతులపై నిషేధాన్ని విధించింది. రాత్రికి రాత్రి ఉత్తర్వులను జారీ చేసింది. హైడ్రొక్సిక్లోరొక్విన్ మందుల ఎగుమతులను నిషేధిస్తూ కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ, విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ (డీజీఎఫ్‌టీ) ఆదేశాలను జారీ చేసింది.

కరోనా వైరస్ సోకిన పేషెంట్లకు అందించే వైద్య చికిత్సలో హైడ్రొక్సిక్లోరొక్విన్ మందులను వినియోగించవచ్చని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఇదివరకే వెల్లడించింది. కరోనా వైరస్‌ హైరిస్క్ కేసులకు చికిత్స అందించడంలో ఈ యాంటీ మలేరియా డ్రగ్‌ను వాడటానికి అవకాశం ఉందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ వెల్లడించారు.

India Bans Export Of Anti-Malarial Wonder Drug Hydroxychloroquine

ఫలితంగా- దేశవ్యాప్తంగా ఈ డ్రగ్‌ కోసం డిమాండ్ పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ డ్రగ్ ఎగుమతలను నిషేధిస్తూ తక్షణ నిర్ణయాన్ని తీసుకుంది. ఉత్తర్వులను జారీ చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను డీజీఎఫ్‌టీ జారీ చేసింది. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. తమ అనుమతి లేనిదే ఎట్టి పరిస్థితుల్లోనూ హైడ్రోక్సిక్లోరొక్విన్‌ మందులను విదేశాలకు ఎగుమతి చేయొద్దని ఆదేశించింది.

ఇతర దేశాల్లో కూడా కరోనా వైరస్ మందులను తయారు చేయడానికి హైడ్రొక్సిక్లోరొక్విన్ డ్రగ్‌ను ఎగుమతి చేయాల్సిన పరిస్థితి ఎదురైతే.. మానవతాదృక్పథంతో ఎగుమతులపై పాక్షికంగా నిషేధాన్ని సడలిస్తామని డీజీఎఫ్‌టీ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను తమకు చూపించాల్సి ఉంటుందని పేర్కొంది. ఎగుమతులను నిషేధిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌లో దీనికి సంబంధించిన మార్గదర్శకాలను పొందుపరిచింది.

Recommended Video

    PM Modi Telugu Speech On Coronavirus | 'Janata Curfew' Why Only One Day ? | Oneindia Telugu

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+