వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రాణాంతక మహమ్మారి : ప్రపంచ రికార్డులు బద్దలు .. 3.32 లక్షలకు పైగా కరోనా కొత్త కేసులు 2,263 మరణాలు

|
Google Oneindia TeluguNews

భారతదేశం కరోనా మహమ్మారి చేతిలో చిక్కి విలవిలలాడుతోంది . ఎక్కడ చూసినా ఆసుపత్రులు నిండా కిటకిటలాడుతున్న కరోనా బాధితులు దర్శనమిస్తున్నారు. అంబులెన్స్ ల సైరన్ లు , గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్న కరోనా బాధితుల శవాలు వెరసి దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ నెలకొన్న పరిస్థితి. ఇదిలా ఉంటే కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మహమ్మారి విజృంభణ మాత్రం కొనసాగుతూనే ఉంది .

కేటీఆర్ కు కరోనా పాజిటివ్ .. స్వయంగా వెల్లడించిన తెలంగాణా మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్ .. స్వయంగా వెల్లడించిన తెలంగాణా మంత్రి

నేడు 3.32 లక్షలకు పైగా కొత్త కోవిడ్ కేసులు, 2,263 మరణాలు

భారతదేశం లో నేడు 3.32 లక్షలకు పైగా కొత్త కోవిడ్ కేసులు నమోదు దేశంలో తాజా పరిస్థితికి అద్దం పడుతుంది . ఇది ప్రపంచంలోనే అత్యధికంగా నమోదైన రోజువారీ కేసుల సంఖ్య . రోజువారీ కేసులలో భారతదేశం ప్రపంచ రికార్డును బద్దలు కొడుతుంది. నిన్నటి నుండి నేటి వరకు 24 గంటల్లో 3,32,730 కొత్త కేసులు నమోదు కాగా , 2,263 మరణాలు సంభవించాయి. కేసులలో భయంకరమైన పెరుగుదల భారతదేశంలోని చాలా ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరతకు కారణంగా మారింది .

India break the World records in daily spike : more than 3.32 lakh new cases , 2,263 deaths

కరోనా తీవ్రత నేపధ్యంలో నేడు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాల్లో ప్రధాని మోడీ

మూడు లక్షలకు పైగా కరోనా కేసులు పెరగడం దేశంలో ఇది రెండవ రోజు. మహమ్మారి ప్రారంభం నుండి నమోదైన మొత్తం కేసులలో భారతదేశం అమెరికా తరువాత రెండవ స్థానంలో ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా పెరుగుతున్న కేసులతో, తీవ్ర పరిణామాల దృష్ట్యా ఎన్నికల ప్రచారం కోసం ఈ రోజు తన బెంగాల్ పర్యటనను రద్దు చేసుకున్నారు . దేశంలో కోవిడ్ -19 పరిస్థితిని సమీక్షించడానికి ఈ రోజు ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు.

దేశ వ్యాప్తంగా కరోనా మరణాలు 186,928 .. మహారాష్ట్రలో దారుణ పరిస్థితి

దేశంలో ఆక్సిజన్ కొరత మరియు క్షీణించిన ఆరోగ్య వ్యవస్థ మధ్య, భారతదేశం అత్యధికంగా ఒకే రోజు 2,263 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దీంతో మొత్తం దేశ వ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 186,928 గా ఉంది. దేశంలో ఇప్పుడు 2.4 మిలియన్లకు పైగా క్రియాశీల కేసులు ఉన్నాయి.మహారాష్ట్ర కరోనా మహమ్మారి కారణంగా అత్యంత నష్టపోయిన రాష్ట్రంగా ఉంది. గురువారం మహారాష్ట్రలో 67,013 తాజా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మహారాష్ట్రలో మొత్తం కరోనా ఈ కేసుల సంఖ్య 40.94 లక్షలకు పైగా పెరిగింది.

ఢిల్లీలో ఆక్సిజన్ కొరత .. కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైన ఆరు రాష్ట్రాలివే

మొత్తం కరోనా మహమ్మారి వల్ల ఎక్కువగా ప్రభావితమైన ఆరు రాష్ట్రాలు చూస్తే మహారాష్ట్ర (40,94,840), కేరళ (13,22,054), కర్ణాటక (11,09,650), తమిళనాడు (9,62,935), ఆంధ్రప్రదేశ్ (9,42,135), ఉత్తర ప్రదేశ్ (9 ,76,765), ఢిల్లీ (9, 56,765) కేసులతో ఉన్నాయి . కరోనా మహమ్మారి పంజా తెలుగు రాష్ట్రాలపైన కూడా కొనసాగుతుంది. దేశ వ్యాప్తంగా ప్రముఖుల నుండి పేదల వరకు కరోనా బాధితులుగా మారుతున్నారు. పలు రాష్ట్రాల మంత్రులు, సీఎం లు కూడా కరోనా బాదితులయ్యారు.

నేడు కీలక భేటీల్లో కరోనా కట్టడికి కీలక నిర్ణయాలు .. ఢిల్లీ లో ఆక్సిజన్ కొరత

దేశంలో విపరీతంగా పెరిగిపోయిన కరోనా కేసులు, తీవ్ర ఉద్రిక్తత కోవిడ్ పరిస్థితుల మధ్య, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఒక్క రోజులో మొత్తం 306 మంది మరణించారు. జాతీయ రాజధాని కరోనా విజృంభణ కారణంగా ఆక్సిజన్ కొరతతో పోరాడుతోంది. ఢిల్లీలో తాజాగా 26,000 కంటే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సైతం ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు .

ప్రపంచ వ్యాప్తంగా 14 కోట్ల 53 లక్షల కరోనా కేసులు .. ప్రస్తుతం రోజువారీ కేసుల్లో భారత్ టాప్

కరోనావైరస్ కేసులు ప్రపంచవ్యాప్తంగా 14, 53,12,232 కు చేరుకున్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 12,35,79,848 మంది కోలుకోగా, ఇప్పటివరకు 30,84,357 మంది మరణించారు. 3,26,68,810 కరోనా కేసులతో అమెరికా అత్యధికంగా నష్టపోయిన దేశంగా ఉంది. తరువాత భారతదేశం, బ్రెజిల్, ఫ్రాన్స్ మరియు రష్యా ఉన్నాయి. అయితే, గత ఏడు రోజులలో, భారతదేశం అత్యధికంగా 18,53,916 కేసులను నమోదు చేసింది, ఆ తరువాత అమెరికా 4, 56,676 కేసులు, బ్రెజిల్ 4,45,231 కేసులతో ఉన్నాయి ఉన్నాయి.

English summary
India reported 332,730 fresh coronavirus infections on Friday, taking the cumulative caseload to 16,263,695, according to MoHFW. This is the first time any country country has recorded over 300,000 cases in just 24 hours. Amid oxygen shortage and faltering health system in the country, India saw 2,263 deaths in highest single-day spike. The death toll from the deadly infection stands at 186,928. The country now has more than 2.4 million active cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X