వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా వస్తువులపై 300% అధిక పన్ను.. కంటికి కన్ను పెకిలిద్దాం.. ప్రధానితో అఖిలపక్షం నేతలు..

|
Google Oneindia TeluguNews

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి కొనసాగుతోన్న ఉద్రిక్తత, తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయలో 20 మంది జవాన్ల కిరాతక హత్యలు, చైనా పట్ల తదుపరి వ్యవహరించాల్సిన వ్యూహాలపై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయా పార్టీలు భిన్నాభిప్రాయాల్ని వ్యక్తం చేశాయి. అయితే దేశ సమగ్రతను కాపాడుకునే విషయంలో మోదీ సర్కారుకు బేషరతుగా మద్దతు ఇస్తామని, చైనాను కట్టడి చేసితీరాల్సిన అవసరం ఉందని ముక్తకంఠంతో నినదించాయి.

గాల్వాన్‌లో చైనా హింసపై అఖిలపక్షం.. ఏకాభిప్రాయ సాధనపై మోదీ ఫోకస్.. లదాక్‌లో యుద్ధవిమానాలు.. గాల్వాన్‌లో చైనా హింసపై అఖిలపక్షం.. ఏకాభిప్రాయ సాధనపై మోదీ ఫోకస్.. లదాక్‌లో యుద్ధవిమానాలు..

వాస్తవాలు దాస్తున్నారు..

వాస్తవాలు దాస్తున్నారు..

గడిచిన కొద్ది రోజులుగా ఎల్ఏసీలో చోటుచేసుకుంటోన్న వ్యవహారాలపై కేంద్రం దాగుడుమూతలు ఆడుతున్నదని, గాల్వాన్ లోయలో 20 మంది సైనికులు హత్యకు గురైన తర్వాత కూడా బీజేపీ సర్కారు ప్రజల్ని ఏమార్చడానికి ప్రయత్నిస్తున్నదని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోపించారు. ప్రధాని మోదీతో అఖిలపక్షం భేటీకి హాజరైన ఆమె.. ఇది ఇండియాకు చాలా కీలకమైన సందర్భమని, ఈ సమయంలో అందరం ఐక్యంగా ఉండాల్సిన అవసరముందని, కేంద్రానికి అన్ని విషయాల్లో మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ వెనుకాడబోదని ఆమె స్పష్టం చేశారు. అయితే, అందుకు తగ్గట్టుగా కేంద్రం కూడా వాస్తవాలను ప్రజలకు చెప్పాలని, చాలా అంశాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉందని సోనియా అన్నారు. గాల్వాన్ ఘటనలోగానీ, సరిహద్దులో కొన్నాళ్లుగా కొనసాగుతోన్న వ్యవహారాల్లోగానీ ఇంటెలిజెన్స్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని సోనియా అన్నారు.

నాకు విప్ జారీ చేసేంత మగాడా?.. చంద్రబాబుపై వల్లభనేని వంశీ ఫైర్.. టీడీపీకే వేశానన్న మద్దాలి గిరి..నాకు విప్ జారీ చేసేంత మగాడా?.. చంద్రబాబుపై వల్లభనేని వంశీ ఫైర్.. టీడీపీకే వేశానన్న మద్దాలి గిరి..

చైనా ఓ నియంతృత్వ దేశం..

చైనా ఓ నియంతృత్వ దేశం..

‘‘చైనాలో ప్రజాస్వామ్యం లేదు. అదో నియంతృత్వ దేశం కాబట్టే ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది. దాన్ని అడ్డుకునే క్రమంలో మనమంతా ఒక్కటిగా పోరాడాలి. ఈ పోరాటంలో ఇండియా తప్పక విజయం సాధిస్తుంది.. చైనా మట్టికరవడం ఖాయం. మోదీగారూ.. ఇకపై మీరు ఏది ఆలోచించినా, మాట్లాడినా ఐక్యత దృష్టికోణంలోనే వ్యవహరించండి. టెలికాం, రైల్వే, ఏవియేషన్ సహా అన్ని రంగాల్లో చైనా కంపెనీలను అనుమతించొద్దు. ఈ నిర్ణయం వల్ల మనకు కొన్ని ఇబ్బందులు ఎదురుకావొచ్చు.. కానీ తొందర్లోనే అంతా సర్దుకుంటుంది..''అని అఖిపక్షం భేటీలో టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన అభిప్రాయాన్ని చెప్పారు.

అమెరికాకు లొంగొద్దు..

