వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్వరలో కరోనా ధర్డ్‌ వేవ్‌- నైట్‌కర్ఫ్యూలు, వీకెండ్‌ లాక్‌డౌన్లు వేస్ట్-ఎయిమ్స్‌ ఛీఫ్‌

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్ తీవ్ర ప్రభావం చూపుతోంది. రోజుకు దాదాపు మూడున్నర లక్షల కొత్త కేసులు బయటపడుతున్నాయి. ఇందులో ఒక్కశాతం అంటే మూడున్నర వేల మరణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రభుత్వాలు నైట్‌ కర్ప్య్లూలు, వారాంతపు లాక్‌డౌన్‌లు విధిస్తున్నాయి. అయితే వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని, ఇదే పరిస్ధితి కొనసాగితే కరోనా మూడోదశ కూడా తప్పదని ఎయిమ్స్ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా తేల్చిచెప్పారు.

 కరోనా థర్డ్‌ వేవ్‌

కరోనా థర్డ్‌ వేవ్‌

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ కల్లోలం తగ్గకముందే థర్డ్‌ వేవ్‌పైనా చర్చ మొదలైంది. ఇప్పటికే సెకండ్‌ వేవ్‌ కారణంగా భారీగా కేసులు, మరణాలు చోటు చేసుకుంటుండగా.. ఇప్పుడు థర్డ్‌ వేవ్ కూడా తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అన్నింటి కంటే మించి సెకండ్‌ వేవ్‌ను అదుపుచేసేందుకు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలే ధర్డ్‌వేవ్‌కు కారణమయ్యేలా ఉన్నాయన్న అంచనాలు వెలువడుతున్నాయి. వీటిని సరిచేసుకోకపోతే ధర్డ్‌ వేవ్ తప్పదన్న హెచ్చరికలు వెలువడుతున్నాయి.

 ధర్డ్ వేవ్‌ తప్పదన్న ఎయిమ్స్‌ ఛీఫ్‌

ధర్డ్ వేవ్‌ తప్పదన్న ఎయిమ్స్‌ ఛీఫ్‌

దేశవ్యాప్తంగా ప్రస్తుతం సెకండ్ వేవ్‌ సందర్భంగా చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా అంచనావేస్తున్న ఎయిమ్స్‌ ఛీఫ్‌ రణ్‌దీప్ గులేరియా మూడో దశ కూడా తప్పదనే అంచనాకు వచ్చేశారు. ప్రస్తుత పరిస్ధితి ఇలాగే కొనసాగితే ధర్డ్‌వేవ్‌ కూడా తప్పదని ఆయన ఇవాళ స్పష్టం చేశారు. ఆస్పత్రుల సంఖ్య పెంచడం, కేసుల సంఖ్య భారీగా తగ్గించడం, వ్యాక్సినేషన్‌ను ఉధృతం చేయగలిగితేనే ఈ పరిస్ధితికి అడ్డుకట్ట వేయగలమని రణదీప్‌ స్పష్టం చేసారు.

 రాత్రికర్ఫ్యూలు, వీకెండ్‌ లాక్‌డౌన్‌ వేస్ట్‌

రాత్రికర్ఫ్యూలు, వీకెండ్‌ లాక్‌డౌన్‌ వేస్ట్‌

ప్రస్తుతం కరోనా కట్టడికి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు రాత్రి పూట కర్ఫ్యూలు విధిస్తున్నాయి. అలాగే వారాంతపు లాక్‌డౌన్‌లు కూడా విధిస్తున్ననాయి. అయితే వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని ఎయిమ్స్‌ ఛీఫ్‌ గులేరియా క్లారిటీ ఇచ్చేశారు. వీటి వల్ల కేసుల సంఖ్య తగ్గుతుండనుకోవడం కేవలం భ్రమేనని ఆయన తెలిపారు. దీంతో కరోనా కట్టడికి రాష్ట్రాలు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం సరిపోవని ఆయన తేల్చిచెప్పినట్లయింది.

 లాక్‌డౌన్‌తోనే కరోనా కట్టడి

లాక్‌డౌన్‌తోనే కరోనా కట్టడి

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలంటే లాక్‌డౌన్‌ను మించిన మార్గం లేదని ఎయిమ్స్‌ ఛీఫ్‌ గులేరియా అభిప్రాయడ్డారు. నిర్ణీత కాలం పాటు లాక్‌డౌన్‌ విధిస్తే తప్ప కరోనా వ్యాప్తిని నిరోధించలేమని ఆయన స్పష్టం చేశారు. మిగతా చర్యల సంగతి ఎలా ఉన్నా లాక్‌డౌన్‌ మాత్రం తప్పనిసరని ఆయన తేల్చిచెప్పారు. ఇప్పటికే రణ్‌దీప్‌ గులేరియాతో పాటు కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కూడా కేంద్రానికి లాక్‌డౌన్‌ విధించమని సలహా ఇచ్చింది. అయితే కేంద్రం మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది.

English summary
AIIMS Director Dr Randeep Guleria said that India may see a third wave of the coronavirus pandemic if the virus continues to evolve further. He also rejected the night curfews and weekend lockdowns as ways to bring down the Covid-19 cases, saying they hardly work.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X