Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యుద్ధం తప్పదా?: సైన్యం మోహరింపు, డ్రాగన్ కవ్వింపు?

భారత్, చైనా, భూటాన్ దేశాలకు సిక్కిం సమీపంలోని డోక్లాం కనుమ వద్ద గల ముక్కోణపు జంక్షన్ ఎంతో కీలకం. ఈ ప్రాంతంపై పట్టు కోసం ప్రయత్నిస్తున్న చైనా పెద్దన్న పాత్ర పోషించాలని ఉబలాట పడుతున్నది.

న్యూఢిల్లీ: భారత్, చైనా, భూటాన్ దేశాలకు సిక్కిం సమీపంలోని డోక్లాం కనుమ వద్ద గల ముక్కోణపు జంక్షన్ ఎంతో కీలకం. ఈ ప్రాంతంపై పట్టు కోసం ప్రయత్నిస్తున్న చైనా పెద్దన్న పాత్ర పోషించాలని ఉబలాట పడుతున్నది. గత నెల ప్రారంభంలో సిక్కింలోని భారత భూభాగంలో అడుగు పెట్టిన చైనా సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నదా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు వీలుగా శాశ్వత ప్రాతిపదికన రోడ్డు నిర్మాణానికి పూనుకోవడమే రెండు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొనడానికి కారణం. చైనా సైన్యంతోపాటు, భారత్ బలగాలు నెలరోజులుగా ఇక్కడే తిష్ట వేశాయి. ఇండియా, చైనా ముఖాముఖీ తలపడతాయా? అన్న స్థాయిలో బలగాలను ఇన్నిరోజులు మోహరించడం 1962 తర్వాత ఇదే తొలిసారి.

గత నెల రెండో వారంలో సరిహద్దులు దాటివచ్చిన చైనా ఆర్మీ రెండు బంకర్లను ధ్వంసం చేసిన నేపథ్యంలో భారత్ మరింత జాగరూకతతో వ్యవహరిస్తున్నది. అదనపు బలగాలను డోక్లాం ప్రాంతానికి చేర్చింది. యుద్ధ సన్నాహాలేమీ లేకపోయినా భద్రతాదళాలను అప్రమత్తం చేసింది. భారత్ డోకా-లాగా పిలుస్తున్న ఈ ప్రాంతాన్ని చైనా డాంగ్లాంగ్‌గా, భుటాన్ డోక్లామ్‌గా వ్యవహరిస్తున్నాయి.

బంకర్లు తొలగించాలని భారత్ ఆర్మీకి సూచన

బంకర్లు తొలగించాలని భారత్ ఆర్మీకి సూచన

2012లో డోకా-లా ప్రాంతంలోని లాల్తెన్ వద్ద భారత్ ఏర్పాటు చేసిన రెండు బంకర్లను తొలగించాలంటూ చైనా ఆర్మీ జూన్1న భారత సైన్యానికి సూచించింది. ఈ బంకర్లు భారత్-భుటాన్-చైనా మూడుదేశాల సరిహద్దు అయిన చంబల్‌లోయకు సమీపంలో ఉన్నాయి. భుటాన్-చైనా సరిహద్దు భద్రతాబృందాలకు రక్షణ ఇవ్వడంతోపాటు అవసరాలు ఏర్పడిన సందర్భంలో వాటిని వాడుకునేందుకు వీలుగా 2012లో భారత్ ఈ బంకర్లను ఏర్పాటు చేసింది.

గత నెల ఆరోతేదీ రాత్రి రెండు చైనా బుల్‌డోజర్లు భారత బంకర్లను ధ్వంసం చేశాయి. వెనువెంటనే అప్రమత్తమైన భారత సైన్యం చైనా ఆర్మీని నిలువరించినప్పుడు జరిగిన ఘర్షణలో ఇరు దేశాల సైనికులకు స్వల్ప గాయాలయ్యాయి. అప్పటినుంచీ అక్కడ ఇరుదేశాలు సైన్యాన్ని మోహరించాయి. 2013లో జమ్మూకశ్మీర్‌లోని లడఖ్ డివిజన్‌లో దౌలత్‌బేగ్ ఓల్డీ వద్ద 21రోజులపాటు భారత్, చైనా ముఖాముఖి సైన్యాన్ని మోహరించాయి. ఈసారి ఇప్పటికే నెలరోజులగా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉన్నది. ఏకపక్షంగా రోడ్డు నిర్మాణం చేపట్టిన చైనా తీరును భూటాన్ కూడా వ్యతిరేకిస్తున్నది.

