అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులపై భారత్ నిషేధం మరోమారు పొడిగింపు: డిజిసిఏ ప్రకటన

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సోమవారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశానికి వచ్చే, భారతదేశం నుండి వెళ్లే అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణీకుల సేవలను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. అంతర్జాతీయ కార్గో కార్యకలాపాలు మరియు ప్రత్యేకంగా ఆమోదించిన విమానాలకు ఈ పరిమితి వర్తించదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది.

 మరోమారు అంతర్జాతీయ ప్రయాణీకుల విమాన సర్వీసులపై భారత్ నిషేధం

మరోమారు అంతర్జాతీయ ప్రయాణీకుల విమాన సర్వీసులపై భారత్ నిషేధం

అంతర్జాతీయ ప్రయాణీకుల విమాన సర్వీసుల పై ఉన్న నిషేధాన్ని భారత్ మరోమారు పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు భారతదేశ అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) సోమవారం కొత్త ఆర్డర్‌లో పేర్కొంది. కోవిడ్-19 మహమ్మారి ఒమిక్రాన్ వేవ్ ల దృష్ట్యా షెడ్యూల్ చేయబడిన అంతర్జాతీయ విమాన సేవలు ఫిబ్రవరి 28 వరకు నిలిపివేయబడ్డాయి.

డీజీసీఏ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిషేధం అమలు

డీజీసీఏ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిషేధం అమలు

నవంబర్ 26, 2021 నాటి మునుపటి సర్క్యులర్ యొక్క పాక్షిక సవరణలో, డీజీసీఏ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు షెడ్యూల్ చేయబడిన అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణీకుల సేవలను నిలిపివేయడాన్ని పొడిగించాలని సమర్థ అధికారం నిర్ణయించిందని వెల్లడించింది. అంతర్జాతీయ అన్ని కార్గో కార్యకలాపాలకు మరియు డీజీసీఏ ఆమోదించిన విమానాలకు ఈ పరిమితి వర్తించదని మరియు ఎయిర్ బబుల్ అమరికలో ఉన్న విమానాలు కూడా ప్రభావితం కాబోవని ఏవియేషన్ రెగ్యులేటర్ జోడించింది.

ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల కోసం ఆపరేషన్ గంగ

ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల కోసం ఆపరేషన్ గంగ


ప్రస్తుతం రష్యా సైనిక చర్యల నేపధ్యంలో యుద్ధంలో చిక్కుకున్న ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు ప్రభుత్వం 'ఆపరేషన్ గంగా' కింద విమాన సర్వీసులను కూడా ఏర్పాటు చేసింది. ఉక్రెయిన్ మీదుగా గగనతలం మూసివేయబడినందున, రొమేనియా, హంగేరి మరియు పోలాండ్‌తో సహా అనేక మధ్య యూరోపియన్ దేశాలు, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తరలింపు విమానాలను నిర్వహించడానికి భారతదేశానికి సహాయం చేస్తున్నాయి.

 కార్గో సేవలకు ఈ నిర్ణయం వర్తించదు

కార్గో సేవలకు ఈ నిర్ణయం వర్తించదు


మే 2020 నుండి వందే భారత్ మిషన్ కింద ప్రత్యేక అంతర్జాతీయ విమానాలు మరియు జూలై 2020 నుండి ఎంపిక చేసిన దేశాలతో ద్వైపాక్షిక "ఎయిర్ బబుల్" ఏర్పాట్లలో పనిచేస్తున్నాయి. ఇక డిసెంబర్ 15 నుండి అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించాలి అనుకున్నా ఒమిక్రాన్ దెబ్బకు మళ్ళీ తేదీ మార్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మరోమారు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిషేధం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక అంతర్జాతీయ కార్గో సేవలకు ఈ నిర్ణయం వర్తించదని, అంతర్జాతీయ కార్గో సేవలు కొనసాగుతాయని డీజే పేర్కొంది. కేస్ టు కేస్ బేసిస్ లో ఇప్పటికే షెడ్యూల్ అయిన అంతర్జాతీయ విమానాలు ఎంపిక చేసిన రూట్లలో కొనసాగుతాయని వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+