సెప్టెంబర్ 14న, ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్వే ప్రాజెక్టుకు శంకుస్థాపన

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: ఈ ఏడాది సెప్టెంబర్ 14వ, తేదిన ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్వే ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, జపాన్ ప్రధాని షీనాజో అబే శంకుస్థాపన చేయనున్నారు.

అహ్మదాబాద్-ముంబై రైల్వే ప్రాజెక్టుగా ఈ ప్రాజెక్టు ప్రఖ్యాతి పొందింది. ప్రయాణీకుల భద్రతతోపాటు వేగంగా గమ్యస్థానాకు చేర్చడానికి ఈ రైల్వే ప్రాజెక్టు దోహదపడనుంది. అంతేకాదు అంతర్జాతీయ రైల్వేలో ఈ ప్రాజెక్టు ద్వారా ఇండియన్ రైల్వేకు మంచి గుర్తింపు దక్కనుంది.

India-Japan patnership on bullet trains to open gates of safety, speed and service

అయితే ఈ ప్రాజెక్టును ఇండియా, జపాన్ సంయుక్తంగా చేపట్టాయి. జపాన్ దేశంలో ఇప్పటికే పలు బుల్లెట్ రైళ్లు ఉన్నాయి. జపాన్ ప్రభుత్వం ఇండియాకు 0.1 వడ్డీతో సుమారు 88వేల కోట్లను అప్పుగా ఇచ్చింది. ఈ రుణాన్ని 15 ఏళ్ళలో తీర్చాల్సి ఉంటుంది. అయితే ఈ రుణానికి నెలకు సుమారు 7 నుండి 8 కోట్ల అవుతోందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

భారత ప్రభుత్వం హై స్పీడ్ రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి జపాన్ ప్రభుత్వం సుమారు 80 శాతం ఖర్చును భరిస్తోంది. అయితే ఈ తరహ ప్రాజెక్టుల నిర్మాణం చేయడం బహుశా దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.

మేక్ ఇండియాను ప్రమోట్ చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యంగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం, ఎంఎహెచ్ఎస్ఆర్, జపాన్ ప్రభుత్వాల మధ్య చోటుచేసుకొన్న ఒప్పందం ముఖ్య ఉద్దేశ్యం ఇదే. టెక్నాలజీని ఇచ్చిపుచ్చుకోవడం ప్రధాన ఉద్దేశ్యం.

ఇండియా, జపాన్ పరిశ్రమల శాఖలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టులో నిర్వహించడం వల్ల నిర్మాణరంగంలో దేశంలో మరిన్ని ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

అయితే నిర్మాణ రంగంలో ఇండియాలో కొత్త రకమైన టెక్నాలజీని అందిపుచ్చుకొనే అవకాశాలున్నాయి.ఈ ప్రాజెక్టు వల్ల సుమారు 20 వేల మందికి ఉపాధి దక్కనుంది.

మరోవైపు వడోదరలలో హై స్పీడ్ రైలు ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ కూడ అభివృద్ది చేయనున్నారు. అన్ని రకాల సదుపాయాలు ఈ ఇనిస్టిట్యూట్‌లో ఉంటాయి.అయితే 2020 నాటి ఈ ఇనిస్టిట్యూట్‌ పనిచేయడం ప్రారంభం కానుంది.

రానున్న మూడేళ్ళలో సుమారు 4 వేల మంది ఉద్యోగులను శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో హై స్పీడ్ రైళ్ళ ఆపరేషన్, మెయింటనెన్స్‌కు ఈ శిక్షణ దోహదపడుతోంది.అయితే ఇప్పటికీ 300 ఇండియన్ రైల్వేకు చెందిన అధికారులు జపాన్‌లో శిక్షణ తీసుకొంటున్నారు.

హైస్పీడ్ ట్రాక్ టెక్నాలజీ విషయమై జపాన్ మాస్టర్స్ కోర్స్ ఆఫ్ యూనివర్శిటీ ప్రతి ఏటా 20 మందికి మాస్టర్ కోర్సును కూడ ఆఫర్ చేస్తోంది.అయితే ఇండియన్ రైల్వే కోసం మాత్రమే. అయితే దీనికి కూడ జపాన్ ప్రభుత్వమే ఖర్చును భరిస్తోంది.50 ఏళ్ళుగా జపాన్ ఉపయోగిస్తున్న టెక్నాలజీ అత్యంత సురక్షితమైందిగా పేరుంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Prime Minister Narendra Modi and his Japnese counterpart Shinzo Abe will lay the foundation stone of the Mumbai-Ahmedabad High-Speed Rail project on September 14. The project better known as Ahmedabad-Mumbai bullet train is a visionary project that intends to herald a new era of safety, speed and service. The project is expected to help Indian Railways become an international leader in scale, speed and skill.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X