Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మాల్దీవులకు మరో షాక్: లక్షద్వీప్‌పై ఇజ్రాయెల్ స్పెషల్ ఫోకస్, ఏం చేస్తోందంటే?

న్యూఢిల్లీ: లక్షద్వీప్ పర్యాటకంపై అక్కసు వెళ్లగక్కుతున్న మాల్దీవులకు మరో షాక్ తగిలింది. లక్షద్వీప్ (Lakshadweep) నిర్లవీకరణ (desalination) ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభించనున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాయలం అధికారికంగా ట్విట్టర్ వేదికగా ఈ మేరకు వెల్లడించింది.

సముద్రపు నీటిలోని లవణాలను తొలగించి, వాటిని తాగేందుకు వీలుగా మార్చే ప్రక్రియే డీశాలినేషన్. కాగా, డీశాలినేషన్ ప్రక్రియను ప్రారంభించాలన్న భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు మేము గత ఏడాది నుంచి లక్షద్వీప్‌లో ఉన్నాం. రేపటి (జనవరి 9) నుంచే పనులు ప్రారంభించబోతున్నాం' అని ఇజ్రాయెల్ బృందం స్పష్టం చేసింది. అంతేగాక, లక్షద్వీప్‌లోని బీచ్‌లకు సంబంధించిన కొన్ని అందమైన ఫొటోలను, వీడియోలను పంచుకుంది.

India-Maldives Row: Israel to launch Lakshadweep desalination

సహజ సిద్ధమైన, నీటి అడుగున ఉండే అందాలను ఇప్పటికీ చూడనివారి కోసం కొన్ని చిత్రాలు ఇక్కడ ఉన్నాయి అని ఆ ఫొటోలు, వీడియోలు పోస్టు చేస్తూ రాసుకొచ్చింది ఇజ్రాయెల్ బృందం. కాగా, ఇజ్రాయెల్‌కు దాదాపు 25 శాతం తాగునీరు నిర్లవీకరణ ప్లాంట్ల నుంచే ఉత్పత్తి అవుతోంది. ఈ ప్రక్రియ అక్కడ విజయవంతం కావడంతో లక్షద్వీప్‌లోనూ ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం గతంలో ఆహ్వానించింది. ఈ క్రమంలో ఏడాదిగా ఇజ్రాయెల్ టీం ఇందుకోసం పనిచేస్తోంది.

కాగా, ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్‌లో పర్యటించారు. అంతేగాక, సముద్రంలో స్నార్కెలింగ్ కూడా చేశారు. ఇందుకు సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలను నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. దీంతో ఒక్కసారిగా లక్షద్వీప్ పర్యాటకానికి కొత్త జోష్ వచ్చింది. అయితే, తమకు పోటీగా లక్షద్వీప్‌ను అభివృద్ధి చేస్తున్నారనే అక్కసుతో మాల్దీవుల మంత్రులు, నేతలు భారత్, మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

ఇది ఇలావుండగా, భారత్, ప్రధాని నరేంద్ర మోడీపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల మంత్రులను అక్కడి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మంత్రులు మరియం షియానా, మల్షా షరీఫ్, అబ్దుల్లా మజూమ్ మాజీద్‌లను సస్పెండ్ చేశారు.
కాగా, ప్రధాని మోడీని విదూషకుడు, తోలుబొమ్మ అంటూ వ్యాఖ్యానించారు మంత్రి మరియం షియానా. ఆమె పోస్టుపై తీవ్ర వ్యతిరేకత రావడంతో తర్వాత దాన్ని డిలీట్ చేసింది.

'డబ్బు సంపాదించడానికి శ్రీలంక వంటి చిన్న ఆర్థిక వ్యవస్థల్ని భారత్ కాపీ కొడుతుంది' అని ప్రధాని లక్షదీప్ పర్యటనపై మల్దీవుల రాజకీయ నేత జహిద్ రమీజ్ వ్యాఖ్యానించాడు. భారత్ ఆలోచన భ్రమ కలిగిస్తోందని.. వారు మేము అందించే సేవల్ని ఎలా అందిస్తారు.. వారి తీరం, గదుల్లో వాసన వస్తుంది అంటూ పేర్కొన్నారు. అయితే, మాల్దీవుల ప్రభుత్వం తమ దేశ మంత్రులు, నేతల వ్యాఖ్యలను ఖండించింది. ఈ క్రమంలోనే వారిపై చర్యలు తీసుకుంది.

మరోవైపు, మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై భారతీయులు తీవ్రంగా స్పందిస్తున్నారు. త్వరలో మాల్దీవుల్లో పర్యటించాలనుకున్న వాళ్లు కూడా తమ ప్రయత్నాలను విరమించుకుంటామని చెప్పారు. మరికొందరు తమ పర్యటలను రద్దు చేసుకున్నారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో మాల్దీవులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షద్వీప్‌లో మోడీ పర్యటనను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రముఖులు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. లక్షదీవుల అందాలను వివరిస్తూ సోషల్ మీడియా వేదికగా మాల్దీవుల మంత్రులకు కౌంటర్లు ఇస్తున్నారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, జూనా అబ్రహాం, శ్రద్ధా కపూర్ వంటి వారు స్వదేశీ టూరిజానికి మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+