చైనాతో టెన్షన్: చర్చలు సఫలం - బలగాల తరలింపు నిలిపివేతకు అంగీకారం - ఉమ్మడి ప్రకటన
భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నాలుగు నెలలుగా కొనసాగుతోన్న ఉద్రిక్తతల్ని నివారించే క్రమంలో కీలక అడుగు పడింది. రెండు దేశాల సైనిక కార్ప్స్ కమాండర్ల మధ్య 13 గంటలపాటు సాగిన ఆరో దఫా చర్చలు చివరికి ఫలవంతమయ్యాయి. ఈ మేరకు అంగీకారం కుదిరిన అంశాలపై భారత్, చైనా ఉమ్మడి ప్రకటన చేశాయి. తొలిసారి సైనిక చర్చల్లో భాగం పంచుకున్న విదేశాంగ శాఖ ఈ మేరకు గురువారం కీలక అంశాలను వెల్లడించింది.

ఏకాభిప్రాయం కుదిరిన అంశాలివే..
ఎల్ఏసీ వెంబడి తూర్పు లదాక్ లోని పాంగాంగ్ సరస్సుకు ఇరువైపులా, అటు దెప్సాంగ్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులోనూ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతుండటం తెలిసిందే. చైనాకు ధీటుగా వ్యవహరించిన భారత్.. డ్రాగన్ సైన్యాలకు సమాన స్థాయిలో బలగాలను మోహరించింది. పరిస్థితి జఠిలం అవుతున్నకొద్దీ రెండు వైపులా అదనపు బలగాల తరలింపు ప్రక్రియ వేగవంతమైంది. అయితే, సోమవారం నాటి కార్ప్స్ కమాండర్ల స్థాయి చర్చల్లో.. ఇకపై లదాక్ లోని ఫ్రంట్ లైన్ కు అదనపు బలగాల తరలింపును తరలించకూడదని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. అలాగే, మాస్కో వేదికగా రెండు దేశాల విదేశాంగ శాఖల మంత్రులు కుదుర్చుకున్న ‘ఐదు సూత్రాల ఫార్ములా'ను క్షేత్రస్థాయిలో అమలు చేయాలనే అంగీకారానికి వచ్చాయి.

భారత విదేశాంగ శాఖ ప్రకటన..
‘‘సెప్టెంబర్ 21 న(సోమవారం) భారత్, చైనీస్ సీనియర్ కమాండర్ల మధ్య 6 వ రౌండ్ చర్చలు జరిగాయి. ఇందులో పలు కీలకమైన అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. విదేశాంగ శాఖ మంత్రులు అంగీకరించిన ఫైవ్ పాయింట్ ఫార్ములాను గ్రౌండ్ లెవల్ లో అమలు చేసేందుకు అంగీకారం కుదిరింది. అపార్ధాలు, దురభిప్రాయాలు, వివాదాలకు తావు లేకుండా ఇకపైనా కమ్యూనికేషన్ కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అదేసమయంలో ఫ్రంట్ లైన్ కు అదనపు బలగాల తరలింపును నిలిపేయాలని డిసైడ్ అయ్యారు. పరిస్థితి మరింత జఠిలం కాకుండా, సరిహద్దులో సాధారణ పరిస్థితులు నెలకొనే దిశగా చర్యలు తీసుకోవాలని రెండు దేశాలూ నిర్ణయించుకున్నాయి'' అని విదేశాంగ శాఖ తన ప్రకటనలో పేర్కొంది.

త్వరలో 7వ రౌడ్ చర్చలు..
లెఫ్లినెంట్ జనరల్ స్థాయిలో సోమవరం నాటి 6వ రౌండ్ చర్చల్లో భారత ప్రతినిధి బృందానికి లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ నేతృత్వం వహించగా, తొలిసారి విదేశాంగ శాఖ జాయింట్ సెక్రటరీ నవీన్ శ్రీవాస్తవ సైతం సభ్యుడిగా వ్యవహరించారు. ఇక చైనా నుంచి వెస్ట్రన్ థియేటర్ కమాండ్ (సౌత్ జిన్జియాంగ్) కమాండర్ లియూ లిన్, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ భేటీలో కీలక అంగీకారాలు కుదిరిన దరిమిలా, వాటి అమలుపై సమీక్ష జరిపేందుకు, ఉద్రిక్తతలు పూర్తిగా తొలిగిపోయేలా మరిన్ని నిర్ణయాలు తీసుకునేందుకు లెఫ్టినెంట్ జనరల్స్ మధ్య 7వ రౌండ్ చర్చలు కూడా జరపాలని భారత్, చైనా నిర్ణయించుకున్నాయి. అదనంగా బలగాలను పంపకూడదని నిర్ణయించడం చర్చల్లో పురోగతే అయినప్పటికీ.. సరిహద్దు వెంబడి ఇప్పటికే మోహరించిన సైనికుల్ని వెనక్కి రప్పించే దిశగా ఎలాంటి అంగీకారం కుదరలేదు.
-
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
వేసవిలో ఈ చల్లని ప్రాంతాలకు వెళ్తే ఆ కిక్కే వేరప్పా.. -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్"












Click it and Unblock the Notifications