అగ్రదేశాల సరసన భారత్: పీఎస్ఎల్‌వీ-సీ 30 సక్సెస్

శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్ధ (ఇస్రో) రూపొందించిన 'ఆస్ట్రోశాట్' ఉపగ్రహాన్ని భారత్ ఈరోజు విజయవంతంగా ప్రయోగించింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి పొలార్ శాటిలైట్ వెహికల్ (పీఎస్ఎల్‌వీ)-సీ 30 రాకెట్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకరి ప్రవేశపెట్టింది.

India launches its first space observatory Astrosat from Sriharikota

ఖగోళ పరిశోధనలకు సంబంధించిన ఇస్రో చేసిన మొదటి ప్రయోగం ఇది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆనందంలో మునిగితేలారు. ఆస్ట్రోశాట్‌తో పాటు ఆరు ఉపగ్రహాలను కక్ష్యలోకి పీఎస్ఎల్‌వీ-సీ 30 ప్రవేశపెట్టింది.

భూమి నుండి రాకెట్ ఎగిరిన అనంతరం 650 కిలోమీటర్ల దూరంలో భూమధ్యరేఖ కక్ష్యలోకి చేరిన అనంతరం దీని సేవలు అందించనుంది. విశ్వం మూలాలను తెలుసుకోడవంతో పాటు, రేడియేషన్, వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు దీనిని ఇస్రో ప్రయోగించింది. ఈ తరహా ఉపగ్రహం ఇప్పటివరకూ అమెరికా, రష్యా వంటి అగ్రదేశాలు మాత్రమే ప్రయోగించాయి.

ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్‌డౌన్‌ శనివారం ఉదయం 8 గంటల నుంచి నిరంతరాయంగా కొనసాగింది. సరిగ్గా ఉదయం 10 గంటలకు రాకెట్ బయలుదేరింది. ఈ రాకెట్‌ ద్వారా మన దేశానికి చెందిన 1,513 కిలోల ఆస్ట్రోశాట్‌తో పాటు ఇండోనేషియా లాపాన్‌-2(68 కిలోలు), కెనడాకు చెందిన యాక్సెట్‌యా(5.5) యూఎస్‌కు సంబంధించిన లెమర్‌-2, 3, 4,5(16కిలోలు) ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ-సి30 నింగిలోకి తీసుకెళ్లింది.

ఉపగ్రహాల మొత్తం బరువు 1,630 కిలోలు. ఇండోనేషియా, కెనడా, అమెరికా దేశాల ఉపగ్రహాలను నింగిలోకి పంపడంతో ఆ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు షార్‌కు చేరుకుని ప్రయోగాన్ని వీక్షించారు. ప్రయోగం దృష్ట్యా శ్రీహరికోటతోపాటు పరిసర ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+