కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక..: యోగి కీలక వ్యాఖ్యలు

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. భారతీయ సంప్రదాయ వైద్య పద్ధతులైన ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, యునాని, హోమియోపతి విశ్వవ్యాప్తమౌతున్నాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.

లక్నో: కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక.. ప్రపంచదేశాలన్నీ భారత్ వైపు చూపులు సారించాయని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. భారతీయ సంప్రదాయ వైద్య విధానాలు విశ్వవ్యాప్తమౌతున్నాయని పేర్కొన్నారు. యోగాను ప్రపంచదేశాలన్నీ పాటిస్తోన్నాయని, ఏకంగా యోగా దినోత్సవాన్ని జరుపుకొంటోన్నాయని గుర్తు చేశారు.

మీరట్ లోని చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయంలో అఖిల భారతీయ ఆయుర్వేద మహా సమ్మేళనాన్ని ఆయన ప్రారంభించారు. మోదీ కృషి ఫలితంగా ఆయుర్వేదం వంటి భారత సంప్రదాయ వైద్య విధానాలు ప్రపంచమంతటా విస్తరిస్తోన్నాయని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, యునాని, సంప్రదాయ వైద్య పద్ధతులను ప్రధాని మోదీ ప్రోత్సహిస్తోన్నారని, దీనికోసం ప్రత్యేకంగా ఆయుష్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారని అన్నారు.

Indias medicinal systems such as ayurveda, yoga, naturopathy, unani expand all over the world

2015 నుంచి ప్రపంచం మొత్తం జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటోందని గుర్తు చేశారు. ఇది మోదీ చేసిన కృషి ఫలితమేనని వ్యాఖ్యానించారు. మొత్తం ప్రపంచాన్ని యోగా ఏకతాటిపైకి తీసుకొచ్చిందని చెప్పారు. ఈ భారతీయ సంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి, ఆయుర్వేదాన్ని ప్రోత్సహించడానికి మోదీ చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తోన్నాయని, వాటిని ఇప్పుడు మనం కళ్లారా చూస్తోన్నామని అన్నారు.

ఉత్తరప్రదేశ్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న వన్ డిస్ట్రిక్ట్-వన్ ప్రొడక్ట్ ఎగ్జిబిషన్‌ ను యోగి ఆదిత్యనాథ్.. ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్ ఖర్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ తో కలిసి ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో భారతీయ సంప్రదాయ వైద్య విధానాలపై చర్చిస్తారు.

Indias medicinal systems such as ayurveda, yoga, naturopathy, unani expand all over the world

కోవిడ్ వ్యాప్తిచెందిన సమయంలో ప్రతి ఒక్కరూ ఆయుర్వేదం విలువను గుర్తించారని జగ్ దీప్ ధన్ ఖర్ అన్నారు. బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ వైద్యులు కోరుకుంటే- యోగా, నేచురోపతిని అనుసంధానిస్తామని అన్నారు. ఔషధ మొక్కల పెంపకంలో ఉత్తరప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా ఆవిర్భవించిందని యోగి అన్నారు. దీనిద్వారా వేలాది మంది రైతులు లబ్దిపొందుతున్నారని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌- ఆయుర్వేద భూమిగా ఆయన అభివర్ణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+