భారత్ కూడా మీ సొంత ఇల్లే: ఆప్ఘాన్ సిక్కు-హిందూ ప్రతినిధులతో ప్రధాని మోడీ, కర్జాయ్ థ్యాంక్స్
న్యూఢిల్లీ: అప్ఘనిస్థాన్ సిక్కు-హిందూ ప్రతినిధుల బృందం శనివారం ప్రధాని నరేంద్ర మోడీని కలిసింది. ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని మోడీ నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఆదివారం పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న సమయంలో.. ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోడీ వరుసగా రెండోరోజు సిక్కు వర్గానికి చెందిన బృందాలను తన ఇంటి వద్ద కలుసుకున్నారు. శుక్రవారం కూడా సిక్కు ప్రతినిధులకు ప్రధాని మోడీ ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే.

ఆప్ఘాన్ సిక్కు-హిందువులకు ప్రధాని మోడీ భరోసా
గత ఆగస్టులో ఆఫ్ఘనిస్థాన్‌లో పౌర ప్రభుత్వాన్ని కూల్చివేసి, తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత.. మైనార్టీ వర్గానికి చెందిన సిక్కులు, హిందువులను సురక్షితంగా భారత్‌కు తీసుకువచ్చినందుకు ఆప్ఘాన్ ప్రతినిధుల బృందం ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపింది. ప్రధానిని సత్కరించింది. ఎదురైన చేదు అనుభవాలను ప్రధానికి వివరించింది. తమను గురుద్వారా నుంచి కిడ్నాప్ చేసిన తాలిబన్లు... మతం మార్చేందుకు ఒత్తిడి చేశారని చెప్పారు కొందరు సిక్కు ప్రతినిధులు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వారికి ఎలా ఉపయోగకరంగా ఉంటుందో తెలియజేశారని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. అంతేగాక, ఆప్ఘాన్‌లోని మైనార్టీలకు భారత ప్రభుత్వం నుంచి ఎప్పుడూ మద్దతు ఉంటుందని ప్రధాని మోడీ వారికి హామి ఇచ్చినట్లు తెలిపింది.
భారత్ కూడా మీ ఇల్లే: సిక్కు-హిందూ ప్రతినిధులతో మోడీ
మీరు అతిథులు కాదు, భారతదేశం మీ సొంత ఇల్లుగా భావించండి అని ఆప్ఘాన్ సిక్కు-హిందూ ప్రతినిధులకు ప్రధాని మోడీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
'గురు గ్రంథ్ సాహిబ్‌ను గౌరవించే సంప్రదాయం ప్రాముఖ్యత గురించి కూడా ప్రధాని మాట్లాడారు, ఈ నేపథ్యంలో గురు గ్రంథ్ సాహిబ్ స్వరూప్‌ను ఆఫ్ఘనిస్తాన్ నుంచి తిరిగి తీసుకురావడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయబడ్డాయి. అతను ఆఫ్ఘన్‌ల నుంచి తనకు లభించిన అపారమైన ప్రేమ గురించి మాట్లాడాడు. సంవత్సరాలు, అతని కాబూల్ పర్యటనను ప్రేమగా గుర్తు చేసుకున్నారు' అని పీఎంవో పేర్కొంది.
Recommended Video
ప్రధాని మోడీకి ఆప్ఘాన్ మాజీ ప్రధాని హమీద్ కర్జాయ్ థ్యాంక్స్
ఇది ఇలావుండగా, ఆప్ఘనిస్థాన్ మాజీ ప్రధాని హమీద్ కర్జాయ్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ఆప్ఘాన్ ప్రజల పట్ల మీరు చూపించే అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. హమీద్ కర్జాయ్ ఆప్ఘాన్ ప్రధానిగా ఉన్న సమయంలో భారత్ ఆ దేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన విషయం తెలిసిందే. ఆప్ఘాన్ పార్లమెంటు భవనాన్ని కూడా భారత్ నిర్మించిన విషయం విధితమే.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications