పాక్ బంకర్ల ధ్వంసం, నౌగామ్‌లో టెర్రరిస్ట్‌ల కాల్చివేత
భారత్ - పాక్ సరిహద్దుల్లోని నౌగామ్ సెక్టార్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం ఇక్కడ ఉగ్రవాదులు, భారత సైన్యం మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో
శ్రీనగర్: భారత్ - పాక్ సరిహద్దుల్లోని నౌగామ్ సెక్టార్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఉగ్రవాదులు, భారత సైన్యం మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
మరోవైపు, అంతకుముందు పూంచ్ సెక్టార్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఓ బంకర్‌ను భారత భద్రతాబలగాలు పేల్చేశాయి. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ దళాలు జరిపిన కాల్పుల్లో ఇండియన్ ఆర్మీకి చెందిన ఒక జవాను, అతడి భార్య బలైన నేపథ్యంలో భారత జవాన్లు దీటుగా స్పందించారు.

పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖకు చేరువలో పాక్‌కు చెందిన ఒక సైనిక శిబిరాన్ని ధ్వంసం చేశారు. ఫలితంగా ఇద్దరు శత్రు సైనికులు, అయిదుగురు పౌరులు మరణించినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
పాక్‌కు చెందిన రెండు బంకర్లనూ ధ్వంసం చేసినట్లు తెలిపారు. మే 23న కూడా పాకిస్థాన్‌కు చెందిన కొన్ని సైనిక శిబిరాలను భారత్ ధ్వంసం చేసింది. పాక్ సైనిక బృందం.. ఇద్దరు భారత సైనికుల తలలను నరికేసిన నేపథ్యంలో ఈ దాడిని మన సైనికులు చేపట్టారు.
ఇదిలా ఉండగా, పాక్ సైన్యం పూంచ్ జిల్లాలో ఆదివారం మోర్టార్లు, ఆటోమేటిక్ ఆయుధాలతో మరోసారి కాల్పులకు దిగింది. భారత గ్రామాలు, సైనిక శిబిరాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు చేపట్టినట్లు పోలీసు అధికారులు చెప్పారు.
గత కొన్ని రోజులుగా సరిహద్దులో ఉన్న భారత గ్రామాలపై పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడుతోంది. దీంతో, పలువురు భారత పౌరులు గాయపడ్డారు. ఈ క్రమంలో, పాక్ బంకర్‌ను భారత్ ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో, సరిహద్దుల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.












Click it and Unblock the Notifications