13 ఒప్పందాలు: 'భారత్ స్నేహాన్ని మరిచిపోలేం'
న్యూఢిల్లీ: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండె భారత్‌కు సన్నిహిత మిత్రుడని భారత్ ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు కూడా 13 కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు హాజరుకావడం ఇది ఐదోసారన్నారు. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాలు బలంగా ఉన్నాయన్నారు. రాఫెల్ జెట్ విమానాల ఒప్పందంపై ఇంకా మంతనాలు జరుగుతున్నట్లు ప్రధాని తెలిపారు.
ఉగ్రవాద పోరులో రెండు దేశాలు కలిసి కట్టుగా పనిచేస్తాయన్నారు. తొలిసారి రిపబ్లిక్ డే ఉత్సవాల్లో ఫ్రాన్స్‌కు చెందిన ఆర్మీ దళం పరేడ్‌లో పాల్గొంటుందని ప్రధాని మోడీ తెలిపారు.

13 ఒప్పందాలు: 'భారత్ స్నేహాన్ని మరిచిపోలేం'
రక్షణ రంగంలో 36 రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదిరినట్లు ఆయన తెలిపారు. అంతేకాదు రైలు ఇంజిన్ నుంచి ఉపగ్రహాల నిర్మాణం వరకు, సౌర విద్యుత్ నుంచి అణు విద్యుత్ వరకు ఫ్రాన్స్‌తో భారత్ కలిసి పనిచేస్తుందన్నారు.
13 ఒప్పందాలు: 'భారత్ స్నేహాన్ని మరిచిపోలేం'
ఈ సందర్భంగా పారిస్, పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదుల దాడులను ప్రధాని మోడీ ఖండించారు. మానవత్వంపై నమ్మకం ఉంచిన ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాదంపై ఉమ్మడిపోరుకు సహకరించాలని మోడీ పిలుపునిచ్చారు. అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు మాట్లాడుతూ కష్ట సమయాల్లో భారత్ చూపిన స్నేహ బంధాన్ని మరిచిపోలేమన్నారు.

13 ఒప్పందాలు: 'భారత్ స్నేహాన్ని మరిచిపోలేం'
ఉగ్రవాదంపై ఇరు దేశాలు కలిసి కట్టుగా పనిచేస్తాయన్నారు. వాతావరణ మార్పులపై అభివృద్ధి దేశాలు నియంత్రణ పాటించాలని ప్రధాని మోడీ చేసిన సూచనను హోలాండె గుర్తు చేశారు. సాంప్రదాయాల నుంచి రక్షణ వ్యవహారాల వరకు ఇరు దేశాల మధ్య ఒకేరకమైన ఆసక్తి ఉందని హోలాండె అన్నారు.

13 ఒప్పందాలు: 'భారత్ స్నేహాన్ని మరిచిపోలేం'
అంతక ముందు ప్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండె, భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని గుర్గావ్ వరకు ప్రయాణించి మెట్రో రైడ్ ను ఆస్వాదించారు. అంతర్జాతీయ సౌర అలయన్స్ (ఐఎస్ఏ) తాత్కాలిక సచివాలయం ప్రారంభోత్సవానికి వీరిద్దరూ గుర్గావ్ వెళ్లారు.












Click it and Unblock the Notifications