వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ ప్రతీకారం.. చైనాపై ఎయిర్ స్ట్రైక్స్.. భారీగా ఫైటర్ జెట్స్,యుద్ధనౌకల మోహరింపు.. ‘ది సన్’ సంచలనం

|
Google Oneindia TeluguNews

''చిన్న సాక్ష్యం కూడా లేని 'బాలాకోట్ దాడి'ని బీజేపీ ఎన్నికల ప్రచారానికి వాడుకుంది. ఇవాళ చైనా దురాగతానికి బలైపోయిన 20 మంది అమరజవాన్ల మృతదేహాలు దేశం కళ్లముందున్నాయి.. దీనికి ఏమని బదులిస్తారు?'' అంటూ ప్రతిపక్ష పార్టీలు సంధించిన ప్రశ్నలకు.. ప్రధాని నరేంద్ర మోదీ.. చేతల్లోనే సమాధానం చెప్పేందుకు రెడీ అయ్యారని.. ''దీటుగా బదులిస్తాం..''అంటూ చైనాకు జారీచేసిన హెచ్చరికను కార్యరూపంలోకి మలచబోతున్నారని.. మొత్తంగా చైనాపై ఎయిర్ స్ట్రైక్ తరహా భారీ దాడికి భారత్ సమాయత్తమైందని విశ్వసనీయంగా తెలిసినట్లు ప్రఖ్యాత మీడియా సంస్థ 'ది సన్' సంచలన కథనాన్ని ప్రచురించింది.

అటు దౌత్యం.. ఇటు దండన..

అటు దౌత్యం.. ఇటు దండన..

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి దాదాపు రెండు నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, రెండు వైపులా సమాన స్థాయిలో బలగాలను మోహరించడం, సీనియర్ కమాండర్ల స్థాయి చర్చల్లో బలగాల ఉపసంహరణ(డీఎస్కలేషన్)కు ఒప్పందం కుదరడం, అంతలోనే సోమవారం రాత్రి తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయలో సైనికులు ఘర్షణపడటం, రెండు వైపులా ప్రాణనష్టం జరగడం, గాల్వాన్ లోయపై చైనా సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోవడం తదితర పరిణామాల నేపథ్యంలో పరిస్థితిని చక్కబెట్టేందుకు ఓవైపు చర్చలు, దౌత్యాన్ని కొనసాగిస్తూనే.. రాబోయే రోజుల్లో చైనా దూకుడును అడ్డుకునేలా దండోపాయానికి సైతం భారత్ రెడీ అయిందని ‘ది సన్' తెలిపింది.

కరోనా వైరస్: మళ్లీ దేశవ్యాప్త లాక్‌ డౌన్.. కుండబద్దలుకొట్టిన ప్రధాని మోదీ.. సీఎంల కాన్ఫరెన్స్‌లో..కరోనా వైరస్: మళ్లీ దేశవ్యాప్త లాక్‌ డౌన్.. కుండబద్దలుకొట్టిన ప్రధాని మోదీ.. సీఎంల కాన్ఫరెన్స్‌లో..

సీడీఎస్ కు ఆదేశం..

సీడీఎస్ కు ఆదేశం..

గాల్వాన్ లోయలో చైనా దురాగతానికి బలైపోయిన 20 మంది జవాన్ల త్యాగం వృధా కాబోదని, భారత్ శాంతినే కోరుతున్నప్పటికీ.. రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే దీటుగా బదులిస్తామంటూ ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం జాతినుద్దేశించి ఒక సందేశాన్ని విడుదల చేశారు. సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత విషయంలో ఇంచు కూడా వెనక్కి తగ్గబోమని ప్రధాని స్పష్టం చేశారు. ఆయనా ప్రకటన చేసే సమయానికే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ కు కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయని, తదుపరి ఆదేశాల అమలుకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ బలగాలు రెడీగా ఉండాలని ఆదేశాల్లో పేర్కొన్నట్లు తెలిసిందని ‘ది సన్' రాసుకొచ్చింది.

