ట్రంప్ కు బిగ్ షాక్.. భారత్ లో అకౌంట్ క్లోజ్..?

ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ కే కాదు.. ప్రపంచ దేశాలకూ భారత్ షాక్ ఇచ్చింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7 నుంచి 11 వరకు జరిగిన ఈ భీకర పోరులో పాకిస్థాన్ ను భారత్ చావు దెబ్బ కొట్టింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది భారత్. ఈ దాడిలో 100 మంది ఉగ్రవాదులు హతం అయ్యారు. ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ వైమానిక, ఆర్మీ స్థావరాలపై దాడి చేసి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది భారత ఆర్మీ. పాక్ లోని 12 కు పైగా మిలిటరీ స్థావరాలపై భారత్ దాడి చేసింది. దీంతో పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ విభాగం 20 శాతం మేర మౌలిక వసతులను కోల్పోయినట్లు నివేదిక అందుతోంది.

అయితే భారత్- పాకిస్థాన్ వ్యవహారంలోకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తలదూర్చారు. ఇరు దేశాలు కాల్పుల విరమణ అంగీకారానికి ఒప్పుకున్నాయని సామాజిక మాధ్యమమైన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇరు దేశాలతో తనకు సత్సంబంధాలు ఉన్నట్లు.. యుద్ధం ఆపితే భారత్- పాకిస్థాన్ తో వ్యాపార బంధాలు మరింత పెంచేందుకు అమెరికా ముందుంటుందని ట్రంప్ చెప్పుకొచ్చారు.

తాజాగా సౌదీ అరేబియా టూర్ చేపట్టారు ట్రంప్. అక్కడ కూడా తన వైఖరిని ప్రదర్శించారు. భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోవడానికి తానే కారణం అని డొనాల్డ్ ట్రంప్ ఇదివరకే ప్రకటించారు. యుద్ధాన్ని కొనసాగించితే తీవ్ర పరిణామాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని తాను హెచ్చరించానని, దీనితో ఈ రెండు దేశాలు కూడా యుద్ధ విరమణ ప్రకటించాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇలా మీడియా కాన్ఫరెన్స్ పెట్టిన ప్రతిసారీ ట్రంప్ ఇదే ప్రస్తావిస్తూ వస్తున్నారు.

India Denies Trump s Claim of Mediating Peace with Pakistan

అయితే ట్రంప్ వైఖరిపై భారత్ మౌనంగా ఉంటూ వస్తోంది. ప్రధాని మోదీ సైతం ఇటీవల జాతినుద్దేశించి రెండు సార్లు ప్రసగించారు. ఎక్కడా ట్రంప్ మాట ఎత్తలేదు. దీంతో దేశవ్యాప్తంగా ట్రంప్ వ్యవహారంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ట్రంప్ వైఖరిని ఖండించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయంపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ.. భారత దాడిని తట్టుకోలేకనే పాకిస్థాన్ కాళ్లబేరానికి వచ్చిందని అన్నారు.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను తమకు అప్పగించడమే పాకిస్థాన్ ముందు ఉన్న ఏకైక జవాబు అని భారత్ తేల్చి చెబుతోంది. కాశ్మీర్ అనేది ఇరు దేశాల అంతర్గత విషయమని అమెరికానే కాదు వేరే ఏ దేశం దూరినా తాము వెనకడుగు వేయబోమని చెబుతోంది. వందల ఏళ్ల కాశ్మీర్ సమస్యకు తాము సమాధానం చెబుతామని ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు భారత్ ఈ విధంగా కౌంటర్ ఇచ్చింది. అంతేకాక అమెరికాతో వాణిజ్య పరమైన చర్చలకు కూడా కొద్దిరోజులు బ్రేక్ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+