వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిలియనీర్ల దేశమే!: జాబితా టాప్ 10లో భారత్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్ ఓ వైపు కోట్లాది మంది పేదలకు నిలయమైనప్పటికీ.. మరోవైపు వందల కోట్ల సంపద కలిగిన శ్రీమంతులు కలిగిన ప్రపంచంలోని టాప్-10దేశాల్లో నిలిచింది. ఈ జాబితాలో భారత్‌కు 8వ స్థానం దక్కింది. దేశంలో 14,800 మంది మిలియనీర్లు ఉన్నారని ‘న్యూ వరల్డ్ వెల్త్' నివేదిక పేర్కొంది. అంతేకాదు, 2700 మంది మిలియనీర్లలో దేశ ఆర్థిక రాజధాని ముంబై ప్రపంచవ్యాప్తంగా టాప్ 25 దేశాల్లో ఒకటిగా ఉందని ఆ నివేదిక తెలిపింది.

15,400 మంది మిలియనీర్లతో హాంకాంగ్ ఈ జాబితాలో ప్రథమస్థానంలో ఉంది. మిలియనీర్లకు సంబంధించి మన దేశం ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో ఉన్నప్పటికీ ఒక్క ముంబైకి మాత్రమే ప్రపంచంలోని టాప్ 30 నగరాల్లో స్థానం లభించడం గమనార్హం.

India home to 14,800 multi-millionaires; 8th largest globally

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కేవలం కోటీ 30 లక్షల మంది మాత్రమే మిలియనీర్లు ఉన్నారని, వీరిలో 4,95,000 మందిని మల్టీ మిలియనీర్లుగా వర్గీకరించవచ్చని ‘న్యూ వరల్డ్ వెల్త్' నివేదిక పేర్కొంది. ఈ సర్వే కోసం ఆ సంస్థ పది లక్షల అమెరికన్ డాలర్ల సంపద ఉన్న వ్యక్తిని మిలియనీర్‌గాను, అలాగే కనీసం కోటి (పది మిలియన్లు) డాలర్ల సంపద ఉన్న వ్యక్తిని మల్టీ మిలియనీర్‌గాను వర్గీకరించింది.

కాగా, ఈ సర్వే ప్రకారం అమెరికాలో అత్యధికంగా లక్షా 83 వేల మంది మల్టీ మిలియనీర్లు ఉండగా, 26,600 మందితో చైనా, 25,400 మందితో జర్మనీ వరసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ మూడు కాకుండా అత్యధికంగా మల్టీ మిలియనీర్లు ఉన్న టాప్-10 దేశాల్లో వరుసగా బ్రిటన్, జపాన్, స్విట్జర్లాండ్, హాంకాంగ్, భారత్, రష్యా ఉన్నాయి. గత దశాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా మిలియనీర్లు, మల్టీ మిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఆ సంస్థ తన నివేదికలో వెల్లడించింది.

English summary
India is home to the eighth largest group of super rich people in the world, as there are as many as 14,800 multi-millionaires in the country, a report says.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X