అమెరికాకు లొంగొద్దు..


చైనాకు వ్యతిరేకంగా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా తలపెట్టిన కార్యక్రమాలకు భారత్ దూరంగా ఉండాలని, అగ్రరాజ్యం నేతృత్వంలో ఏర్పాటయ్యే ఎలాంటి కూటమిలోనూ మనం చేరొద్దని సీపీఐ నేత డి.రాజా, సీపీఎం నేత సీతారాం ఏచూరి హితవు పలికారు. గాల్వాన్ హింసపై ప్రధానితో భేటీలో మాట్లాడిన కమ్యూనిస్టు నేతలు.. చైనాను కట్టడి చేసే విషయంలో కేంద్రం తీసుకునే నిర్ణయాలకు మద్దతిస్తామని, అయితే, ముందుగా కేంద్రం నిజాలను వెల్లడించాలని అన్నారు.

ఒప్పందాల మేరకు..

ఒప్పందాల మేరకు..

గాల్వాన్ లోయలో 20 మంది జవాన్లు చనిపోయిన తీరు, వాళ్లంతా ఆయుధాలు వాడకపోవడం చర్చనీయాంశమైన నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ.. అంతర్జాతీయ ఒప్పందాల మేరకే భారత జవాన్లు ఆయుధాలు వాడలేదని, నిజానికి కఠినమైన సమయంలోనూ వారు ఒప్పందాలకు కట్టుబడి ఉండటం చాలా గొప్ప విషయమని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. గతంలో రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన తనకు సరిహద్దు భద్రతపై అవగాహన ఉందని, చైనా విషయంలో కేంద్రం తీసుకోబోయే నిర్ణయాన్ని సమర్థిస్తామని, అయితే, కేంద్రం ఎంత ఫెయిర్ గా ఉంటే, ప్రజలు కూడా అంతే స్థాయిలో ప్రభుత్వానికి అండగా ఉంటారని పవార్ వ్యాఖ్యానించారు.

చైనా సరుకులపై 300% పన్ను..

చైనా సరుకులపై 300% పన్ను..

ప్రధానితో భేటీలో పలు పార్టీల నేతలు.. చైనా వస్తుల బహిష్కరణకు పట్టుపట్టడం గమనార్హం. చైనా-పాకిస్తాన్ ల ద్వంద్వ నీతి ఒకే తీరుగా ఉందని, ఇండియాలోకి చైనా వస్తువల దిగుమతిని కట్టడి చేయాలని, వాటిపై కనీసం 300 శాతం అదనపు పన్ను విధించాలని సమాజ్ వాదీ పార్టీ నేత రాంగోపాల్ యాదవ్ సూచించారు. జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. వెల్లువలా ముంచుకొస్తున్న చైనా వస్తువులు ఇండియా వాతావరణాన్ని నాశనం చేస్తున్నాయని, చైనా వస్తువులు నాసిరకమైనవేకాకుండా ప్రకృతికి తీవ్రంగా హాని తలపెడుతున్నాయని, వాటిని అడ్డుకుని తీరాల్సిన అవసరముందని, చైనా విషయంలో కేంద్రం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా తాము మద్దతిస్తామని నితీశ్ అన్నారు.

Recommended Video

KCR Announces Rs 5 Cr Ex-gratia to Col Santosh's Family & Rs 10 Lakh Each of 19 Other Soldiers
కంటికి కన్ను.. తగ్గొద్దు..

కంటికి కన్ను.. తగ్గొద్దు..

‘‘ఇండియా స్వతహాగానే శాంతికాముక దేశం. అంతమాత్రాన ఎదుటివాడు పిచ్చిపట్టినట్లు రెచ్చిపోతుంటే చూస్తూ ఊరుకోరాదు. మన మంచితనాన్ని చేతగానితనంగా చైనా భావిస్తున్నదేమో. వాళ్లకు గట్టిగా బుద్ధి చెప్పాల్సిన టైమొచ్చింది. కంటికి కన్ను పెకిలించి చేతిలోపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. మోదీజీ.. ఈ విషయంలో మీరు ఎలాంటి స్టెప్ తీసుకున్నా అండగా ఉంటాం. ఈ క్లిష్ట పరిస్థితుల్లో సైనిక బలగాలు, వారి కుటుంబాలకు మనందరం అండగా నిలబడాలి..''అని శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.

English summary
amid India-China clash at Ladakh and the death of 20 jawans, almost all parties extended their support to central government to take further decision to control china
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X