చైనాకు ప్రధాని మోదీ సీరియస్ వార్నింగ్.. ఘర్షణలపై తొలిసారి.. సీఎంలతో కాన్ఫరెన్స్‌.. జవాన్లకు నివాళి..చైనాకు ప్రధాని మోదీ సీరియస్ వార్నింగ్.. ఘర్షణలపై తొలిసారి.. సీఎంలతో కాన్ఫరెన్స్‌.. జవాన్లకు నివాళి..

ఫైటర్ జెట్స్..

ఫైటర్ జెట్స్..

చైనాను ఇంతకాలం ఉపేక్షించబట్టే 20 మంది జవాన్లను కోల్పోయామని, అలాంటి దురాగతం మరోటి జరగకముందే చైనాపై చర్యలకు దిగే అవకాశాలను పూర్తిగా వాడుకోవాలని కేంద్రం భావిస్తున్నట్లు అధికార వర్గాలు ‘ఎకనామిక్ టైమ్స్'తో పంచుకున్న అభిప్రాయాన్ని కూడా ‘ది సన్' ప్రస్తావించింది. ఎల్ఏసీ వెంబడి ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలోనే సైన్యాన్ని, బోఫోర్స్ శతఘ్నుల వంటి ఆయుధ సామాగ్రిని సరిహద్దు వద్దకు చేర్చిన భారత్.. ఇప్పుడు యుద్ధ విమానాలను సైతం రంగంలోకి దింపిందని, ఎల్ఏసీకి సమీపంలోని ఎయిర్ బేస్ లకు ఫైటర్ జెట్లను తరలించిందని కథనంలో పేర్కొన్నారు. మరోవైపు..

మలాకా జలసంధిలో..

మలాకా జలసంధిలో..

1975 తర్వాత తొలిసారి సరిహద్దులో సైనికుల హత్యలు చోటుచేసుకోవడాన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తున్నదని, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ తోపాటు నేవీని కూడా రంగంలోకి దింపిందని, కీలకమైన మలాకా జలసంధి వద్ద భారత్ యుద్ధ నౌకలను మోహరింపజేసిందని కథనంలో రాసుకొచ్చారు. మలేసియా, ఇండోనేసియా మధ్య ఉండే మలాకా జలసంధి చైనా చమురు వ్యాపారానికి ముఖ్యమైన మార్గంగా ఉన్నది. అక్కడ యుద్ధ నౌకల్ని నిలపడం ద్వారా దేనికైనా సిద్ధమనే సంకేతాలను భారత్ పంపాలనుకుంటున్నదని ‘ది సన్' తెలిపింది. నిజంగా చైనాపై దాడికి సంబంధించి భారత్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, విదేశీ మీడియాలో యుద్ధం తప్పదంటూ కథనాలు వస్తుండటం గమనార్హం.

Recommended Video

#Lockdown : PM Modi Clarifies About Lockdown Extension
ఇండియాను తేలిక చేస్తూ..

ఇండియాను తేలిక చేస్తూ..

గాల్వాన్ లోయలో దురాగతానికి పాల్పడటమే కాకుండా ఆ ప్రాంతం తమదేనని ప్రకటించుకున్న చైనా.. భారత సైన్యాలను ఉద్దేశించి తేలికపాటి వ్యాఖ్యానాలు చేస్తూ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నది. చైనాలో అధికార కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన ‘గ్లోబల్ టైమ్స్' బుధవారం నాటి ఎడిటోరియల్ లో భారత్ పై విషం కక్కింది. తాము శాంతిని మాత్రమే కోరతామని, ఇండియానే యుద్ధానికి రెచ్చగొడుతున్నదని, ఒకవేళ అదే జరిగితే చైనా బలగాలతో ఏమాత్రం సరితూగలేని భారత్ కు భంగపాటు తప్పదంటూ పరోక్షంగా హెచ్చరించింది. గాల్వాన్ లో 20 మంది జవాన్ల మరణాల తర్వాత భారత్ అంతటా చైనాకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. చైనా వస్తువుల బహిష్కరణకు పిలుపునిస్తూ, పలు చోట్ల ఆ దేశ జెండాలను తగులబెట్టారు.

English summary
prominent uk media giant the sun report that INDIA has deployed warships and fighter jets after China killed 20 soldiers in bloody clashes on the border amid rising tensions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X