75 TH Independence Day
LIVE
ఎర్రకోట ప్రసంగంలో  ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు: జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు
ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు: జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు

భారత దేశం 75వ స్వాతంత్య్ర సంబరాలను ఘనంగా ప్రారంభించింది. ఉదయం 7:30 గంటలకు ప్రధాని మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మోడీ సర్కార్ సాధించిన విజయాలను ఆయన ప్రసంగం ద్వారా దేశ ప్రజలకు వినిపించారు. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొని దేశాన్ని గర్వపడేలా చేసిన భారత బృందాన్ని ఆయన అభినందించారు. అదే సమయంలో కరోనాను తమ సర్కార్ సమర్థవంతంగా ఎదుర్కొందని చెప్పారు.

India Independence Day 2021 Live Updates In Telugu:What India have achieved as a nation so far

స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆగష్టు 15వ తేదీన విజయవాడలో ఏపీ సీఎం జగన్ జాతీయ జెండాను ఎగురవేశారు. హైద్రాబాదులోని గోల్కొండ కోటలో తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఇక 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి మినిట్-టూ-మినిట్ అప్‌డేట్స్ మీకోసం...

10:37 AM
Aug 15, 2021
రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ ఆవిర్భవించింది: సీఎం కేసీఆర్
10:33 AM
Aug 15, 2021
తలసరి ఆదాయం విషయంలో దేశంలోనే ప్రథమ స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచింది: సీఎం కేసీఆర్
10:31 AM
Aug 15, 2021
స్వాతంత్య్ర పోరాట ఉజ్వల ఘట్టాలను దేశం స్మరించుకుంటోంది: సీఎం కేసీఆర్
10:31 AM
Aug 15, 2021

తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
10:24 AM
Aug 15, 2021

తెలంగాణ

గోల్కొండలో జాతీయ జెండాను ఎగురవేసిన తెలంగాణ సీఎం కేసీఆర్
10:14 AM
Aug 15, 2021
జాతీయ జెండాను ఆవిష్కరించిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా. ఎంతో మంది ప్రాణత్యాగాలతోనే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్న స్పీకర్
10:12 AM
Aug 15, 2021
మహిళల భద్రతకు దిశా చట్టం, దిశా పోలీసులు, దిశా యాప్‌లను తీసుకొచ్చాం: ఏపీ సీఎం జగన్
10:11 AM
Aug 15, 2021
వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీలో చేరుస్తున్నాం: సీఎం జగన్
10:05 AM
Aug 15, 2021
మహిళలకు ఈ ప్రభుత్వం పెద్ద పీట వేసింది: సీఎం జగన్
10:02 AM
Aug 15, 2021
పిల్లల చదువుకోసం రూ.26,667 కోట్లు ఖర్చు చేస్తున్నాం: సీఎం జగన్
9:55 AM
Aug 15, 2021
పిల్లలకు రోజుకో మెనూతో ఆహారం ఇస్తున్నాం: సీఎం జగన్
9:53 AM
Aug 15, 2021
కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకు ధీటుగా అన్ని ప్రభుత్వ పాఠశాలలను, కాలేజీలను నాడు -నేడు కార్యక్రమం కింద మార్చుతున్నాం : సీఎం జగన్
9:52 AM
Aug 15, 2021
రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం: సీఎం జగన్
9:51 AM
Aug 15, 2021
గ్రామ వార్డు సచివాలయాల ద్వారా లక్షా 30 వేల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం: సీఎం జగన్
9:51 AM
Aug 15, 2021
ఒకే గ్రామంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రం, వైయస్సార్ విలేజ్ క్లినిక్, ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు, డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తాయం: సీఎం జగన్
9:49 AM
Aug 15, 2021
ఏపీలో 2 లక్షల 70వేల వాలంటీర్లు పనిచేస్తున్న వ్యవస్థ ఒక్క ఏపీలోనే ఉంది: సీఎం జగన్
9:49 AM
Aug 15, 2021
దేశంలోనే గ్రామ సచివాలయాలు ఆదర్శంగా నిలిచాయి: సీఎం జగన్
9:42 AM
Aug 15, 2021
వ్యవసాయ రంగంకు పెద్ద పీట వేశాం: సీఎం జగన్
9:42 AM
Aug 15, 2021
కొత్త లక్ష్యాలను నిర్దేశించుకునే సమయం ఇది: సీఎం జగన్
9:41 AM
Aug 15, 2021
26 నెలల కాలంలో ఏపీలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం: సీఎం జగన్
9:41 AM
Aug 15, 2021
రేపు అనేది ప్రతి ఒక్కరికీ భరోసా ఇవ్వాలి: సీఎం జగన్
9:22 AM
Aug 15, 2021
విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన శకటాలు
9:17 AM
Aug 15, 2021
వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులను నిలువరించేందుకు దేశంలో హైడ్రోజన్ మిషన్‌ను ప్రారంభిస్తున్నాం: ప్రధాని మోదీ
9:16 AM
Aug 15, 2021
టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత బృందానికి ప్రధాని మోదీ అభివాదం
9:15 AM
Aug 15, 2021
పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించిన ఏపీ సీఎం జగన్
9:02 AM
Aug 15, 2021
జాతీయ జెండాను ఆవిష్కరించిన ఏపీ సీఎం జగన్
9:00 AM
Aug 15, 2021
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు చేరుకున్న ఏపీ సీఎం జగన్
8:40 AM
Aug 15, 2021
లద్ధాఖ్‌లో సింధు సెంట్రల్ యూనివర్శిటీని ప్రారంభించాం: ప్రధాని మోదీ
8:36 AM
Aug 15, 2021
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రానున్న 75 వారాల్లో దేశంలోని అన్ని ప్రాంతాల్లో తిరుగుతాయి: ప్రధాని మోదీ
8:31 AM
Aug 15, 2021
భారత స్టార్టప్ వ్యవస్థ దేశాన్ని ముందుకు తీసుకెళుతోంది: ప్రధాని మోదీ
READ MORE