వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌లో గురుద్వారాపై రాళ్ల దాడి: భారత్ తీవ్ర ఖండన, వెంటనే చర్యలకు డిమాండ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లోని గురుద్వారా నాన్‌కానా సాహిబ్‌పై ముస్లిం గుంపు చేసిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. గురునానక్ దేవ్ జన్మించిన పవిత్ర స్థలం నాన్‌కానా సాహిబ్ లో సిక్కులపై హింసాత్మక దాడులు జరుగుతున్నాయని, మైనార్టీ సిక్కుల భద్రత, సంక్షేమం కోసం పాకిస్థాన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.

గురుద్వారాతోపాటు సిక్కులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. సిక్కు యువతిని కిడ్నాప్ చేసి, ఆమెను మతం మార్చిన ముస్లిం కుటుంబంపైనా చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్ చేసింది. సిక్కు యువతిని కిడ్నాప్ చేసి మత మార్పిడి చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కూడా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఆ ప్రాంతంలోని సిక్కులను కాపాడాలంటూ విజ్ఞప్తి చేశారు.

 India condemns attack at Nankana Sahib Gurdwara in Pak

గురుద్వారాపై రాళ్లు రువ్వుతూ దాడి..

పాకిస్థాన్‌లోని నంకనా సాహిబ్‌ గురుద్వారా వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. మందిరంలో సిక్కులు ప్రార్థనలు చేస్తున్న సమయంలో కొందరు ముస్లింలు రాళ్లతో దాడులు చేస్తున్నారు. దీంతో లోపల ఉన్న సిక్కులు భయంతో గజ గజ వణికిపోతున్నారు. నంకనా సాహిబ్‌లో ఒక్క సిక్కు లేకుండా చేస్తామని ముస్లింలు నినాదాలు చేస్తున్నారు.

మహ్మద్ హస్సన్ నేతృత్వంలో గురుద్వారాపై రాళ్లతో దాడులకు దిగారు. మహ్మద్ కుమారుడు ఇటీవల గురుద్వారా పతి కుమార్తె జగజిత్ కౌర్‌ను అపహరించి, మతం మార్చారు. దీంతో కలకలం రేగింది. తర్వాత ముస్లిం-సిక్కుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి మహ్మద్ హస్సన్, ఇతరులతో కలిసి రాళ్లతో దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

శుక్రవారం 7 గంటల సమయంలో మహ్మద్ హస్సన్ సహా కొందరు గుమిగూడి గురుద్వారాపై రాళ్లతో విరుచుకుపడుతున్నారు. అంతేకాదు గురుద్వారాను కూల్చివేస్తామని నినాదాలు చేస్తున్నారు. ఆందోళనకారులు దాడులు చేస్తున్న సమయంలో తీసిన వీడియో ఒకటి ట్రోల్ అవుతోంది. అందులో ఆందోళనకారులు నంకనా సాహిబ్ కాస్త గులామన్-ఏ-ముస్తాఫాగా మారుస్తామని చెప్తున్నారు.

కాగా, పాకిస్థాన్‌లోని నంకనా సాహిబ్ సిక్కుల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంటోంది. సిక్కుల మొదటి మత గురువు గురునానక్ దేవ్ 1469లో ఇక్కడే జన్మించారు. ఈ ప్రాంతం అంటే సిక్కులు పవిత్రంగా భావిస్తారు. అధిక సంఖ్యలో సిక్కులు కూడా నివసిస్తారు. వారి ప్రాతినిధ్యం ఎక్కువవుతోన్న క్రమంలో అడ్డుకొనేందుకు ముస్లింలు దాడులకు తెగబడుతున్నారు.

English summary
An angry mob on Friday evening pelted stones at Gurdwara Nankana Sahib in Pakistan. Accordig to the initial reports, the agitated mob was led by the family of a boy named Mohammad Hassan, who had allegedly abducted Sikh girl Jagjit Kaur and converted her, the girl is the daughter of gurdwara's pathi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X