సిక్కిం పరిధిలో పెరుగుతున్న ఉద్రిక్తత

సిక్కిం పరిధిలో పెరుగుతున్న ఉద్రిక్తత

3488 కిలోమీటర్ల పొడవైన ఇండో-చైనా సరిహద్దులో 220 కిలోమీటర్లు సిక్కిం సెక్షన్ పరిధిలోనే ఉంది. ఒక్క సిక్కింలోనే భారత్-చైనా మధ్య స్పష్టమైన సరిహద్దులు ఉన్నాయి. 1898లో చైనాతో జరిగిన ఒప్పందం మేరకు ఈ సరిహద్దుల్ని ఖరారు చేశారు. అంతర్జాతీయ సరిహద్దుకు 15కిలోమీటర్ల దూరాన ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసు బృందాలను ఏర్పాటు చేసిన భారత్ 1962 యుద్ధ సమయంలోనూ హద్దుల చెరిపివేతకు ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. అయితే కీలకమైన ప్రాంతంలో యుద్ధట్యాంకులు వెళ్లేందుకు వీలుగా రోడ్డు నిర్మించాలన్నది చైనా ఆలోచన. దీనికి భారత్, భూటాన్ దేశాలు అంగీకరించడంలేదు.

మానస సరోవర్ యాత్ర ఇలా రద్దు

మానస సరోవర్ యాత్ర ఇలా రద్దు

తాజా పరిణామాల నేపథ్యంలో జూన్ రెండవవారంలో చైనాను భారత్ రెండుసార్లు ఫ్లాగ్ మీటింగ్‌కు ఆహ్వానించింది. అయితే, మూడోసారి సమావేశానికి అంగీకరించిన చైనా, లాల్తెన్ ప్రాంతం నుంచి బలగాలను వెనక్కి తీసుకోవాలని చెప్పింది. అందుకు భారత్ అంగీకరించలేదు. దీంతో 47మందితో కూడిన తొలివిడత మానససరోవర్ యాత్రికుల బృందానికి చైనా అనుమతి నిరాకరించింది. మరో 50 మంది యాత్రికులకు వీసాలను రద్దు చేసింది. నాథులా నుంచి కైలాశ్ మానససరోవరానికి వెళ్లే బస్సు మార్గాన్నీ మూసేశారు.

బలగాల ఉపసంహరణకు చైనా షరతు

బలగాల ఉపసంహరణకు చైనా షరతు

బలగాలను భారత్ వెనక్కి తీసుకుంటేనే యాత్రికులను అనుమతిస్తామని చైనా షరతు పెట్టింది. చంబీలోయపై తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు డ్రాగన్ దేశం ప్రయత్నిస్తున్నదని, అందుకోసమే డోకా-లాలో అడుగులు వేస్తున్నదని విశ్లేషకులు చెప్తున్నారు. భారత్-భుటాన్ సరిహద్దు పొడవునా తన నిఘాను పటిష్టం చేసుకోవాలన్నది చైనా ఎత్తుగడ. 2008లోనూ భారత బంకర్‌ను ధ్వంసం చేసిన చైనా పదే పదే తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నది. ఇండియానే సరిహద్దు దాటి వచ్చిందంటూ గగ్గోలు పెడుతూ మనదేశంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నది.

కుంటి సాకులు వెతుకుతున్న చైనా

కుంటి సాకులు వెతుకుతున్న చైనా

సిక్కిం సెక్లార్లో ఉండే డోకా-లా కనుమను తమ దేశంలో భాగంగా చూపుతూ చైనా ఓ మ్యాప్‌ను విడుదల చేసింది. ఈ ప్రాంతంలో ఎప్పటినుంచో చైనీయులు తమ పశువులకు గడ్డి మేపుతున్నారని, ఒకప్పుడు భూటాన్ ప్రజలు ఇక్కడ గడ్డి కోసం రావాలంటే అప్పటి తమ ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉండేదని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి లూ కాంగ్ తెలిపారు. గురువారం మ్యాప్‌తోపాటు ఆయన రెండు ఫొటోలను కూడా విడుదల చేశారు. అనంతరం వాటిని అధికారిక వెబ్‌సైట్‌లోనూ పొందుపర్చారు. భారత్‌కు చెందినవిగా పేర్కొంటున్న బుల్‌డోజర్లుగా ఈ ఫొటోల్లో ఉన్నాయి. జూన్18న భారతసైన్యం సరిహద్దు దాటి వచ్చిందని ఆరోపించిన చైనా, లా కనుమ తమదేనని చెప్పడానికి ఈ రుజువులు సరిపోతాయని తెలిపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+