పాకిస్తాన్ కోసం ఇగ్లా ఎస్ మిస్సైల్స్ తో రెడీ అయిన భారత్.. తగ్గేదేలే!

భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఎవరికి వారు యుద్ధ సన్నాహాలలో నిమగ్నమయ్యారు. పహల్గామ్ ఉగ్ర దాడితో రగిలిపోతున్న భారత్, ఉగ్రవాదులకు సహకరిస్తున్న పాకిస్తాన్ కు గట్టిగానే బుద్ధి చెప్పాలని నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ తో ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న వేళ భారత్ ఆర్మీ అత్యవసర ప్రాతిపదికన రష్యా నుండి స్వల్ప శ్రేణి తరగతికి చెందిన ఇగ్లా ఎస్ మిస్సైల్ ను దిగుమతి చేసుకుంది.

గగనతల రక్షణ కోసం భారత్ నిర్ణయం
పాక్ తో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న నేపథ్యంలో గగనతల రక్షణ కోసం భారత్, రష్యా నుండి ఇగ్లా ఎస్ క్షిపణులను దిగుమతి చేసుకుంది. వీటిని పశ్చిమ సెక్టార్లో మోహరించి పాకిస్తాన్ కు హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఈ క్షిపణులతో భారత గగనతల రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం కానుంది.

India is ready with russian made Igla S missiles for Pakistan

రష్యా నుండి ఇగ్లా ఎస్ క్షిపణుల దిగుమతి
రష్యా తయారు చేసిన వీటిని దిగుమతి చేసుకున్న భారత్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ కింద పనిచేసే వీటిని పాకిస్తాన్ తో యుద్ధం జరిగితే వాడనుంది. ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ పవర్స్ ను వాడి సైనిక దళాలు వీటిని కొనుగోలు చేశాయి. వాస్తవానికి కొన్ని వారాల క్రితమే ఇవి రష్యా నుండి భారతదేశానికి చేరుకున్నాయి.

భారత వాయుసేన అమ్ములపొదిలో ఇవి కీలకం
మొత్తం 260 కోట్ల రూపాయల విలువైన క్షిపణులను ఆర్మీ దిగుమతి చేసుకుంది. ఈ స్వల్ప శ్రేణి క్షిపణులతో ఫైటర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ లను, చాపర్ లను, అలాగే డ్రోన్స్ ను ధ్వంసం చేయవచ్చు. పశ్చిమ సెక్టార్లో సరిహద్దుల వద్ద వాడడానికి ఇది అత్యంత అనువుగా ఉంటాయని, భారత వాయుసేన అమ్ములపొదిలో ఇవి కూడా కీలకం కాబోతున్నాయి అని తాజా పరిణామాలతో తెలుస్తోంది.

పాక్ తో పశ్చిమ సెక్టార్లో ముప్పు
పాక్ ఆర్మీకి చెందిన యూఏవిలతో పశ్చిమ సెక్టార్లో ముప్పు ఉన్న నేపథ్యంలో గగనతల రక్షణ వ్యవస్థల అవసరం పెరిగిందని ఇంటిలిజెన్స్ వర్గాలు వెల్లడించిన నేపథ్యంలో భారత్ వీటిని రంగంలోకి దించుతుంది. ఇప్పటికే శత్రుదేశం యొక్క డ్రోన్లను, యూఏఈ లను నిర్వీర్యం చేయడం కోసం స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ఇంటిగ్రేటెడ్ డ్రోన్ డిటెక్షన్ అండ్ ఇంటర్ డిక్షన్ వ్యవస్థను భారతదేశం ఉపయోగిస్తోంది.

పాక్ నుండి గగన తల రక్షణకు ఇగ్లా ఎస్ క్షిపణులు
ఈ వ్యవస్థలో ఎనిమిది కిలోమీటర్ల పరిధిలోని డ్రోన్లను గుర్తించడం, వాటిని పనిచేయకుండా చేయడం, తప్పు దారి పట్టించడం లేదా నేరుగా దాడి చేసి నిర్వీర్యం చేయడం చేయవచ్చు. అంతేకాదు శత్రుదేశం యొక్క డ్రోన్ల మీద నేరుగా లేజర్ కిరణాలను ప్రసరింపచేసి కూడా వాటిని ధ్వంసం చేయవచ్చు. పాక్ సైన్యం పలు రకాల డ్రోన్లు, యూ ఏ వీలు వినియోగిస్తోంది. ఇక ఈ క్రమంలో వాటిని అత్యంత సమర్థవంతంగా నాశనం చేసే ఇగ్లా ఎస్ క్షిపణుల అవసరం భారత్ కు ఎక్కువగా ఉంది. అందుకే వీటిని అత్యవసర ప్రాతిపదికన కొనుగోలు చేసి రంగంలోకి దించుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+