దేశానికి మోడీ లాంటి పిఎం, రాష్ట్రాలకు కేజ్రి లాంటి సిఎం కావాలి: రాజీవ్ బజాజ్
ముంబై: భారతదేశానికి నరేంద్ర మోడీ లాంటి ప్రధానమంత్రి, దేశంలోని రాష్ట్రాలకు అరవింద్ కేజ్రివాల్ లాంటి ముఖ్యమంత్రి కావాలని బజాజ్ ఆటో ఎండి రాజీవ్ బజాజ్ అన్నారు. ప్రస్తుతం దేశంలో వాణిజ్య వాతావరణం బాగానే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎకనామిక్స్ టైమ్స్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాజీవ్ బజాజ్ పై వ్యాఖ్యలు చేశారు. ఎమోషనల్‌గా ఉండే భారతీయుల్లో ఉద్వేగాలు వేగంగా పెరిగినట్లే తిరిగి అంతే వేగంగా తగ్గిపోతాయని అన్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రివాల్ మెరుగ్గా పని చేస్తున్నారని రాజీవ్ చెప్పారు. ఢిల్లీ సిఎంగా ఉన్న కేజ్రివాల్‌కు ఢిల్లీలోని ప్రతి గల్లీతోపాటు ప్రతి అధికారిపైనా పూర్తి అవగాహన ఉందని బజాజ్ ప్రశంసించారు.

అంతమాత్రాన తాను ప్రధాని మోడీకి వ్యతిరేకం కాదని కూడా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మోడీ ముఖ్యమంత్రి కాదని, దేశాని ప్రధాని అని చెప్పిన ఆయన.. మోడీ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయన్నారు. అందుకు సమయం పడుతుందని చెప్పారు.
మొక్కను నాటిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రేస్‌కోర్స్ రోడ్డులోని పార్క్‌లో కదంబ్ స్లాపింగ్ అనే మొక్కను ప్రధాని నరేంద్ర మోడీ నాటారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేవకర్ పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications