ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీ పరిశ్రమను ప్రారంభించిన మోడీ
Recommended Video

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీ పరిశ్రమను ప్రధాని నరేంద్ర మోడీ, దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జై సంయుక్తంగా ప్రారంభించారు. దక్షిణకొరియా దిగ్గజ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శామ్‌సంగ్ నోయిడాలో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఏటా 120 మిలియన్ల మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చెయ్యాలని శామ్‌సంగ్ భావిస్తోంది.
నోయిడా ప్రాంతంలోని దాదాపు 35 ఎకరాల్లో ఈ పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఈ పరిశ్రమ ద్వారా దాదాపు 5వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కాగా, ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఫ్యాక్టరీగా ఇది నిలిచింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్‌గా భారత్ అవతరించిందని మోడీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

కాగా, 2007 నుంచి శాంసంగ్ తన ఫోన్లను ఇండియాలో అసెంబుల్ చేస్తుండగా ఈ పరిశ్రమ ఏర్పాటుతో ఫోన్లను ఇక్కడే తయారు చేయవచ్చు. దీని వల్ల ఫోన్లను చాలా తక్కువ ధరలకే వినియోగదారులు పొందవచ్చు.
ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా అనేక కంపెనీలు ఇప్పటికే భారత్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. త్వరలో మరిన్ని కంపెనీలు పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నాయి.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications