వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇబ్బందులేనా?: నలుదిక్కులా నలుగురు మహిళా సీఎంలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మెహబూబా ముఫ్తీ.... జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. పీడీపీ అధ్యక్షురాలు, దివంగత సీఎం ముఫ్తీ మహ్మద్ సయీద్ కుమార్తె అయిన మెహబూబా (56) ఆ రాష్ట్రానికి తొలి మహిళా సీఎంగా, దేశంలో రెండో ముస్లిం మహిళా ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు.

అంతక ముందు సయ్యద్ అన్వారా తైముర్ అస్సాం రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రిగా పని చేశారు. మెహబూబా ముఫ్తీ ప్రమాణ స్వీకారంతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన దేశానికి నాలుగు దిక్కులా నలుగురు మహిళా ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్నారు.

భారతదేశానికి తూర్పున ఉన్న పశ్చిమ బెంగాల్‌కు మమతా బెనర్జీ, పశ్చిమాన ఉన్న గుజరాత్ రాష్ట్రానికి ఆనందీ బెన్ పటేల్, దక్షిణాన ఉన్న తమిళనాడు రాష్ట్రానికి జయలలిత, తాజాగా ముప్తీ ప్రమాణ స్వీకారంతో ఉత్తరాన ఉన్న జమ్మూ కాశ్మీర్‌కు నలుగురు నాలుగు స్తంభాలుగా మారారు.

త్వరలో ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికల్లో బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ గెలిస్తే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మాయావతి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇలా ఒంటరి మహిళలైనా రాష్ట్రాలను ఒంటిచేత్తో నడిపిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే మహిళాలు పురుషాధ్యిక్యానికి ఎదురు నిలబడి పోరాడుతోందని చెప్పొచ్చు.

 మహబూబా ముఫ్తీ

మహబూబా ముఫ్తీ


1996 సంవత్సరంలో మహబూబా ముఫ్తీ తొలిసారి క్రియాశీలక రాజకీయాల్లో వచ్చారు. సరిగ్గా 20 ఏళ్లకు అత్యంత సంక్లిష్ట పరిస్థితులు ఉన్న కాశ్మీర్‌కు తొలి మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.భర్త జావీద్ ఇక్బాల్‌కు విడాకులు ఇచ్చాక ఇద్దరు పిల్లలతో కలిసి ముఫ్తీ ఒంటరిగానే జీవితాన్ని సాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ అరంగేట్రం చేసిన ముఫ్తీ 1996లోనే ఎమ్మెల్యేగా గెలిచారు. 1999లో తండ్రి ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ పీడీపీ పార్టీని స్థాపించినప్పుడు ఆ పార్టీకి ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. 2004లో తిరిగి 2014లో ఆమె అనంత్‌రాగ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కాశ్మీర్ అంటే చక్కదిద్దాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇంటా బయట లెక్కలేనన్ని సవాళ్లు ఉన్నాయి. బయట నుంచి ఉగ్రవాదం. రాష్ట్రంలో వేర్పాటు వాదం. ఈ రెండింటి మధ్య కశ్మీర్ ప్రజలు నలిగిపోతున్నారు. ముఖ్యంగా యువతలో ఒకరకమైన నిర్వేదం నెలకొంది. మహిళల్లో దైన్యం కనిపిస్తోంది. వారందరిలోనూ భరోసా నింపాలి. తాజాగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ముఫ్తీ కాశ్మీర్‌ను ఎటు తీసుకువెళ్తారా? అని ప్రజలంతా ఆశగా ఆమెవైపు చూస్తున్నారు.

జయలలిత

జయలలిత


తమిళ ప్రజలు అమ్మ అని పిలుచుకునే జయలలితది అరుదైన వ్యక్తిత్వం. జీవితంలో ఆమె చూపించిన తెగువే పురచ్చితలైవగా తీర్చిదిద్దింది. తమిళ ప్రజల గుండెల్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకుంది. జయలలిత విజయ ప్రస్థానం సినీ ప్రపంచంతోనే మొదలైంది. అక్కడ కూడా ఆమె ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. అయినప్పటికీ తన అందంతో, ప్రతిభతో కొన్నాళ్ల పాటు దక్షిణాది సినీ పరిశ్రమను ఏలారు. ఎంజీరామచంద్రన్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన సమయంలోనే జయలలిత రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఎంజీఆర్ మరణం తర్వాత పార్టీ అధ్యక్షురాలు అయ్యారు. 1991లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్నారన్న ఆరోపణలతో 1996 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. 2002,2011లో తమిళనాడు సీఎం అయ్యారు. తనపై ఉన్న కేసులపై పోరాడటానికే జయ తన సమయాన్నంతా కేటాయించాల్సి వచ్చింది. కోర్టు కేసుల ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ముఖ్యమంత్రి పదవిని కూడా వదులుకోవాల్సి వచ్చింది. జైళ్లో ఊచలు కూడా లెక్కబెట్టారు. పడిలేచిన కడలి తరంగంలా కేసుల నుంచి బయటపడుతూ వస్తున్నారు. ట్రయల్ కోర్టు ఆమెను దోషిగా తేల్చినా కర్నాటక హైకోర్టులో జయకు ఊరట లభించింది.

 మమతా బెనర్జీ

మమతా బెనర్జీ

మమతా బెనర్జీని రాజకీయాల్లో ఒక ఫైర్ బ్రాండ్‌గా పిలుస్తారు. పశ్చిమబెంగాల్‌లో 33ఏళ్ల కామ్రెడ్ల పాలనకు చరమగీతం పాడింది. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని రాజకీయాల్లో వచ్చినా 1997లో కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి త‌ృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఏళ్ల పాటు ప్రతిపక్షంలోనే ఉంటూ ప్రజా పోరాటం చేశారు. చివరకు 2011లో కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టారు. ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. మమత మొదటి నుంచి నేత చీర కట్టుకుని భుజానికో సంచితో సాధారణ జీవితాన్నే గడిపారు. ఒంటరి మహిళగానే ఉంటే ఒంటిచేత్తో నెట్టుకొచ్చారు. ముఖ్యమంత్రిగా ఆమె పరిపాలన వెలుగునీడల మిశ్రమంగా ఉంది. మావోయిస్టుల ఆగడాలకు అడ్డుకట్ట వేసి శాంతిభద్రతలను నెలకొల్పారు. అనేక ప్రాంతాల్లో రోడ్లను వేశారు. ఆస్పత్రులు, పాఠశాలలు నిర్మించారు. గ్రామీణ ప్రాంత అభివృద్ధికి పాటుపడ్డారు.

ఆనంది బెన్ పటేల్

ఆనంది బెన్ పటేల్


నరేంద్రమోడీ ప్రధాని కావడంతో ఆమె గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. గుజరాత్ రాష్ట్రానికి మోడీ హయాంలోనే ఒక ఇమేజ్ వచ్చింది. అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా దేశవ్యాప్తంగా పేరు వచ్చింది. అలాంటి రాష్ట్రం ఇమేజ్‌కు కాపాడటం అదేమంత చిన్న విషయం కాదు. కానీ ఆనంది బెన్ ఆ పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నారు. సమర్థవంతులైన ఐఏఎస్ అధికారులను నియమించి నీతి వంతమైన పాలన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ పనుల్లో వేగం పెంచారు. సింగిల్ విండో ద్వారా అనుమతులు మంజూరు చేస్తున్నారు. దేశంలోనే అత్యంత ప్రభావం చూపించిన ముఖ్యమంత్రుల్లో ఆనందిబెన్ ఒకరిగా నిలిచారు.

మాయావతి

మాయావతి


దేశంలోని మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ఎన్నికైన దళిత మహిళ మాయావతి. ఈమె బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు. ఈమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అట్టడుగు తెగ అయిన జాతవ్ అనే కులానికి చెందిన మహిళ. 2007వ సంవత్సరంలో, అడ్డంకులు అధిగమించి లక్ష్యాన్ని చేరుకున్న ప్రపంచంలోని ఎనిమిది మంది మహిళా నేతలలో ఒకరిగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి ఎంపికయ్యారు. మాయావతి ఢిల్లీ నగరంలో రాంరాఠి, ప్రభుదాస్‌ దంపతులకు జన్మించారు.ఆమె తండ్రి టెలికాం డిపార్ట్‌మెంట్‌లో క్లర్క్‌గా పనిచేసేవారు. మాయావతి చదువు విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. బిఇడితో పాటు న్యాయవాద వృత్తిని కూడా అభ్యసించారు. ఢిల్లీలో ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. 1977 సమయంలో ఐఎఎస్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో కాన్షీరాంతో పరిచయం ఏర్పడింది. ఆయన 1984లో బహుజన సమాజ్‌ పార్టీ'ని స్థాపించారు. బిఎస్‌పిలో చేరిన మాయావతి మొదటి సారి ముజఫర్‌నగర్‌ జిల్లా కైరానా నియోజక వర్గం నుండి లోక్‌సభకు పోటీచేసి అపజయం పాలయ్యారు. ఆ తర్వాత 1985లో బిజ్‌ నూర్‌, 1989లో హరిద్వార్‌ నుండి కూడా పోటీ చేసి ఓడిపోయారు.

English summary
People's Democratic Party leader Mehbooba Mufti became the first woman chief minister to take oath of the state of Jammu and Kashmir on Monday (April 4). She also became the second Muslim woman after Assam's Syed Anwara Taimur who became the chief minister of Assam to become the chief minister of a state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X