చైనాకు గట్టి షాకివ్వబోతున్న భారత్?
చైనాకు భారత్ మరోసారి షాకిచ్చింది. గాల్వన్ లోయ ఘటన తర్వాత 300కు పైగా చైనా యాప్ లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఇప్పుడు మరోసారి డ్రాగన్ కు గట్టి షాకిచ్చేందుకు సిద్ధమైంది. 12 వేల రూపాయల ధరల విభాగంలో ఫోన్లను విక్రయించకుండా చైనా కంపెనీలపై ఆంక్షలు విధించేందుకు ఆలోచన చేస్తోంది. భారత్ లో అమ్మడవుతున్న టాప్-5 మొబైల్స్ బ్రాండ్స్ లో ఒప్పో, వివో, రియల్ మి, వన్‌ప్లస్, షావోమి, ఐకూ వంటివి ఉన్నాయి. ఈ నిర్ణయంతో వీటికి గట్టి షాక్ తగలబోతోంది.
షావోమి, రియల్ మి వంటి కంపెనీలపై అధిక ప్రభావం ఉంటుందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద మొబైల్ మార్కెట్ గా ఉన్న భారత్ లో లోయర్ సెగ్మెంట్ నుంచి చైనాను పంపించాలనే యోచనలో కేంద్రం ఉందనే వార్తలు వస్తున్నాయి. చైనా కంపెనీలవల్ల స్థానిక కంపెనీలపై తీవ్ర ప్రభావం పడుతోంది.

డీలర్లకు 30 నుంచి 40 శాతం దాకా కమీషన్లు ఇస్తుండటంతో ఆన్ లైన్ లోకానీ, ఆఫ్ లైన్ లోకానీ అందరూ వాటినే అమ్ముతున్నారు. దేశీయ కంపెనీలు 10 నుంచి 12 శాతమే కమీషన్ ఇస్తున్నాయి. నెలకో కొత్తమోడల్ విడుదల చేయడం కూడా చైనా కంపెనీలకు వరంగా మారింది. కేంద్రం దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక విధానం తీసుకొస్తుందా? లేదా? అనేదానిపై త్వరలోనే స్పష్టత రాబోతోంది. ఇది అమల్లోకి వస్తే చైనా కంపెనీలకు గట్టి షాక్ తగలడంతోపాటు దేశీయ కంపెనీలకు ఊపిరి పోసినట్లవుతుందని భావిస్తున్నారు.
-
చైనాకు బిగ్ షాక్.. భారత్కు రష్యా క్రూడాయిల్ షిప్పులు యూ టర్న్!! -
200MP కెమెరాతో "OPPO Find N6" ఫోల్డబుల్ ఫోన్.. ధర తెలిస్తే షాక్..? -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్












Click it and Unblock the Notifications